Bigg Boss Telugu 8: బిగ్ బాస్ నుంచి బేబక్క అవుట్! ఆమె రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss 8: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్​ 8 తెలుగు. ఎన్నో కాంట్రవర్సీల మధ్య ప్రారంభమైన ఈ షోకు మొత్తం 14 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు. వారు జంటలుగా కలిసి బీబీ హౌస్ లోకి ఏంట్రీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఊహించని టాస్కులు, గొడవలతో ప్రారంభమైంది. అలాగే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ బీబీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న ఈ షో అంతలోనే వారం రోజులు పూర్తి చేసుకుని ఎలిమినేషన్ లోకి అడుగుపెట్టింది. అయితే.. తొలి వారంలో ఎలిమినేట్ అయింది ఎవరు? ఇంతకీ తొలి వారంలో ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారనే ఇంట్రెస్టింగ్ మారింది.

బిగ్ బాస్ 8 తెలుగు భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. ఎన్నో ట్విస్టుల మధ్య ఫస్ట్​ వీక్​ నామినేషన్​లో ముగ్గురు చీఫ్స్ గా నిఖిల్​, నైనిక, యష్మీ ఎన్నిక కాగా.. మిగిలిన 11 మంది నామినేషన్​ ప్రక్రియలో పాల్గొన్నారు. అందులో విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్​, శేఖర్​ బాషా, బేబక్క, నాగమణికంఠ నామినేట్​ చేశారు. మొదటి వారం ఓటింగ్ పూర్తి అయిన తరువాత చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు వచ్చాయి.

Bigg Boss Bezawada Bebakka alias Madhoo singer Nekkanti eliminated from Bigg Boss Season 8 in first week journey and Remuniration

సోషల్ మీడియా కథనాల ప్రకారం.. మొదటి రెండు స్థానాల్లో విష్ణుప్రియ, నాగ మణికంఠ నిలువగా.. మూడో స్థానంలో పృథ్వీరాజ్ నిలిచారట. మిగిత స్థానాల్లో ఆయా కంటెస్టెంట్లు నిలిచారు. అయితే.. చివరి స్థానంలో బెబక్క నిలిచినట్టు తెలుస్తుంది. అలాగే.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో ఎవరైతే కాస్త ఏజ్డ్ గా కనిపిస్తారో వారిని తొలివారంలోనే ఎలిమినేట్ చేశారనే టాక్ కూడా ఉంది.

ఆ ఆనవాయితీ ప్రకారం చూస్తే.. బేబక్కనే తొలి ఎలిమినేట్ అంటు ప్రచారం జరిగింది. అదికాకుండా ఆమె మొదటివారం ఎక్కవగా వంటగదిలో ఉండాల్సిందే. దీంతో ఆమె ఇతర కంటెస్టెంట్లతో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరికింది. అలాగే వంట గది నుంచి కూడా కంప్లైయింట్స్ వచ్చాయి. అంతేకాకుండా టాస్క్​ల్లో కూడా అంత ప్రభావం చూపించలేదనే టాక్ కూడా ఆమె పై వచ్చింది.

ఇదెలా ఉంటే.. పలువురు బిగ్ బాస్ తెలుగు రివ్యూస్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే బేబక్క ఎలిమినేట్ అయ్యిందనీ, ఆమె బిగ్ బాస్ బజ్ లో కూడా పాల్గొన్నారని చెప్పేశారు. ఎలిమినేషన్ తరువాత జరిగే బీబీ బజ్ లో కూడా బేబక్క ఎలాంటి కాంట్రవర్సీలు చేయకుండా.. కేవలం నిఖిల్ పై మాత్రమే చిన్న కామెంట్స్ చేసి సైలెంట్ గా బయటకు వచ్చిందని టాక్. ఆమె ఆ తరువాత బెజవాడ వెళ్లి అటు నుంచి అటే అమెరికా కుడా వెళ్లిపోతుందనే టాక్.

ఇక ఈ తరుణంలో బేబక్క ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం బిగ్ బాస్​ హౌజ్​లో ఈమెకు రోజుకు రూ. 21,428 రెమ్యూనిరేషన్ కాగా.. వారానికి రూ 1,49,996 తీసుకున్నారంట. అంటే వారానికి లక్షా యాభైవేల రూపాయాలను బేబక్కకు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X