Bigg Boss Telugu 7: నెగిటివిటీ పోగొట్టుకునేందుకు బిగ్‌బాస్‌ బిగ్ ప్లాన్.. నాగార్జున తీరుతో వెలుగులోకి!

ఎవరూ ఊహించకుండా వచ్చి అద్భుతమైన ప్రేక్షాకదారణ పొందుతున్న షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ తో మరింత అద్భుతంగా సాగుతోంది. ఇప్పటి వరకూ తెలుగులో ఏ సీజన్ లోనూ రాని స్పెషల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఉల్టాపుల్టా అంటూ వచ్చిన బిగ్ బాస్.. ఇస్తున్న టాస్క్ లు, చేస్తున్న ట్విస్ట్ లతో టీఆర్పీతో పాటు విపరీతమైన నెగిటివిటీ కూడా వస్తోంది.

ముఖ్యంగా సీరియల్ గ్రూపుకు చెందిన అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు చేసిన ఏ తప్పులకు కూడా బిగ్ బాస్ వారిని ఏమీ అనట్లేదని.. కనీసం నాగార్జున కూడా గట్టిగా వారిని ఏమీ అనట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వాళ్లు ఏవైనా మాటలు అన్నా, తప్పులు చేసినా వారిపై విపరీతంగా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Big Plan For Get Rid of Negativity in Bigg Boss Telugu 7

ముఖ్యంగా శోభాశెట్టిపై విపరీతమైన నెగిటివ్ వచ్చింది. ఆమె ఎలిమినేట్ కావాలని అంతా సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. అలాగే ఆమె 11వ వారంలో డేంజర్ జోన్ లో ఉండగా.. బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఎలిమినేషన్ ఎత్తేశారు. దీంతో మరోసారి అభిమానులు అంతా ఫైర్ అయ్యారు. కావాలనే బిగ్ బాస్ దత్తపుత్రిక శోభాశెట్టిని కాపాడుకోవడానికి ఆమెను సేవ్ చేశారంటూ చర్చలు చేశారు. అలాగే అమర్ దీప్ ను గెలిపించేందుకు కూడా బిగ్ బాస్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. అందుకే ఆయనకు సింపథీ ఓట్లు పడేలా చేశారంటూ చాలా మంది రివ్యూయర్లతో పాటు చాలా పత్రికలు, టీవీ ఛానెళ్లు వార్తలు రాశాయి.

ఇదంతా చూసిన బిగ్ బాస్ టీం నిర్వాహకులు తమకు వచ్చిన నెగిటివిటీ పోగొట్టుకునేందుకు పెద్ద ప్లానే వేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకూడదని.. ముఖ్యంగా తాము పక్షపాత ధోరణిలో వ్యవహరించట్లేదని ప్రూవ్ చేసుకోవడానికి నాగార్జున గట్టిగా హింట్ ఇచ్చారు. దీంతో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున చెలరేగిపోయారు. సీరియల్ బ్యాచ్ వాళ్లకు గట్టిగా ఇచ్చి తాము ఎవరికీ సపోర్ట్ చేయట్లేదని ప్రూవు చేసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎప్పటిలాగే అమర్ దీప్ ను గట్టిగా ఆడేసుకున్నారు నాగార్జున.

గతంలో ప్రశాంత్‌ తరచూ ఏడుస్తుంటాడని, సింపథీ కోసమే ఇలా చేస్తాడని అమర్‌ దీప్ చేసిన వ్యాఖ్యల వీడియోను నాగార్జున ప్లే చేశారు. అప్పుడు ప్రశాంత్‌ను సింపథీ కోసం ఆడుతున్నాడు అన్న అమర్ దీప్.. ఇప్పుడు నువ్వు కూడా సింపథీ కోసమే గేమ్ ప్లే చేస్తున్నావా అంటూ కామెంట్లు చేశాడు. అమర్ దీప్ పై ఫైర్ అయ్యేలా కనిపిస్తూనే రైతుబిడ్డకు సపోర్ట్ చేసినట్లు నాగార్జున వ్యవహరించిన తీరు చూస్తుంటే.. కేవలం నెగిటివిటీ పోగొట్టుకోవడానికే బిగ్ బాస్ ఈ ప్లాన్ వేశారని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X