చిన్నగా ఉందని ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నా : బిగ్‌బాస్ బ్యూటీ
సినీ ఇండస్ట్రీలో లుక్, గ్లామర్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలామంది సెలబ్రిటీలు తమ రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి కాస్మోటిక్ సర్జరీలు, ఫిల్లర్స్ వంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. అయితే కొందరు ఈ విషయాన్ని బయటపెట్టకుండా దాచిపెడుతుంటే, మరికొందరు మాత్రం ఓపెన్‌గా అంగీకరిస్తుంటారు. తాజాగా ఓ బిగ్‌బాస్ బ్యూటీ కూడా తాను సర్జరీ చేయించుకున్న విషయాన్ని స్వయంగా బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు?
ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో కాదు.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ సత్య.సీరియల్స్, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ... అయితే.. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తన లుక్ కారణంగా అవకాశాలు మిస్ అవుతున్నాయని చెప్పడం, దాన్ని మార్చుకోవడానికి లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నానని ఓపెన్‌గా చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీ సత్య కెరీర్‌ను పరిశీలిస్తే... షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించి 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 6లో పాల్గొని తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దాదాపు 100 రోజులకు పైగా హౌస్‌లో కొనసాగి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అయితే ఈ స్థాయి పాపులారిటీ ఉన్నప్పటికీ, సినిమా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని ఆమె చెబుతోంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "సినిమాల్లో కనిపించాలనేది నా కల. కానీ ఎంత ప్రయత్నించినా ఆఫర్లు రావడం లేదు. నేను సీరియల్స్ చేస్తున్నానని కొందరు మూవీ ఛాన్సులు ఇవ్వడం లేదు" అంటూ ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్గీకరణను ఆమె ప్రస్తావించింది. అంటే బుల్లితెర నటులపై ఉన్న స్టీరియోటైప్ ఇంకా కొనసాగుతోందనే సంకేతం ఆమె మాటల్లో కనిపిస్తోంది.
ఇక తన లుక్ విషయంలో కూడా ఎదురైన అనుభవాలను ఆమె బహిరంగంగా చెప్పింది. "నువ్వు చిన్నపిల్లలా కనిపిస్తున్నావు... స్క్రీన్‌పై మెచ్యూర్‌గా కనిపించడంలేదు" అనే కామెంట్స్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని తెలిపింది. ఈ నేపథ్యంలోనే లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నానని స్పష్టం చేసింది. ఇది శాశ్వతం కాదని, కేవలం కొన్ని నెలల కోసం మాత్రమే చేసుకున్నానని కూడా క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ నిర్ణయం ఆమెకు మిక్స్‌డ్ రియాక్షన్స్ తెచ్చింది. సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా ట్రోల్ చేయగా, మరికొందరు మాత్రం ఆమె ఓపెన్‌గా మాట్లాడిన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే... "ఇప్పుడే మెచ్యూర్‌గా కనిపిస్తున్నావు" అంటూ ఇండస్ట్రీ వాళ్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారని ఆమె చెప్పడం. ఇది సినిమా రంగంలో లుక్, ఇమేజ్ ఎంత ప్రభావం చూపిస్తుందో మరోసారి స్పష్టమవుతోంది.
మరోవైపు ఆమె 'టిల్లు స్క్వేర్' సినిమాలో కనిపించినా, తన సీన్స్ కట్ కావడం కూడా ఆమె కెరీర్‌లో ఒక మైనస్‌గా మారింది. ఇలా చిన్నచిన్న అవకాశాలు వచ్చినా పూర్తి స్థాయిలో ఉపయోగపడకపోవడం ఆమె కెరీర్‌ను ప్రభావితం చేస్తోందని చెప్పొచ్చు. ప్రస్తుతం టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు, ప్రైవేట్ ఆల్బమ్‌లతో బిజీగా ఉన్నా... సినిమా రంగంలో బ్రేక్ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఇక వ్యక్తిగత జీవితంపై కూడా శ్రీ సత్య షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని, "ఫీలింగ్స్ చచ్చిపోయాయి" అని చెప్పడం మరింత చర్చకు దారి తీసింది. అలాగే డ్యాన్స్ షోలలో ఎవరి తోడైనా పనిచేస్తే వారితో రిలేషన్ అంటగడుతున్నారని, సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్స్ బాధ పెడుతున్నాయని కూడా వెల్లడించింది.


Click it and Unblock the Notifications




