Priyanka Jain: క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రియాంక జైన్ తల్లి.. కానీ!
మౌనరాగం సీరియల్ హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈమె బిగ్ బాస్ నుంచి వచ్చాకా అందరూ షాకయ్యే బ్యాడ్ న్యూస్ చెప్పింది. తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని వివరించి కన్నీరుమున్నీరు అయింది. అయితే తాజాగా ఈమె క్యాన్సర్ బారి నుంచి పూర్తిగా కోలుకుంది. ఆ విషయాన్ని నేరుగా ప్రియాంక జైన్ యే చెప్పుకొచ్చింది. కానీ ఇంకో రిజల్ట్ రావాలని కూడా వెల్లడించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ రెండు మూడు అద్భుతమైన సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషించిన ప్రియాంక జైన్ ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 7షోకు వెళ్లింది. అక్కడ టాస్క్ లతో పాటు మెంటల్ గా గేమ్ ఆడి టాప్ 5కి చేరుకుంది. అలాగే అక్కడ ఉండగానే తన ప్రేమ గురించి లివింగ్ రిలేషన్ గురించి చెప్పి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. ముక్యంగా తన ప్రియుడు శివ్ కుమార్ ను అందిరకీ పరిచయం చేసింది. బయటకు వచ్చాకా పెళ్లి కూడా చేసుకుంటామంటూ ప్రకటించింది. అయితే బయటకు వచ్చాకా మాత్రం పెళ్లి గురించి ఊసెత్తట్లేదు.

ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తీవ్ర నిరాశలో కూరుకుపోయిందీ క్యూట్ బ్యూటీ. ఆమెకు గర్భాశయ క్యాన్సర్ వచ్చినట్లు తెలుసుకుని ఆ విషయాన్ని యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిమానులకు తెలిపింది. ఆ తర్వాత కూడా కీమో థేరపీ చేయిస్తూ.. తల్లి జుట్టు ఊడిపోతుందేమోనని కన్నీరు పెట్టుకుంది. అమ్మ అలా బెడ్ పై ఉంటే చూడలేకపోతున్నానంటూ ఆవేదన చెందింది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన తల్లి పూర్తిగా క్యాన్సర్ బారి నుంచి కోలుకుందని వెల్లడించింది.
అయితే ఇంకో రిపోర్టు తమ చేతికి రావాలని అందులో ఏమీ లేదని వస్తే.. పూర్తిగా ఆమె క్యాన్సర్ బారి నుంచి కోలుకున్నట్లేనని వెల్లడించింది. అయితే ఆ రిపోర్టులో కూడా ఏమీ లేదని వస్తుందని.. స్కానింగ్ చేసిన వైద్యుడు చెప్పాడట. ప్రస్తుతం ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఈ గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే ప్రియాంక జైన్ తల్లి.. కూతురును కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. తల్లిని తొలిసారి చూసిన ప్రియాంక చాలా ఎమోషనల్ అయింది. నెల రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి కోలుకుని దగ్గరకు రాగానే ఫుల్ ఖుషీ అయిపోయింది.

ఈ ఆనందం సమయంలోనే తన తల్లిని కాపాడిన వైద్యులు అందరికీ థాంక్స్ చెప్పింది. అలాగే తన తల్లి త్వరగా కోలుకోవాలని మొక్కుకున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అన్నదానం చేయించింది. శివ్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్న ప్రియాంక.. తన తల్లికోసమే ఇదంతా చేసింది. ముఖ్యంగా తల్లికి తన చేతులతో అన్నం తినిపించి, ఆమె కూడా తింది. చాలా హాయిగా అనిపిస్తుందంటూ.. గుడిలో కూర్చొనే తన తల్లి ఆరోగ్యం గురించి అనేక విషయాలు చెప్పింది. ఏదేమైనా త్లలి కోలుకోవడంతో ప్రియాంక జైన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


Click it and Unblock the Notifications










