’అల్లు అర్జున్‌ అంటే క్రష్.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా‘

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ (Bhanu Sri) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సోషల్ మీడియాలో "ఏమున్నావే పిల్లా ఏమున్నావే" పాటతో వైరల్ అయి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి తన కామెంట్స్‌తో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిస్సిక్ టాక్స్ విత్ వర్ష' షోలో పాల్గొన్న భాను శ్రీ.. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అభిరుచులు, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా అల్లు అర్జున్‌పై తనకున్న క్రష్ గురించి భాను శ్రీ మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. "చాలామంది అమ్మాయిలకు అల్లు అర్జున్ అంటే క్రష్ ఉంటుంది. ఆయనకి గర్ల్‌ఫ్రెండ్ అయితే బాగుంటుందని అనుకుంటారు. కానీ నేను మాత్రం డైరెక్ట్‌గా ఆయనను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా" అంటూ నవ్వుతూ చెప్పింది. అంతేకాదు, "అల్లు అర్జున్‌ను ఈసారి కలిస్తే మాత్రం..." అంటూ మధ్యలో ఆపి ఎయిర్ కిస్ ఇవ్వడం మరింత వైరల్ అయ్యింది. వెంటనే "స్నేహా గారు సారీ... అల్లు ఆర్మీ కూడా నన్ను క్షమించాలి" అంటూ సరదాగా క్షమాపణ చెప్పడం షోలో హైలైట్‌గా నిలిచింది.

Bigg Boss Bhanu Sri Throwback Interview I ll Marry Allu Arjun and Have Kids Viral Comments

అలాగే 'పుష్ప' సినిమాలో హీరోయిన్ పేరు 'శ్రీవల్లి' వెనుక కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భాను శ్రీ. "ఆ అసలు పేరు వల్లి. కానీ భాను శ్రీలోని 'శ్రీ' తీసుకుని 'శ్రీవల్లి' అని పెట్టించారు" అంటూ సరదాగా చెప్పింది. 'నిజాలు ఎప్పుడైనా నిప్పులాంటివే... ఇవన్నీ తర్వాత మీకే తెలుస్తాయి' అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఫన్నీగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ సరదా కోణంలో చెప్పిన కామెంట్స్ అని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ఇక తన సినీ ప్రయాణం గురించి కూడా భాను శ్రీ ఓపెన్‌గా మాట్లాడింది. "చాలామంది భాను శ్రీ సినిమాలు చేయడం లేదనుకుంటారు. కానీ నేను తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్నా. టీవీ షోలు, ఈవెంట్స్ కూడా చేస్తున్నా" అని తెలిపింది. ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ కామన్ అని, ఒక సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డా చివరికి అది ఫ్లాప్ అవ్వడంతో చాలా బాధపడ్డానని చెప్పింది. 'ఒక్కోసారి ఓ చిన్న సీన్ కూడా ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెస్తుంది. ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు లక్ కూడా చాలా ముఖ్యం. నేను అయితే లక్‌ను 200 శాతం నమ్ముతాను' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

భాను శ్రీ తన వ్యక్తిగత జీవితంపై కూడా కొన్ని విషయాలు వెల్లడించింది. 'నాకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. నా ఇష్టం వల్లనే ఇక్కడికి వచ్చాను. కానీ ఈ స్థాయికి రావడానికి ఒక వ్యక్తి సపోర్ట్ చాలా ఉంది' అంటూ చెప్పింది. అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం బయటపెట్టలేదు. బిగ్‌బాస్ షో తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని, ఆ షో తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపింది.

ఇక తన ఫేవరెట్ హీరోల గురించి అడిగినప్పుడు కూడా భాను శ్రీ ఫన్నీగా స్పందించింది. "నా స్వయంవరానికి వస్తే లిస్ట్ చాలా పెద్దది" అంటూ రణ్ బీర్, విజయ్ దేవరకొండ పేర్లు చెప్పింది. టీవీ ఇండస్ట్రీలో ఎవరైనా నచ్చారా అని అడిగితే, "నా పక్కన నిలబడేంత స్టేటస్ ఎవరికీ లేదు" అంటూ నవ్వులు పూయించింది. ప్రస్తుతం భాను శ్రీ చేసిన ఈ సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X