నీ కోసం కింద విప్పేసుకొని వచ్చా.. జబర్దస్త్ వర్ష షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్
ఇటీవలి కాలంలో వెండితెర, బుల్లితెర, ఓటీటీలు ఇలా ఏది చూసినా బూతు కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మితీమిరిపోతున్నాయి. ప్రేక్షకులు వాటినే ఆరాధిస్తుండటంతో మేకర్స్ కూడా వాటినే తీస్తున్నారు. టీవీలలో రియాలిటీ షోల సంగతి చెప్పనక్కర్లేదు. వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక నటీనటుల అంతరంగాన్ని ఆవిష్కరించే ఇంటర్వ్యూలలోకి కూడా ఈ డబుల్ మీనింగ్ డైలాంగ్స్ అడుగు పెట్టేశాయి. తాజాగా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న ఓ షోలో వినిపించిన మాటలపై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్‌తో వర్షకు క్రేజ్
జబర్దస్త్‌లో స్కిట్ల కంటే తన అందచందాలతోనే పాపులర్ అయ్యారు వర్ష. అంతకుముందు చిన్నాచితకా షోలు, సీరియల్స్‌లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు దక్కలేదు. ఎంతోమంది లాగే జబర్దస్త్ ఆమె జీవితాన్ని మార్చేసింది. పలువురు టీమ్ లీడర్స్ ఆమెకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. పాత కమెడియన్స్ చాలా మంది జబర్దస్త్‌ను వీడటంతో వర్షకు బాగా కలిసొచ్చింది. ఈ మధ్య ఏ టీమ్‌లో చూసినా ఆమె కనిపిస్తోంది. జబర్దస్త్ దెబ్బకు సోషల్ మీడియాలో వర్షకు బాగా ఫాలోవర్స్ పెరిగారు.

సోషల్ మీడియాలో వర్షకు ఫాలోయింగ్
ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారులో సెగలు రేపుతున్నారు వర్ష. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ సహా ఇతర షోలు, ఈవెంట్స్‌తో బిజీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈమె పాపులారిటీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్‌కు హాజరవుతూ హీరోయిన్ రేంజులో స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నారు వర్ష. షోలు, ఈవెంట్స్, ఓపెనింగ్స్‌తో వర్ష రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం ఓ ఛానెల్‌లో కిస్సిక్ టాక్ షో పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్నారు వర్ష. ఈ షోలో గెస్టులను బాగానే ఇంటర్వ్యూ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
వర్ష పాడ్‌కాస్ట్‌కు గెస్ట్‌గా భానుశ్రీ
ఈ పాడ్‌కాస్ట్‌లో ఎపిసోడ్ నెం 14కు బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ గెస్ట్‌గా వచ్చింది. బిగ్‌బాస్ షో ద్వారానే ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్ అయ్యారు. బుల్లితెరపై చుట్టపు చూపుగా పలకరించే భానుశ్రీ .. ఒకట్రెండు సినిమాలలోనూ నటించింది. ఏడు చేపల కథ అనే బోల్డ్ కంటెంట్ సినిమాలోనూ మెరిసింది. కానీ ఇవేవీ ఆమెకు అదృష్టం తెచ్చిపెట్టలేకపోయాయి. కానీ తన వంతుగా ఛాన్స్‌ల కోసం కష్టపడుతూనే వస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు షోలకు గెస్ట్‌గా వెళ్తోంది భానుశ్రీ.
భానుశ్రీపై వర్ష కామెంట్స్
తాజాగా వర్ష పాడ్‌కాస్ట్‌లో భానుశ్రీ సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఆల్రెడీ జబర్దస్త్‌లో చేసినప్పుడే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఆ చనువుతో ఇష్టమొచ్చిన క్వశ్చన్స్ అడిగింది వర్ష. వాయిస్ గురించి మనమిద్దరమే మాట్లాడుకోవాలని ఒకరిపై ఒకరు సెటైర్ వేసుకున్నారు. భానును చూసి ఎంత సెక్సీగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చింది వర్ష. బేసిగ్గా వర్ష అనగానే కింద విప్పుకుని వచ్చావా? అని వర్ష ప్రశ్నిస్తుంది. దానికి వెంటనే పైన విప్పుకుంటే బాగోదని నాటుగా ఆన్సర్ ఇచ్చింది భానుశ్రీ. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలలో కాస్త పద్ధతిగా, హుందాగా నడుచుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. మరి వీరిద్దరూ ఏయే విషయాలపై మాట్లాడుకున్నారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











