BiggBoss Telugu 7: బిగ్ బాస్ విజేతతో రతికా రోజ్ బ్రేకప్... ఆ కంటెస్టెంట్ ఎవరంటే?
ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ ఆసక్తికరమైన కంటెస్టెంట్లను తీసుకువస్తారు అనుకుంటే ఊరు పేరు లేని కంటెస్టెంట్లను తీసుకువచ్చారని కొందరు మండిపడుతున్నారు. వారిలో కొందరు తెలిసినవారే అయినా మరికొందరు అసలు ఏమాత్రం తెలియని వారు కావడంతో ఎవర్రా మీరంతా అని సోషల్ మీడియాలో నెటిజన్లో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అందరి సంగతి పక్కన పెడితే హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ అనే అమ్మాయి గురించి మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
రతికా రోజు అనే అమ్మాయి అచ్చ తెలుగు తెలుగమ్మాయి అనే తెలుస్తోంది. వాస్తవానికి ఆమె పేరు ప్రియా అయితే పేరు మార్చుకుని రతికా రోజ్ గా కొన్ని సినిమాలు చేసినట్లుగా చెబుతున్నారు. నిజానికి ఆమె పేరు ప్రియా. ఈటీవీ లో పటాస్ షో నడుస్తున్న సమయంలో ఆమె ప్రియ పేరు మీదే స్టాండ్ అప్ కామెడీ కూడా చేసింది. ఆ తర్వాత రతికగా మారి షకలక శంకర్ హీరోగా నటించిన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడమే కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సార్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపించింది.

అంతకుముందే రతిక పలు వెబ్ సిరీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా కనిపించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమెకు ఒక మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి మధ్య ప్రేమాయణం నడిచిందని తర్వాత బ్రేకప్ కూడా అయిందని టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ మరెవరో కాదు. రాహుల్ సిప్లిగంజ్ అని అంటున్నారు.
అసలు వీరిద్దరికీ పరిచయం ఏమిటి అనుకుంటున్నారా గతంలో రాహుల్ బిగ్ బాస్ లోకి రాకముందు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసేవాడు. అలా 2019లో వీరిద్దరూ కలిసి హే పిల్ల అనే ఒక యూట్యూబ్ ఆల్బమ్ కూడా చేసి రిలీజ్ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తర్వాత రాహుల్ సిప్లి గంజ్ బిగ్ బాస్ కి వెళ్లడంతో దూరం పెరిగిందని కూడా అంటున్నారు.

అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఈ మేరకు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తో ప్రేమాయణం విఫలమైన మాట వాస్తవమే. కానీ ఆ వ్యక్తి ఎవరు అనే మాట చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నారు. రతికా రోజ్ సన్నిహితులు అయితే సోషల్ మీడియా జనం మాత్రం ఖచ్చితంగా రాహుల్ సిప్లిగంజ్ లవ్ చేసి బ్రేకప్ చెప్పి ఉంటాడని అంటున్నారు.

ఎందుకంటే గతంలో రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ లో ఉన్న సమయంలో పునార్ణవితో ప్రేమాయణం నడపడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని అందరం అనుకున్నారు. తర్వాత అషు రెడ్డితో కూడా అదే విధమైన క్లోజినెస్ మైంటైన్ చేశాడు. కానీ మనోడు మాత్రం సింగిల్గానే ఇప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక రతిక హౌస్ లో అడుగు పెట్టగానే బ్రేకప్ నుంచి బయట పడ్డవా అని అడిగిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











