బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శోభాశెట్టి.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. వీడియో వైరల్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో కంటెస్టెంట్ పాల్గొన్న కార్తీకదీపం సీరియల్ నటి శోభాశెట్టి గురించి అందరికీ తెలిసిందే. మొదటి వారమే హౌస్ లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన ఆట తీరుతో అనేక మందిని అలరించింది. సీరియల్ లో విలన్ గా నటించిన ఈమె.. షోలో అమర్ దీప్, ప్రియాంక జైన్ లతో చాలా క్లోజ్ గా ఉండి తన ఫ్రెండ్ షిప్ ను చూపించింది. గట్టిగా నోరేసుకుని అరుస్తూనే అందర్నీ హడలెత్తించింది. అయితే బిగ్ బాస్ షోకు రాకముందు వరకు సింగిల్ గానే ఉన్నాని చెప్పిన ఈ హాట్ బ్యూటీ.. షోలో తొలిసారిగా తన ప్రియుడి గురించి చెప్పించింది.
ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు 7.. 10వ వారంలో ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు అంతా హౌస్ లో అడుగు పెట్టారు. ఆ వారంలోనే సండే రోజు.. శోభాశెట్టి తండ్రితో పాటు ఆమె ప్రియుడు.. కార్తీకదీపం సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డి వచ్చాడు. తొలిసారి బాయ్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన ఈమె ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాకిచ్చింది. శోభాశెట్టి ఫ్యాన్స్ అంతా ఆమె లవర్ ను చూడగానే స్టన్ అయిపోయారు. చాలా రోజుల పాటు ఆమె గురించి, ఆమె ప్రియుడి గురించే చర్చించుకున్నారు.

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతోంది. ఎక్కడకు వచ్చిన అతడిని వెంట పట్టుకునే వస్తుంది. ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత గ్రాండ్ గా వెల కమ్ చెప్పాడు యశ్వంత్. అయితే దాని తర్వాత నుంచి యూట్యూబ్ లో బాగానే సందడి చేస్తున్న ఈమె బుల్లితెరపై మాత్రం కనిపించలేదు. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ అనే న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్ లో కనిపించబోతుంది. తాజాగా ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

అయితే ప్రోమోలో భాగంగా శోభాశెట్టి ముందుగా రాగా.. ఆమె బాయ్ ఫ్రెండ్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈక్రమంలోనే స్టేజీపై ప్రియుడిని చూసి షాకైన శోభా... ఎంట్రా నువ్వు ఇక్కడ అంటూ అడిగింది. దానికి యశ్వంత్ తెగ సిగ్గుపడిపోగా.. యాంకర్ శ్రీముఖి అదేం ప్రశ్న తల్లి అని అడుగుతుంది. దీనికి వెంటనే శోభాశెట్టి తనకు ఇలాంటి షోలకు రావడం ఏమాత్రం ఇష్టం ఉండదు.. అలాంటిది తొలిసారి ఈ షోకు రావడం చూసి షాకయ్యాను అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉండే యశ్వంత్ రెడ్డి తొలిసారి తన ప్రియురాలికి ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.
షో కు వచ్చేటప్పుడు ఓ రెడ్ రోజ్ తీసుకుని వచ్చి మోకాళ్లపై కూర్చుని మరీ శోభాకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఐ లవ్ యూ టూ అంటూ క్యూట్ గా చెప్పేసింది. ఇక ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న ఉంగరాన్ని స్టేజీమీదే తన ప్రియురాలు శోభాశెట్టికి తొడిగేశాడు యశ్వంత్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తైగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో చూసేయండి. ఇంకా పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఆదివారం రిలీజ్ కాబోయే ఈ పూర్తి ఎపిసోడ్ ను కూడా చూడండి.


Click it and Unblock the Notifications











