Bigg Boss దిమ్మతిరిగే ఫిట్టింగ్.. షణ్ముఖ్ జస్వంత్‌కు కాజల్ ఝలక్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో సోమవారం అంటే నామినేషన్ల గందరగోళం అనే విషయం ప్రేక్షకులకు తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య రచ్చ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే బిగ్‌బాస్‌లో టాప్ 5లో చేరేందుకు, అలాగే ఈ సీజన్ చివరి ఎలిమినేషన్‌లో ఇంటి సభ్యుల మధ్య ఎప్పటిలానే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టారు. తాజా ప్రోమోలో ఇంటి సభ్యులు మధ్య అభిప్రాయ బేధాలు స్పష్టంగా కనిపించాయి. తాజా ప్రోమోలో ఏం జరిగిందంటే..

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

ఏకాభిప్రాయం అంటూ ఫిట్టింగ్

ఏకాభిప్రాయం అంటూ ఫిట్టింగ్

బిగ్‌బాస్ ఇంటిలోని లాన్‌లో ఆరు నంబర్లతో కూడిన డిస్ ప్లే బోర్డులను పెట్టారు. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో తమ ర్యాంకులను కేటాయించుకొని వాటి వెనుక నిలబడాలి అంటూ నిబంధనను క్లియర్‌గా చెప్పారు. బిగ్‌బాస్ ఆదేశాల తర్వాత వీజే సన్నీ మాట్లాడుతూ.. నేను ఫస్ట్ పొజిషన్‌లో ఉంటే.. చివరి శ్వాస వరకు సన్నీ సన్నీ మాదిరిగానే ఉంటాడు అంటూ వీజే సన్నీ చెప్పాడు. దాంతో నేను పొజిషన్ గురించి ఆలోచించను అంటూ మానస్ కామెంట్ చేస్తూ కనిపించాడు.

 శ్రీరామచంద్రకు 4వ ర్యాంక్

శ్రీరామచంద్రకు 4వ ర్యాంక్

ఇక ర్యాంకింగ్ విషయంలో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. యాటిట్యూబ్, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. యారోగెన్స్ అనుకోవచ్చు. వీటిన్నిటిని పక్కన పెడితే నేను మాత్రం మనకు లభించిన సపోర్ట్ జనం నుంచే అని అన్నాడు. అయితే శ్రీరామచంద్ర మాటల తర్వాత ఆయనకు 4 ర్యాంక్ ఇస్తాను. ఇంకా బెటర్ ర్యాంక్ ఇచ్చేవాడిని. కాకపోతే చిన్న అభ్యంతరం ఉంది అంటూ మానస్ చెప్పాడు.

షణ్ముఖ్ జస్వంత్‌కు 6వ ర్యాంక్

షణ్ముఖ్ జస్వంత్‌కు 6వ ర్యాంక్


ఇక కాజల్, షణ్ముఖ్ జస్వంత్ మధ్య భారీగానే చర్చ జరిగింది. నేను ఆడిన గేమ్ కరెక్ట్ కాదనుకొంటే.. నీవు చెప్పినట్టు ఆరో పొజిషన్‌లో ఉంటాను అని షణ్ముఖ్ అంటూ కనిపించాడు. అలాగే సిరి కంటే నీవు చాలా తక్కువగా ఉంటావు అందుకే అంటూ కాజల్ చెప్పింది. ఇదిలా ఉంటే... నంబర్ వన్ పొజిషన్‌లో మాత్రం నేను షన్నును మాత్రమే చూడాలని అనుకొంటాను అని సిరి చెప్పింది. అయితే ఏంటీ నిన్ను నీవు చూసుకోవా? అంటూ శ్రీరామచంద్ర నోరు వెళ్లబెట్టారు.

కాజల్‌తో షన్ను వాగ్వాదం

కాజల్‌తో షన్ను వాగ్వాదం


షణ్ముఖ్ జస్వంత్ నేరుగా వెళ్లి ఆరో నంబర్ ర్యాంక్ వద్ద నిలుచున్నాడు. దాంతో ఓవర్ యాక్షన్ చేయకు. నీ ర్యాంక్ సిక్స్ అనుకొంటున్నావా. సిరి ఇచ్చిన ర్యాంక్‌కు విలువ లేదు అని ఆర్జే కాజల్ చెప్పింది. ఆ తర్వాత కాజల్ సిక్స్ నంబర్ ఇచ్చాడని నాకు లేబుల్ వేస్తున్నాడు అంటూ సన్నీతో ఆర్జే కాజల్ చెబుతూ కనిపించింది. అలా ఇంటిలో ర్యాంకుల గొడవ భారీగానే జరిగినట్టు తెలిసింది.

Recommended Video

Pushpa Trailer Delay | Samantha As Yashodha || Filmibeat Telugu
ఎవరికి ఏ ర్యాంక్ అంటూ

ఎవరికి ఏ ర్యాంక్ అంటూ

అయితే చివరకు ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది.. ఎవరెవరు ఒకే ర్యాంక్ కోసం పట్టుబట్టారు. వారి మధ్య గొడవలు ఏమిటి? అనే ప్రశ్నలకు డిసెంబర్ 6న రాత్రి ప్రసారమమ్యే ఫుల్ ఎపిసోడ్‌లో స్పష్టత లభిస్తుంది. ఈ విధంగా ఇంటి సభ్యుల మధ్య బిగ్‌బాస్ భారీగానే ఫిట్టింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X