Bigg Boss Telugu 7: శివాజిని సైడ్ చేసేందుకు బిగ్‌బాస్‌ బిగ్ స్కెచ్.. ఇదే కంటిన్యూ అయితే విన్నర్ అతడే!

బిగ్ బాస్ షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో కానీ.. అద్భుతమైన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ఎవరి నోట చూసిన బిగ్ బాస్ గురించే చర్చ. ఎవరు ఎలా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు, టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు, గెలిచేది ఎవరు, రన్నరప్ ఎవరు... ఇలా పెద్ద ఎత్తునే చర్చ సాగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే విపరీతంగా న్యూస్ పాపులర్ అవుతోంది. బిగ్ బాస్ షోకు సంబంధించిన వీడియోలు, విన్నర్ వీళ్లే, టాప్ 5 లిస్టు ఇదే అంటూ కూడా చాలా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. మరికొన్ని వారాల్లోనే ఈ సీజన్ పూర్తి అయ్యేందుకు వస్తుండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి గేమ్ అంతా మారిపోయింది. విన్నర్ గా నిలుస్తారనుకున్న వాళ్లు కిందకు పడిపోవడం.. అసలు టాప్ 5లోనే ఉండడు అని భావించిన వాళ్లు విన్నర్ గా నిలిచే స్థాయికి రావడం మనం చూడవచ్చు. ముఖ్యంగా బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పుడు అంతా సీరియల్ నటుడు అమర్ దీప్ యే గెలుస్తాడని భావించారు. టాప్ 5లో కూడా శోభాశెట్టి, ప్రియాంక జైన్, సింగర్ ధామినిలు నిలుస్తారని భావించారు. అలాగే రైతుబిడ్డ కొన్నాళ్లుఉండి వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు. కానీ మొదటి వారంలోనే ఆట అంతా తారుమారైంది.

Bigg Boss Big Sketch to Sideline Sivaji And Make Amardeep Win in Bigg Boss Telugu 7

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు.. ఇంట్లోని వాళ్లంతా ఆయనపై అజమాయిషీ చేయడంతో ఫుల్ నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా అమర్ దీప్ కు అయితే ఊహించని స్థాయిలో నెగిటివిటీ వచ్చింది. అదే సమయంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ గా నిలిచిన శివాజికి చాలా ప్లస్ అయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఆయనే గెలుస్తాడని మొన్న మొన్నటి వరకు భావించారు. ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి మాత్రం ఆట మొత్తం మారిపోయింది. అంతా విన్నర్ అవుతాడనుకున్న శివాజి గ్రాఫ్ పడిపోతుంది. పడిపోవట్లేదు.. పడగొతున్నారు అనే టాక్ పెద్ద ఎత్తున నడుస్తోంది.

బిగ్ బాస్ కావాలనే శివాజి నెగిటివ్ గా ఏం చేయకపోయినా ఆయన చేసిన తప్పులను హైలెట్ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో వచ్చిన నాగార్జున కూడా ఆయన తప్పులను ఎత్తి చూపుతూ.. మిగిలిన వాళ్లు మాట్లాడితే మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కావాలనే బిగ్ బాస్ టీం నిర్వాహకులు శివాజిని సైడ్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న టాస్క్ లో కూడా అలాగే వ్యవహరిస్తున్నారని.. అమర్ దీప్ హైలెట్ అయ్యేలా పెద్ద స్కెచ్చే వేశారని అంటున్నారు.

Bigg Boss Big Sketch to Sideline Sivaji And Make Amardeep Win in Bigg Boss Telugu 7

మొన్నటి వారంలో కెప్టెన్సీ కోసం విపరీతంగా ప్రయత్నించి ఏడ్చేసిన అమర్ దీప్ ను చూసిన బుల్లితెర ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. పాపం అనుకుంటూ అతడిని గెలిపించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండు వారాలుగా అమర్ దీప్ లోని ప్లస్ పాయింట్లను మాత్రమే చూపిస్తూ.. ఎలాంటి నెగిటివిటీ లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. శివాజిని గెలిపించుకూడదనే ఉద్దేశంతో ఓవైపు ఆయన్ను నెగిటివ్ చేస్తూనే మరోవైపు అమర్ దీప్ కు ప్లస్ అయ్యేలా చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X