‘బిగ్ బాస్ షో నుంచి ఫోన్ కాల్.. నా కలను తొక్కేశారు’.. భానుశ్రీ ఆవేదన
కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు షోకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతగానో ఆదరణ దక్కింది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన 8 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రెటీలకు మంచి గుర్తింపు దక్కింది. హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మరిన్ని ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటూ కెరీయర్ ను ముందుకు సాగిస్తామనే ఆలోచనతో ఈ హౌజ్లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ తెలుగు షోలపై తాజాగా యంగ్ బ్యూటీ భానుశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఆమెకు పలు కండీషన్లు పెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా చేశారని తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ సీజన్ 2తో..
భాను శ్రీకి టీవీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కడం విశేషం. ఈమె కెరీయర్ తొలుత మోడల్ గా మొదలైంది. ఆ తర్వాత నటిగా భానుశ్రీ తెలుగు ఆడియెన్స్ నూ కూడా పలు చిత్రాలతో అలరించింది. అయితే భానుశ్రీ తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ద్వారా మరింత క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో ఐదారు వారాల తర్వాత భానుశ్రీ హౌజ్ నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత మరింతగా క్రేజ్ దక్కించుకుంది.

ఢీషో నుంచి వెళ్లిపోమని హెచ్చరిక..
అయితే బిగ్ బాస్ షో తర్వాత భానుశ్రీకి మరిన్ని అవకాశాలు దక్కుతాయని ఆశించింది. అదే సమయంలో బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఢీషోలో అవకాశం దక్కింది. డ్యాన్సర్ గా తనకు ఢీషోలో మెంటర్ గా చాన్స్ వచ్చిందని తెలిపింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని గురించి బిగ్ బాస్ టీమ్ కు తెలిపిందంట. దాంతో అప్పుడు చేసుకోండి అని చెప్పారంట. కానీ మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం పోన్ చేసి ఢీ షో ఆపేయమని హెచ్చరించారంట. బిగ్ బాస్ షో అగ్రిమెంట్ ప్రకారం మీరు ఢీ షో చేయడానికి వీల్లేదని చెప్పారంట. దాంతో ఢీషోనుంచి తప్పుకున్నానని, దాంతో నా కలను తొక్కేశారని చెప్పింది.
భానుశ్రీ తెలుగు సినిమాలు, సీరియల్స్..
భానుశ్రీ నటిగా తొలుత 'ఇద్దరి మధ్యలో 18' అనే సినిమాతో వెండితెరపై మెరిసింది. వెండితెరపై తనకు ఇదే మొదటి సినిమా. అలాగే టెలివిజన్ సీరియల్స్'జాబిలమ్మ'తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత 'వాణి రాణి' అనే సీరియల్ లోనూ మెరిసింది. అలాగే 'గోల్డ్ రష్', టాలీవుడ్ స్క్వేర్ వంటి గేమ్ షోల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మర్ల పులి, కుమారి 21ఎఫ్, బాహుబలి, కాటమరాయుడు వంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించి మెప్పింది. హీరోయిన్ గా నల్లమల అనే చిత్ కాస్తా గుర్తింపునిచ్చింది.


Click it and Unblock the Notifications











