Priyanka Singh: హాస్పిటల్‌లో ప్రియాంక సింగ్.. 10 రోజులుగా నరకం!

బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్, హాట్ బ్యూటీ ప్రియాంక సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ఈమె ట్రాన్స్ జెండర్ యే అయినప్పటికీ.. అమ్మాయిల కంటే కూడా అందంగా కనిపిస్తూ రచ్చ చేస్తుంది. ఆడాళ్లే అసూయ పడే అందాలు కల్గిన ఈమె పరిస్థితి ప్రస్తుతం అస్సలే బాలేదు. ఆస్పత్రి పాలై ప్రస్తుతం నరకం చూస్తోంది. గత 10 రోజులుగా ఈమె హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటోందట. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లు వేస్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అబ్బాయిగా ఉండగానే.. ఈ షోలో జాయిన్ అయిన ఈమె ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఆ షోను మానేసింది. చాలా రోజుల పాటు ఆమె తెరమరుగు అయింది. ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత ఆమె హెల్త్ సెట్ అవ్వడానికే రెండేళ్ల పట్టిందట. అలా చాలా కాలం తర్వాత ఆరోగ్యం బాగు కాగా.. మెల్లి మెల్లిగా బయట కనిపించడం ప్రారంభించింది. అనేక షోలు చేస్తూ తెగ ఫేమ్ తెచ్చుకుంది.

Bigg Boss Beauty Priyanka Singh Get Hospitalized Check Details

అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సెలెక్ట్ అయింది. ఇలా బిగ్ బాస్ కు వెళ్లాకా.. తన బిహేవియర్, క్యారెక్టర్ చూసి అనేక మంది ఈమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక షోలో ఉన్నప్పుడు ఎక్కువగా మానస్ చుట్టూ తిరిగిందీ ముద్దుగుమ్మ. మిగతా వాళ్లతో కూడా చాలా బాగా కలిపిసోయి.. ఎక్కువగా స్నేహం ఏర్పరుచుకుంది. అలాగే సింగర్ శ్రీరామ చంద్రకు తనకు తెలిసిన వైద్యం చేసి అనేక సమస్యలు వచ్చేలా చేసింది. ఐస్ లో నిల్చుని టాస్క్ ఆడి కాళ్లకు చర్మం ఊడిపోగా.. జండుబామ్ రాసి వాటిని మరింత ఎక్కువ చేసింది.

Bigg Boss Beauty Priyanka Singh Get Hospitalized Check Details

అయితే ఇప్పుడు కూడా తనకు తెలిసిన ఓ పిచ్చి వైద్యం చేసుకుని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఢీ జోడీ.. డ్యాన్స్ షో చేస్తోంది. యాంకర్ శివతో కలిసి ఈమె స్టెప్పులు వేస్తుండగా.. ఆ పర్ఫార్మెన్స్ కోసం విపరీతంగా ప్రాక్టీస్ చేస్తుందట. అయితే అలవాటు లేని పని కావడంతో విపరీతంగా బాడీ పెయిన్స్ రావడం.. దీంతో ఎక్కువగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు యూజ్ చేసిందట. అలా మాత్రలు వేసుకుని వేసుకుని ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంది. ముఖ్యంగా కిడ్నీలు కూడా పాడయ్యే స్థితికి చేరుకుంది.

ప్రస్తుతం డీహైడ్రేషన్ ఎక్కువై.. విపరీతమైన జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గత పది రోజులుగా ఆస్పత్రిలో ఉన్న ఈమె అనేక సమస్యలు ఎదుర్కుంటోంది. మాట్లాడేందుకు కూడా ఓపిక లేక అనేక రకాల ఇన్ఫెక్షన్ లతో నరకం చూస్తోందట. అయితే తాను చేసిన తప్పు మరెవరూ చేయకూడదనే ఉద్దేశంతో.. దీన్నంతటినీ వీడియో చేసి మరీ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. తాను చేసిన ఒక్క తప్పు వల్ల ఆస్పత్రి పాలై అనేక సమస్యలు ఎదుర్కుంటున్నట్లు వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X