ఇంట్లో వద్దంటే వచ్చేశా, అతడితోనే నా జీవిత ప్రయాణం: బిగ్ బాస్ భానుశ్రీ
బిగ్ బాస్ తెలుగు2 నుండి ఎలిమినేట్ అయిన భాను శ్రీ ఈ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు. గతంలో ఆమె బాహుబలితో పాటు పలు చిత్రాల్లో నటించినప్పటికీ ప్రతి ఒక్కరు గుర్తు పట్టే స్థాయి అయితే రాలేదు. అయితే బిగ్ బాస్ ద్వారా భానుశ్రీ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పక తప్పదు. చాలా మందికి భానుశ్రీ ఒక డాన్సర్‌గానే తెలుసు కానీ ఆమె నేపథ్యం ఏమిటి? ఎక్కడి నుండి వచ్చారు? ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి పెద్దగా తెలియవు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భానుశ్రీ ఇందుకు సంబంధించి అంశాలను ప్రేక్షకులకు వెల్లడించే ప్రయత్నం చేశారు.

అసలు పేరు స్వప్న, వరంగల్ నుండి...
తన అసలు పేరు స్వప్న అని, తమది వరంగల్ అని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత భానుశ్రీగా పేరు మార్చుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఇష్టం, ఆ ఇష్టంతోనే కొరియోగ్రాఫర్ అవ్వాలని సినిమా రంగంలోకి వచ్చాను అని తెలిపారు.

ఇంట్లో ఒప్పుకోకున్నా...
తాను సినిమా రంగంలోకి రావడం ఇంట్లో వారికి ఇష్టం లేదు. అయితే నా కెరీర్ కోసం వారు వద్దన్నా వినకుండా హైదరాబాద్ వచ్చేశాను. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించాను. శక్తి, డార్లింగ్ లాంటి సినిమాలకు పని చేశాను అని భానుశ్రీ తెలిపారు.

కెరీర్ మలుపు తిప్పిన బాహుబలి
కొన్ని డాన్స్ షోలలో చేసిన తర్వాత ‘జాబిలమ్మ' సీరియల్‌లో హీరోయిన్ నటించే అవకాశం వచ్చింది. బాహుబలి సినిమాలో తమన్నా స్నేహితురాలి పాత్రలో చేసిన తర్వాత నా కెరీర్ టర్న్ అయింది. కాటమరాయుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మహానుభావుడు లాంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.

హీరోయిన్‌గా అవకాశాలు
కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. ఇద్దరి మధ్య 18, మౌనం, ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేశారు. ప్రస్తుతం కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నాను అని భానుశ్రీ తెలిపారు.

అతడితోనే నా జీవిత ప్రయాణం
డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు శివశంకర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. కష్టాల్లో ఒక స్నేహితుడిలా తోడుగా ఉన్నాడు. అతడి నిజాయితీ, వ్యక్తిత్వం నచ్చింది. మొదట నేనే అతడికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పాను. శివతోనే నా జీవిత ప్రయాణం అని భానుశ్రీ తెలిపారు.


Click it and Unblock the Notifications











