నా పెదాలు చాలా కాస్ట్లీ .. అవి ఆయనకే సొంతం.. బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్

బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ (Bhanu Sri). ఈ అమ్మడు పేరు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు "ఏమున్నావే.. పిల్లా ఏమున్నావే" అనే పాటతో రీల్స్ ప్రపంచాన్ని ఊపేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన పాత ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ బ్యూటీ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ముఖ్యంగా 'నల్లమల' సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించిన విషయం చాలా మందికి తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఆ సినిమాలోని "ఏమున్నావే పిల్లా ఏమున్నావే" పాట మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రీల్స్, షార్ట్ వీడియోల్లో ఈ పాటకు అనేక మంది క్రియేటర్లు డ్యాన్స్ చేయడంతో, ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. అయితే ఈ పాట అసలు తనదేనని, ఆ సినిమాలో తానే హీరోయిన్‌గా నటించానని భాను శ్రీ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం ఆసక్తికరంగా మారింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, పాట మాత్రం భారీ పాపులారిటీ తెచ్చిందని ఆమె పేర్కొంది.

Bigg Boss Bhanu Sri Throwback Interview Viral Song Fame Bold Allu Arjun Crush Revealed

ఇక తన కెరీర్ గురించి మాట్లాడిన భాను శ్రీ, ఇండస్ట్రీలో లక్ ఎంత ముఖ్యమో స్పష్టంగా చెప్పింది. "నేను ఆ సినిమాలో మేకప్ లేకుండా సహజంగా నటించాను. మంచి పేరు వస్తుందని అనుకున్నా. కానీ సినిమా ఫ్లాప్ అయింది. హిట్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసినట్లే, ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా అంగీకరించాలి' అంటూ చెప్పింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది ఒక్క రాత్రిలోనే స్టార్ అవుతున్నారని, కానీ అది అందరికీ సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడింది.

ఇక తన లైఫ్ స్టైల్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడింది భాను శ్రీ. ఎక్కువగా విదేశాల్లో కనిపిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా, "ఈవెంట్స్ వల్లనే ఎక్కువగా ఫారిన్ వెళ్తున్నా. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. డబ్బుల విషయంలో కూడా చాలామంది అనుకున్నట్లు కోట్లు లేకపోయినా, జీవించడానికి సరిపడా ఉంది. హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. బాగా సెటిల్ అయ్యాను" అని చెప్పింది. ఇంటర్వ్యూలో హాట్ టాపిక్‌గా మారింది మాత్రం ఆమె చేసిన క్రష్ కామెంట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)పై తనకు ఉన్న ఇష్టం గురించి చెప్పిన భాను శ్రీ, 'చాలామందికి ఆయనపై క్రష్ ఉంటుంది. కానీ నేను మాత్రం డైరెక్ట్‌గా పెళ్లి చేసుకుని పిల్లలు కనేస్తా' అంటూ బోల్డ్‌గా చెప్పింది.

అంతేకాదు, ఆ మాటల తర్వాత ఆమె సరదాగా స్పందిస్తూ, అల్లు అర్జున్ భార్య స్నేహ గారిని క్షమించమని కూడా చెప్పింది. "ఫ్యాన్స్ కూడా క్షమించాలి.. ఇవి నా ఫీలింగ్స్ మాత్రమే" అంటూ చెప్పడం, ఆమె సరదా స్వభావాన్ని చూపించింది. అలాగే "మళ్లీ జన్మ ఉంటే అల్లు అర్జున్ గర్ల్‌ఫ్రెండ్‌గా కాదు.. డైరెక్ట్‌గా భార్యగా పుట్టాలని ఉంది" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భాను శ్రీ. లిప్ కిస్ సీన్స్‌పై మాట్లాడుతూ.. 'ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అలాంటి సీన్స్ చేయను. కథ డిమాండ్ చేసినా కూడా నేను ఒప్పుకోను' అని క్లియర్‌గా చెప్పింది. అయితే సరదాగా 'ప్రభాస్ గారితో అయితే ఆలోచిస్తా.. అయినా నా లిప్స్ అంటే చాలా కాస్ట్లీ. మా ఆయనకే నా లిప్స్ సొంతం. నేను ఇలా అన్నానని ఎంత రేటు అని ట్రోల్ చేస్తారు. అందుకే చెప్తున్నా. నా పెదాలు మాత్రమే కాదు.. నేను కూడా మా ఆయనకే సొంతం. కానీ అల్లు అర్జున్ గారంటే చాలా క్రష్' అని చెప్పింది.

అలాగే.. రణ్ బీర్ కపూర్, విజయ్ దేవరకొండ వంటి నటులు తనకు ఇష్టమని చెప్పింది. టీవీ ఇండస్ట్రీలో మాత్రం తనకు సూటయ్యే వ్యక్తులు తక్కువగా ఉన్నారని, తన స్థాయికి సరిపడే వాళ్లు ఉండాలని భావిస్తున్నానని వెల్లడించింది. ఇప్పుడీ పాత ఇంటర్వ్యూ మళ్లీ వైరల్ కావడంతో, భాను శ్రీ పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి ఈ బిగ్‌బాస్ బ్యూటీ తిరిగి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందా? లేక టీవీ, ఈవెంట్స్‌తోనే కొనసాగుతుందా? అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X