ఈసారి నిజంగానే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభాశెట్టి.. ఇంత సింపుల్‌గా ఎందుకబ్బా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొన్న శోభాశెట్టి గురించి అందిరకీ తెలిసిందే. మొదటి వారమే హౌస్ లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన ఆట తీరుతో అనేక మందిని అలరించింది. సీరియల్ లో విలన్ గా నటించిన ఈమె.. బిగ్ బాస్ లో కూడా సీరియల్ నటులతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటూ గేమ్ ఆడింది. బిగ్ బాస్ షోకు రాకముందు వరకు సింగిల్ గానే ఉన్నాని చెప్పిన ఈ హాట్ బ్యూటీ.. షోలో తొలిసారిగా తన ప్రియుడి గురించి చెప్పించింది. ఆ తర్వాత నుంచి కలిసి వరుసగా వీడియోలు చేస్తున్న ఈమె తాజాగా కుటుంబ సభ్యుల అందిర ముందు నిశ్చితార్థం చేసుకుంది. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ షోలో ఉండగా.. ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఏకంగా శోభా ప్రియుడు స్టేజీ మీదకు వచ్చి అందరికీ షాకిచ్చాడు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో నిరుపమ్ తమ్ముడిగా నటించిన ఇతడే.. మోనిత రియల్ లైఫ్ లవర్ అని తెలుసుకుని షాక్ అయ్యారు. అలా మొదటి సారి షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి కూడా వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూ వస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతోంది. ఎక్కడకు వచ్చిన అతడిని వెంట పట్టుకునే వస్తుంది.

అయితే తాజాగా ఈమె తన ప్రియుడును తొలిసారి తన సొంతూరికి తీసుకెళ్లింది. బెంగళూరులోని నివాసానికి శోభాశెట్టి, యశ్వంత్ రెడ్డిలు కలిసే వెళ్లారు. అయితే దీన్నంతా వీడియోగా తీసి శోభా తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టింది. అక్కడకు వెళ్లాక వరు చేసిన హంగామా అంతూ కూడా కనిపించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో వీడియో పెట్టింది. అందులో అందంగా, పెళ్లి కూతురులా ముస్తాబై సందడి చేసింది. ముఖ్యంగా తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పి.. ఈరోజే ఎంగేజ్ మెంట్ జరిగిందని వీడియో కూడా చూపించింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ అంతా షాకవుతున్నారు.

కాజ్యువల్ గా ఊరెళ్లిన వీళ్లు ఇలా సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం ఏంటా అని అనుకుంటున్నారు. అవే ప్రశ్నలను కామెంట్ల రూపంలో అడుగుతున్నారు అయితే నాలుగు రోజల క్రితం సొంతూరు వెళ్లిన శోభాశెట్టి ముందుగానే నిశ్చితార్థానికి ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ అక్కడే అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. యశ్వంత్ తల్లిదండ్రులు అక్కడకు వెళ్లగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఈ వేడుక జరిగినట్లు అర్థం అవుతోంది. మీరూ కూడా ఓసారి ఈ వీడియో చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











