Siri Hanumanth: అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిన సిరి.. ఈ సొగసరిని చూస్తే!
బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తోంది. అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ లాగే అందాలు ఆరబోస్తూ... అందరినీ తెగ అలరిస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తాజాగా అదిరిపోయే చమ్మీల డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ఈ స్టన్నింగ్ షోకు నెటిజెన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. అయితే ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కెరియర్ ప్రారంభంలో యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఉండేదీ ముద్దుగుమ్మ. షార్ట్ ఫిల్మ్స్ లో నటించడంతో పాటు డ్యాన్స్ వీడియోలు కూడా చేసేది. అలాగే టిక్ టాక్ లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకు వెళ్లింది. అక్కడే తోటి యూట్యూబల్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి గేమ్ ఆడింది. స్నేహితులం అని చెప్పుకుంటూ అంతకు మించి క్లోజ్ గా ఉన్నారు. దీని వల్ల వీరికి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది.

అయితే వీరు బిగ్ బాస్ కు వెళ్లడం కంటే ముందుగానే వీరిద్దరికీ బయట ప్రేమికులు ఉండడం.. హౌస్ లో వీరిద్దరూ మరీ క్లోజ్ గా ఉండడంతో అలా నెగిటివిటీ వచ్చేసింది. తమ బంధం బయట ఎలా కనిపిస్తుందో, బయటకు వెళ్లాక తమ జీవితాలు ఎలా ఉంటాయోనని వాళ్లు తెగ భయపడిపోయారు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ లవర్ అతడికి బ్రేకక్ చెప్పగా సిరి బాయ్ ఫ్రెండ్ మాత్రం తనతోనే ఉన్నాడు. భవిష్యత్తులో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్న ఈమె కెరియర్ లోనూ దూసుకుపోతుంది.
కేవలం వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోలు చేసే ఈమె ఇటీవలే బాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం సినిమాల్లో చేస్తున్న ఈమె జబర్దస్త్ షో యాంకర్ గా కూడా కొనసాగుతోంది. అలా తన అందం, అభినయాన్ని కనిపిస్తూ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ఇలా తాను ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వస్తోంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా చమ్మీల డ్రెస్ వేసుకుని మరీ సోకులు ఆరబోసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ అందరనీ ఆహా అనిపిస్తోంది. సిరి హన్మంత్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీవు మరిన్ని తెలుగు సినిమాల్లో నటించి మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











