జారే చీరలో నెరజానలా బిగ్‌బాస్ బ్యూటీ.. సన్నగా కనిపిస్తున్న ఈ చందమామను గుర్తించారా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొన్న శోభాశెట్టి గురించి, ఆమె అందాలు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సీరియల్స్ చేసే ఈమె ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్ పై మాత్రమే ఫోకస్ పెట్టింది. లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ రచ్చ చేస్తున్న ఈమె.. రోజురోజుకూ తెగ అందంగా తయారవుతోంది. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా జారే చీర కట్టుకుని నెరజానలా ముస్తాబైంది. సన్నగా సన్నజాజి పూవులా కనిపిస్తూనే.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీకదీపం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకు కూడా వెళ్లింది. అక్కడ ఉండగానే ఫ్యామిలీ వీక్ లో భాగంగానే శోభాశెట్టి ప్రియుడిని స్టేజీ మీదకు తీసుకు వచ్చి అందరికీ షాకిచ్చారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా కూడా ఆ షాకులు ఇవ్వడాన్ని ఆపట్లేదీ జంట. రెండు మూడు సార్లు నిశ్చితార్థం చేసుకుని, ఓ ఇల్లు కూడా కొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్న ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన అందమైన గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా.. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు పోస్ట్ చేసింది. అందులో స్కై బ్లూ కలర్ జారే చీర కట్టుకుని నెరజానలా ముస్తాబైంది. అదిరిపోయే ఫొజోలు పెడుతూనే... సన్నజాజి పూవులా సన్నగా కనిపిస్తూ కొంటెగా చూస్తోంది. శోభాశెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ముఖ్యంగా స్కై బ్లూ కలర్ జారే చీరకు మ్యాచింగ్ గా స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుంది. పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుని మరీ మెడలో ఏమీ వేసుకోకుండా కనిపించింది. అలాగే హెయిర్ లీవ్ చేసుకుని... చేతికి ఓ సింపుల్ బ్రేస్ లెట్ పెట్టి సింపుల్ గా... తెగ టెంప్టింగ్ గా ముస్తాబైంది. అదిరిపోయే ఫోజులు పెడుతూ.. అందరినీ మాయ చేస్తోందీ ముద్దుగుమ్మ. శోభాశెట్టిషేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు.
పెళ్లి కళ వచ్చేసిందని కొందరు.. ఎంత ముద్దుగా కనిపిస్తున్నావు మోనితా అంటూ మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాలను చూస్తున్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేస్తూ.. శోభాశెట్టిని సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ముద్దుగుమ్మ మెస్మరైజింగ్ షోపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











