Rathika Rose: ఆ స్టార్ హీరో సినిమాలో రతికా రోజ్.. బిగ్‌బాస్ బ్యూటీ బంపరాఫర్ కొట్టేసిందిగా!

బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ షోలో లవ్ ట్రాక్ నడిపి విపరీతమైన నెగిటివీటిని సొంతం చేసుకుంది. తాను చేసే పనులతో పలువురిని ఇబ్బంది పెడుతూ... త్వరలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి అదిరిపోయే అవకాశాలు అందిపుచ్చుకుంటూ సందడి చేస్తుంది. ఇటీవలే రెండు పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేశానని చెప్పిన ఈ బ్యూటీ తాజాగా ఓ స్టార్ హీరోతో స్క్రీన్ పంచుకోబోతున్నట్లు వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో చాలా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన రతికా రోజ్ అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో అడుగు పెట్టిన ఈమె రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవలు పెట్టుకుంది. మొదట్లో స్నేహంగా, ప్రేమగా ఉన్నట్లు కనిపించి ఆ తర్వాత అతడిపైనే నెగిటివ్ అయింది. దీంతో ఆమెకు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అలా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ బయటకు వచ్చాకా తనపై ఉన్న నెగిటివిటీని చూస్కుని బయటపడిన ఆమె మరోసారి హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Beauty Rathika Rose Get Chance to Act in Tamil Star hero Movie

కానీ ఆ తర్వాత పూర్తిగా తన పద్ధతి మార్చుకున్న ఈమె శివాజీ, ప్రశాంత్, యావర్ లతో స్నేహంగా ఉంటూ తనపై వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వచ్చేముందు వారితో మరోసారి గొడవపడి షాక్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా కోకంటెస్టెంట్లతో కలవని ఈమె.. కెరియర్ లో ముందుకు వెళ్లేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి ఫోకస్ కెరియర్ పైనే పెట్టిన ఈమె ఇటీవలే రెండు సినిమాల్లో ఛాన్సులు కొట్టేశానని... కానీ వాటిని ఇప్పుడే రివీల్ చేయలేనంటూ వివరించింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు వచ్చిన ఓ సినిమా ఆఫర్ గురించి రివీల్ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా తనపై ఓ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ను జత చేసి మరీ తాను త్వరలోనే ఓ స్టార్ హీరోతో స్క్రీన్ పంచుకోబోతున్నట్లు చెప్పింది. అయితే ఆయన మరెవరో కాదు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి. ఈయన ఒక్కరే కాకుండా హీరో విజయ్ సేతుపతితో కూడా తాను ఓ సినిమా చేస్తానని చెప్పుకొచ్చింది. చూడాలి మరి ఏం జరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X