Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి ఆలోచిస్తున్న ప్రియాంక జైన్.. ఎందుకో తెలుసా?
మౌనరాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి తెగ సందడి చేస్తోంది. ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి రచ్చ లేపుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట తాజాగా మరో వార్తతో షాక్ ఇచ్చిది. ముఖ్యగా పెళ్లికి ముందే ప్రియాంక జైన్ పెళ్లి గురించి ఆలోచిస్తుంది. ఎందుకు అలా ఆలోచిస్తోంది, ఏం చేయాలనుకుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 షోకు వెళ్లిన పొట్టి అండ్ గట్టి పిల్ల ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో కలిసి గేమ్ ఆడుతూ వచ్చిన ఈమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకోగా.. అదే నిజం చేసిందీ శివంగి. చాలా కష్టపడి, గట్టిగా ట్రై చేసి మరీ టాప్ 5లో నిలిచిన ఈమె.. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తన ప్రియుడు శివ్ కుమార్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా అతడితో కలిసి లివింగ్ రిలేషన్ లో ఉంటున్నట్లు వివరించింది.

ఈ వార్త తెలుసుకనే షాక్ అయిన అందరికీ.. ఫ్యామిలీ వీక్ లో భాగంగా అతడితో రొమాన్స్ చేసి మరింత షాక్ ఇచ్చింది. ఇలా రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీళ్లు బయటకు వచ్చిన తర్వాత నుంచి రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా అనేక ట్రిప్పులకు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే టీవీ షోలో పెళ్లి చేసుకున్న వీళ్లు ఆ తర్వాత ఫొటో షూట్ చేయించుకుని మళ్లీ షాక్ ఇచ్చారు. ఇదే ఏడాది వీరిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు. దీనికి ఇరుకుటుంబ సభ్యుల అంగీకారం ఉండగా.. మరింత ఎగ్జైట్ అవుతున్నారు.
త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న వీళ్లు తాజాగా పిల్లల గురించి కూడా ప్లాన్ చేసుకున్నారు. అంటే ప్రియాంక జైన్ ఓ అమ్మాయితో ఫొటో షూట్ చేయించుకుంది. ముఖ్యంగా టీవీ నటి కూతురు చందమామతో సందడి చేసింది. షూటింగ్ లో భాగంగానే ప్రియాంక జైన్ సహా, ఆ పాప కూడా లేవగా.. ప్రియాంక ఆ పాపతో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ముఖ్యంగా ఇద్దరూ కలిసి మేకప్ చేయించుకుంటూ మాట్లాడుతూ తెగ సందడి చేశారు.

ఈ క్రమంలోనే పాపతో చాలా సేపు గడిపిన ప్రియాంక జైన్.. ఆమెతో ప్రేమలో పడిపోయింది. ఇలాంటి పాపే తనకు కూడా కావాలంటూ చెప్పుకొచ్చిది. భవిష్యత్తులో తనకు పిల్లలు కావాలంటే ఇలాంటి అమ్మాయే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు వివరించింది. ముఖ్యంగా తల్లితో కంటే కూడా ప్రియాంక జైన్ తోనే ఎక్కువగా గడిపింది. వీరిద్దరి రిలేషన్ చూసి తెగ అంతా తెగ సంబురపడిపోతున్నారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసేయండి.


Click it and Unblock the Notifications











