3 నెలలుగా రొమాన్స్, శృంగారానికి దూరంగా.. బిగ్‌బాస్ బ్యూటి షాకింగ్ కామెంట్స్
విచిత్రమైన వేషధారణతో , హాట్ హాట్ ఫోటోలు, కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు ఉర్పీ జావెద్. రకరకాల వస్తువులతో డ్రెస్సులు డిజైన్ చేయించుకుని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈమె లైఫ్ స్టైల్ కూడా మిగిలిన స్టార్స్ మాదిరిలా కాకుండా డిఫరెంట్‌గా ఉంటుంది. బిగ్‌బాస్ షోలో తన బిహేవియర్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని , ఇంటిల్లిపాదికి చేరువైంది. ఏదో ఒక ఇష్యూని కెలుకుతూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్‌లో ఉండనిదే ఉర్ఫీకి నిద్రపట్టదంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తుంటారు.
కొద్దిరోజుల క్రితం బాగా కమిలిపోయిన ముఖంతో ఆమె పెట్టిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్లు .. ఉర్ఫీకి ఏమైనా అయ్యిందేమోనని భయపడ్డారు. ఆ కాసేపటికే తనకు ఎదురైన సమస్యను పంచుకుంది. తాను ఫిల్లర్స్‌ను అధికంగా వాడినందున ఇలా తన మొహం బాగా కమిలిపోయినట్లుగా తయారైందని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు తాను ఇదే సమస్యతో నిద్ర లేస్తానని .. ఈ సమస్యతో బాగా అసౌకర్యానికి గురవుతున్నట్లు ఆమె వాపోయింది.

తనకు కొన్ని అలర్జీలు ఉన్నాయని.. తన ఫేస్‌లో చాలా చోట్ల ఉబ్బినట్లుగా కనిపిస్తుందని , నిద్రలేచినప్పుడల్లా నా ముఖం వాచినట్లు కనిపిస్తుందని ఉర్ఫీ పేర్కొంది. ఇలా ఎందుకైంది, అలా ఎందుకైంది అని చెప్పకుండా తనపై కాస్త దయ చూపాలని జావెద్ తెలిపింది. ఇది చూసిన నెటిజన్లు గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలు పెట్టే ఉర్ఫీ జావెద్ ఇలాంటి ఫోటోలు పెట్టేసరికి ఆమె అభిమానులు సైతం అయ్యో అన్నారు.
ఇదిలాఉండగా.. ఉర్ఫీ జావెద్ జీవితం నేపథ్యంలో త్వరలో ఓ వెబ్ షో ప్రసారమవుతోంది. దీని పేరు ఫాలో కర్లో యార్.. ఆగస్ట్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఉర్ఫీ రియల్ లైఫ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. ఈ షోకు మరింత పబ్లిసిటీ కల్పించేందుకు ఉర్ఫీ జావెద్ బాగా కష్టపడుతోంది. రెండ్రోజుల క్రితం ఆమె చీర కట్టుకుని ఓ ప్రోగ్రామ్‌కి వచ్చింది. నడుము, తొడలు కనిపించేలా ఆ చీర ఉండగా.. అండర్ వేర్ ఏమైంది, చీరను అవమానించావంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయినా ఆమె ఎవరేమనుకున్నా వినే రకం కాదన్నది తెలిసిందే.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్ సమంత, తాను ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులమని ఉర్ఫీ జావెద్ తెలిపారు. సమంతకు తన వీడియో నచ్చితే.. తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తుందని పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా తాను సెక్స్‌కు దూరంగా ఉంటున్నానని.. ఈ కాలంలో కనీసం తాను ఎవరిని ముద్దు కూడా పెట్టుకోలేదని, రొమాంటిక్‌గానూ మాట్లాడలేదని తెలిపింది. అంతేకాదు.. సొంతంగా ప్రైవేట్ జెట్ కొనే వరకు తాను ఎవరితోనూ రొమాంటిక్‌గా మాట్లాడనని ఉర్ఫీ జావెద్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications










