విమానంలో సీరియల్ నటికి వేధింపులు.. తాగి నానా రచ్చ.. పబ్లిక్ ప్రాపర్టీనా అంటూ ఆవేదన!
వెరైటీ డ్రెస్సులు, విభిన్నంగా అందాల ఆరబోత, ట్రోలింగ్, బెదిరింపులు, వివాదాలు ఇవన్నీ ఒక్క అందమైన బొమ్మలో కలబోస్తే ఆమెనే ఉర్ఫీ జావేద్. బిగ్ బాస్, సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటి వేసిన డ్రెస్సులు మొదట్లో చూసిన నెటిజన్లు షాక్ అయ్యేవారు. రోజుకో వింత డ్రెస్సుతో మరింత విభిన్నంగా కనిపించేది ఈ చిన్నది.
అయితే రాను రాను ఉర్ఫీ జావేద్ స్టైల్ కు అలవాటు పడిపోయారు. నిత్యం ఏదో ఒక ట్రెండీ వేర్ లో డిఫరెంట్ గా కనువిందు చేసే ఈ బ్యూటిఫుల్ కు తాజాగా విమానంలో చేదు అనుభవం ఎదురైంది. తానేమైనా పబ్లిక్ ప్రాపర్టీనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

సినీ ప్రపంచంలో: ఉర్ఫీ జావేద్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు. ఎందుకంటే వెరైటీ డ్రెస్సులు, ఎవరు ప్రదర్శించని తీరులో అందాల ఆరబోతతో నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడలింగ్ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో అందులో నుంచే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది.

నిలదొక్కుకునేలా: కాంట్రవర్సీలతో, హాట్ ఫొటోషూట్ లతో నిత్యం సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్ లో ఉంటుంది ఉర్ఫీ జావేద్. తన ట్రెండీ వేర్ తో నిత్యం నెటిజన్లు ఔరా అనిపించే ఈ బ్యూటిఫుల్ లక్నోలో పుట్టి పెరిగింది. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. కానీ తను అనుకున్నంత త్వరగా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు.

ప్రత్యేకమైన గుర్తింపు: చిత్ర పరిశ్రమలో ఉర్ఫీ అనుకున్నంతలా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర రంగంమైన టెలివిజన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అక్కడైన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలన్న ఉద్దేశంతో సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం లభించింది.

సీరియల్స్: 2021లో ప్రసారమైన బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది వెరైటీ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఇక బిగ్ బాస్ హౌజ్ ను వీడాక MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే పాత్రతో ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది. మేరీ దుర్గా, బేపన్నా, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2, 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

చేదు అనుభవం: ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ డిఫరెంట్ దుస్తులతో దర్శనం ఇచ్చే ఉర్ఫీ జావేద్ కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తాను ముంబై నుంచి గోవా వెళ్తున్న సమయంలో జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఇండిగో విమానంలో చిత్రీకరించని వీడియోను షేర్ చేసింది ఉర్ఫీ. ఈ వీడియోలో కొంతమంది ఉర్ఫీ ముందు కూర్చున్నారు. మరికొంతమంది సీట్ల నుంచి లేచి నిలబడి ఉన్నారు.

తాగి ఉన్నాడు: అందరూ నవ్వుతున్నట్లుగా కనిపించిన ఆ వీడియోలో ఉర్ఫీ సౌండ్ ను మ్యూట్ చేసింది. "నేను ముంబయి నుంచి గోవా వెళ్తుండగా నన్ను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేశాడు. నన్ను ఉద్దేశించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. నేను వారితో వాదనకు దిగా. ఆ సమయంలో వాళ్లలో ఒకరు.. మా ఫ్రెండ్ తాగి ఉన్నాడు. వదిలేయండి అని అన్నారు. తాగితే మహిళలను వేధిస్తారా అంటూ గట్టిగానే మాట్లాడా? అంతేకాదు నేను పబ్లిక్ ఫిగర్ నే కానీ, పబ్లిక్ ప్రాపర్టీనైతే కాదు కదా" అని ఉర్ఫీ తన పోస్టులో రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











