Bigg Boss Telugu 7: చివరి వారంలో బిగ్ షాక్.. మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కా.. బయటకు వెళ్లిపోయేది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న షోలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచీ తమకు నచ్చిన విధంగా ట్విస్ట్ లు ఇస్తూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ముఖ్యంగా మొదటి వారం 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్ ఆ తర్వాత నాలుగు వారాలు నలుగురిని ఎలిమినేట్ చేశారు. ఇక ఐదో వారంలో మొత్తం ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను లోపలికి పంపారు. ముందు వారాల్లో ఎలిమినేట్ అయిన వాళ్లలోంచి కూడా ఒకరితో రీఎంట్రీ ఇప్పించారు.

ఇక ఆ తర్వాత వారం నుంచి వారానికొకరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. మధ్యలో ఓ వారం మాత్రం నో ఎలిమినేషన్ పెట్టి.. ఆ తర్వాతి వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఇప్పటికే 14 వారాలు విజయంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా 15వ వారంలోకి అడుగు పెట్టింది. ఇదే చివరి వారం అవడం.. మరో నాలుగు రోజుల్లో షో ముగిసిపోవడం అందరికీ తెలిసిందే. అయితే ప్రతీ సీజన్ లో టాప్ 5 మాత్రమే ఉండగా.. ఈ సీజన్ మాత్రం టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే టాప్ 7 ఉన్నా... సీజన్ 7 కాబట్టి అలా పెట్టారనుకోవచ్చు. కానీ అసుల ఎలాంటి సంబంధమూ లేకుండా టాప్ 6 కంటెస్టెంట్లను పెట్టారు.

Bigg Boss Big Shock to Contestants to Mid Week Elimination in Bigg Boss Telugu

అయితే సోమవారం నుంచి ఈరోజుటి వరకూ బిగ్ బాస్ కంటెస్టెంట్లను జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. రోజుకో ఇద్దరి జర్నీ వీడియోలు చూపిస్తుండగా.. వాటితోనే ఎపిసోడ్ లు అయిపోతున్నాయి. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో ప్రశాంత్ తో పాటు, యావర్ జర్నీ వీడియోలు ప్లే చేస్తారు. ఇక ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి టాప్ లోకి కేవలం ఐదుగురిని మాత్రమే తీసుకు రాబోతున్నట్లు సమాచారం. చివరి వారం వరకూ ఆరుగురిని తీసుకు వచ్చిన బిగ్ బాస్ టీం నిర్వాహకులు మిడ్ వీక్ ఎలిమినేషన్ తో టాప్ 5 కంటెస్టెంట్లను ఫిక్ చేయాలని భావిస్తున్నారట.

అయితే అందరికీ షాకిచ్చి షోను మరింత రసవత్తరంగా మార్చేందుకే వీడియో జర్నీలు చూపించడం, టాప్ 6 కంటెస్టెంట్లు అని ఫైనల్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే సడెన్ గా ఎలిమినేషన్ పెట్టి టీఆర్పీ పెంచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే కనుక కన్ఫార్మ్ అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు టాప్ 5లో ఎవరెవరు ఉంటారు, విన్నర్, రన్నరప్ లు ఎవరో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముఖ్యంగా రెండు వారాల ముందు నుంచే విన్నర్ కోసం ఓటింగ్ ప్రారంభించారు.

Bigg Boss Big Shock to Contestants to Mid Week Elimination in Bigg Boss Telugu

ఇందులో మొదటి నుంచి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్ 1లో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో శివాజి, మూడో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతూ వస్తున్నాడు. వాళ్ల పర్ఫార్మెన్స్ ను బట్టి ఈ స్థానాలు కాస్త మారుతూ వస్తున్నప్పటికీ.. టాప్ 3లో మాత్రం వీళ్లే ఉండబోతున్నారు. ఇక టాప్ 4లో ప్రిన్స్ యావర్, టాప్ 5లో అంబటి అర్జున్, టాప్ 6లో ప్రియాంక జైన్ ఉన్నారు. ఇలా చివరి స్థానంలో ఉన్న ప్రియాంక జైన్ ఈ వారం మధ్యలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముద్దుబిడ్డ, అందులోనూ ఆడపిల్ల కాబట్టి ఎలిమినేట్ చేసే ఉద్దేశం లేకపోతే.. యావర్, అంబటి అర్జున్ లలో ఒకరిని బలి చేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X