Bigg Boss Telugu 7 Finale: పల్లవి ప్రశాంత్‌కు తీరని అన్యాయం.. ప్రైజ్ మనీలో భారీ కోత.. చివరకు వచ్చింది ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజుటితో ముగిసిపోనున్న ఈ షోలో ఎవరూ ఊహించని షాకింగ్ విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగు పెట్టి అనేక అవమానాలు ఎదుర్కున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా గెలిచాడు. ఇది అఫీషియల్ గా కాకపోయినా చాలా మంది ఈ విషయాన్ని లీక్ చేశారు. అయితే మొదటి వారంలోనే ఇంట్లో అడుగు పెట్టిన ఇతడు.. రెండో వారం నామనేషన్స్ సమయంలో హౌస్ మేట్స్ అంతా కార్నర్ చేయడంతో ఇతడికి విపరీతమైన పాజిటివిటీ వచ్చింది. చాలా మంది రైతుబిడ్డ ట్యాగ్ వాడుకుంటున్నాడని విమర్శించారు.

బయటే కాదు ఇంట్లో కూడా చాలనే కష్టాలు పడ్డాడు రైతుబిడ్డ. కానీ శివాజి అండతో చక్కగా గేమ్ ఆడుతూ వచ్చాడు. అన్ని టాస్క్ లలో అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తూ.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఎవరినీ ఏమీ అనుకుండా.. ఒక్కచోట కూడా నోరు జారకుండా.. తనను ఎంతగానో తొక్కాలని చూసిన అమర్ దీప్ కు కూడా సాయంగా నిలిచాడు. అంత మంచి మనసు కల్గిన ఈ రైతుబిడ్డే విన్నర్ అవడానికి మొదటి అర్హుడు. ఓటింగ్ కూడా విపరీతంగా వచ్చింది. తాజాగా జరిగిన ఫినాలేలో కూడా ఈయననే నాగార్జున విన్నర్ గా ప్రకటించారు. ముందు నుంచీ సీరియల్ బ్యాచ్ కు సాయం చేస్తూ వస్తున్న బిగ్ బాస్... మరోసారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు గట్టి షాక్ ఇచ్చాడు.

Bigg Boss Big Shock to Pallavi prashanth by Cutting The Prize Money in Bigg Boss Telug 7

బిగ్ బాస్ తెలుగు 7 లో గెలిచిన వాళ్లకు 50 లక్షలు ఇస్తామని చెప్పిన బిగ్ బాస్ చివరకు.. విన్నర్ కు ఎంత ఇచ్చాడో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తం 50 లక్షలు. కానీ ఇందులోంచి జీఎస్టీ పోగా.. మిగేలిది కేవలం 23 లక్షల మాత్రమే. ఇది ముందు నుంచి అంటే జీఎస్టీ అమల్లోకి వచ్చాక అన్ని బిగ్ బాస్ సీజన్లలోనూ ఇదే జరుగుతోంది. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ విన్నర్ సన్నీ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. 50 గెలుచుకున్న మాట వాస్తవమే అయినా తన చేతికి వచ్చింది మాత్రం 23 లక్షలే అని స్పష్టం చేశాడు.

అయితే ఈసారి సీజన్ లో విన్నర్ కు ఆ 23 లక్షలు కూడా రాకుండా బిగ్ బాస్ ప్లాన్ చేశారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలుస్తాడని ఇలా చేశారా.. లేక అలా జరిగిపోయిందో తెలియదు కానీ.. ముందుగా టాప్ 5 కంటెస్టెంట్లకు 15 లక్షలు ఆఫర్ చేశారు. ఇలా చేసిన ఆఫర్ ను ప్రిన్స్ యావర్ అందిపుచ్చుకున్నాడట. అయితే ఈ 15 లక్షలు సెపరేట్ గా ఇవ్వరు. విన్నర్ కు ఇచ్చే 50 లక్షల ప్రైజ్ మనీలోంచి దీన్ని తీసి ఇస్తారు. ఇలా 50 లక్షల్లోంచి యావర్ కే 15 పోతే ఇక మిగిలింది 35 లక్షల మాత్రమే. ఇక ఈ 35 లక్షల్లోంచి జీఎస్టీ కట్టింగ్ పోనూ మిగిలేది కేవలం 16 లక్షలు మాత్రమేనట.

Bigg Boss Big Shock to Pallavi prashanth by Cutting The Prize Money in Bigg Boss Telug 7

అంటే విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ షో నుంచి వచ్చేది కేవలం 16 లక్షలు మాత్రమే. రెమ్యునరేషన్ ప్రతీ ఒక్కరికీ సెపరేట్ గా ఇస్తారు. కానీ ఈ విన్నర్ ప్రైజ్ మనీలో మాత్రం రైతుబడ్డకు చాలా అన్యాయమే జరిగింది. తనకు వచ్చిన డబ్బులన్నింటినీ పల్లవి ప్రశాంత్ రైతుల కోసమే ఉపయోగిస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఇలా వచ్చిన తక్కువ డబ్బును కూడా ఆయన రైతులకే కోసమే ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X