నిశ్చితార్థం అయ్యాక శోభాశెట్టి, యశ్వంత్‌ల మధ్య గొడవలు.. అతడి వల్లేనంటూ ఏడుస్తూ వీడియో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొన్న శోభాశెట్టి గురించి అందిరకీ తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రియుడితో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఆమె పుట్టిన రోజునాడే కుటుంబ సభ్యుల అందరి ముందు ప్రియుడు యశ్వంత్ రెడ్డి ఆమె చేతికి ఉంగరం తొడిగి సగం పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎంగేజ్ మెంట్ జరిగి పది రోజులు కూడా కాకముందే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి అంతటికీ కారణం బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ యేనట. అతడు ఎవరు, వీరిద్దరి మధ్య గొడవ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న శోభాశెట్టి.. సీరియల్ నటులు అమర్ దీప్, ప్రియాంక జైన్ లతో పాటు టేస్టీ తేజతో కూడా ఎక్కువగా కలిసి ఉంది. అతడితో చాలా క్లోజ్ గా ఉన్న ఆమె.. మధ్య మధ్యలో తన ప్రియుడు ఏం అనుకుంటున్నాడో అని కూడా బాధ పడింది. మనిద్దరి మధ్య బంధాన్ని తప్పుగా అనుకుని బ్రేకప్ చెప్పేస్తాడా అని కూడా చాలా సార్లు హౌస్ లో ఉండగానే అందరి ముందు చెప్పింది. చివరకు అదే నిజం అయింది. తాజాగా శోభాశెట్టి తన యూట్యూబ్ ఛానెల్ వేధికగా ఓ వీడియోను విడుదల చేసింది.

Bigg Boss Beauty Shobha Shetty Fight With Her Boy Friend Due to Tasty Teja Behaviour Check Details

అందులో భాగంగానే మాట్లాడుతూ.. తనకు, తన ప్రియుడు యశ్వంత్ రెడ్డికి మధ్య గొడవలు వస్తున్నాయని టేస్టీ తేజకు ఫోన్ చేసి మరీ చెప్పింది. నీవల్లే మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయని.. మేమిక కలిసి ఉండలేమంటూ చెప్పుకొచ్చింది. నీతో క్లోజ్ గా ఉండడం.. నువ్వు నా గురించి బయట తప్పుగా మాట్లాడుతున్నావట అంటూ టేస్టీ తేజను కడిగి పారేసింది. కానీ అతడు మాత్రం అదేం లేదే.. నేనెప్పుడూ నీ గురించి తప్పుగా మాట్లాడలేదు.. నీకసలు ఎవరు చెప్పారు అంటూ చాలా బాధ పడ్డాడు. మరోవైపు శోభాశెట్టి కూడా కన్నీరు పెట్టుకుంటూ మా మధ్య గొడవలకు నువ్వే కారణం అంటూ అరిచింది.

ఇదంతా వింటున్న టేస్టీ తేజ కూడా నువ్వు బాధ పడుతుంటే నాకు ఏడుపు వస్తుంది.. నేనేం తప్పు చేయలేదే అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ శోభాశెట్టి మాత్రం అవేవీ పట్టించుకోకుండా అతడిదే తప్పు అన్నట్లుగా మాట్లాడింది. నేను ఎలాంటి వాడినో యశ్వంత్ కు బాగా తెలుసు, నాకంటే కూడా నీవు ఎలాంటి దానివో అతడికి మరింత ఎక్కువగా తెలుసంటూ టేస్టీ తేజ అన్నాడు. ఆయన చాలా మంచి వాడు.. ఇలా తప్పుగా అస్సలే ఆలోచించడు, అందులోనూ మనిద్దరి మధ్య ఏదో ఉందంటే నమ్మేంత పిచ్చివాడు కాందటూ చెప్పుకొచ్చాడు.

Bigg Boss Beauty Shobha Shetty Fight With Her Boy Friend Due to Tasty Teja Behaviour Check Details

ఇదంతా విన్న శోభాశెట్టి.. యశ్వంత్ అన్నీ నిజాలే చెబుతాడు కానీ నేను మాత్రం అబద్ధాలు చెబుతానా అంటూ మళ్లీ రివర్స్ అయింది. చాలా రోజులుగా నీ వల్ల నేను బాధ పడుతున్నాను కాబట్టే ఫోన్ చేయట్లేదంటూ వివరించింది. ఇలా చాలా సేపు అతడితో ఓ ఆట ఆడుకున్న ఆమె చివరగా సారీ తేజ ఇదంతా ప్రాంక్ అంటూ తెలిపింది. ఆమె టేస్టీ తేజకు ప్రాంక్ కాల్ చేసి ఇలా ఆటాడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X