Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ బిగ్ సర్ ప్రైజ్.. షోలో ఎవరూ ఊహించని గెస్ట్.. నవ్వుతూనే ప్రియాంకకు గట్టిగా ఇచ్చి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఈరోజుటి 13వ వారం కూడా విజయవంతంగా పూర్తి కాబోతుంది. ఇంతకాలం పాటు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరించడంలో సఫలం అయిన బిగ్ బాస్ నిర్వాహకులు.. ఈరోజును మరింత స్పెషల్ గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్లకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఓ స్పెషల్ గెస్టును స్టేజీపైకి తీసుకు వచ్చారు. అయితే ఆయన ఎవరు, అసలేం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ టీం నిర్వాహకులు కాసేపటి క్రితమే ఈరోజుటి ఫస్ట్ ప్రోమోను విడుదల చేశారు. అందులో ముందుగా స్టేజీపై న్యాచురల్ స్టార్ నాని కనిపించాడు. ఆయనే పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. నాన్నా నువ్వేంటి ఇక్కడ అంటూ అడిగాడు. అందుకు నాని నా సామి రంగా అంటూ వాళ్ల సినిమాలతో పిలుచుకుని హాయ్ చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత నువ్వే నా దాద్.. నేను నీ దేవ్ అంటూ నాగార్జున చెప్పగా.. ఇప్పుడు, ఎప్పుడు మనం అలాగే అంటూ తెలిపాడు.

Bigg Boss Big Surprise For Contestants For Taking A Special Guest in Bigg Boss Telugu 7 Show

హాయ్ నాన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగానే నాని బిగ్ బాస్ షోకు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా చాలా హాయిగా ఉంటుందని.. డిసెంబర్ 7వ తేదీన అంతా ఆ సినిమాను చూసి ఎలా ఉందో చెప్పాలని నాని వివరించాడు. ఇక ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ పరిచయం చేశాడు.. ఈక్రమలోనే అంబటి అర్జున్, అమర్ దీప్ లను చూపిస్తూ వారి పేర్లు చెప్పాడు. ముఖ్యంగా అమర్ దీప్ పై విపరీతమైన పంచులు వేస్తూ ఫుల్లుగా నవ్వించాడు. అంబటి అర్జున్ పై కూడా పంచులు వేస్తూ ఫన్ చేశాడు. ప్రియాంక గురించి పరిచయం చేస్తూ.. నాగార్జున గట్టి షాకిచ్చాడు.

నవ్వుతూ నవ్వుతూనే ప్రియాంకపై గట్టిగా ఫైర్ అయ్యాడు. ప్రియాంక గురించి నీకో విషయం చెప్పాలంటూ నానికి చెప్పిన నాగార్జున.. చిన్నప్పుడు మ్యాథ్స్ టేబుల్స్ తెలుసు కదా వచ్చా అంటూ అడిగాడు. హా వచ్చు అనగా.. 4 ఇంటూ 8 ఎంత అనగా... నాని 32 అని చెప్పాడు. కానీ మా ప్రియాంక ఏం చెప్పిందో చూడు అంటూ ఓ వీడియో ప్లే చేశాడు. అందులో ప్రియాంక 8 ఫోర్ జ 48 అని చెప్పడం చూపించాడు. దానికి స్పందించిన నాని వెంటనే మీ గురించి ఇక ఇంట్రడక్షన్ అవసరం లేదంటూ వెల్లడించాడు నాని. నవ్వుతూ కనిపించిన ప్రియాంక మొహం వాడిపోయింది. ఆ వీడియో చూసిన శోభాశెట్టి కూడా చాలా షాకైంది.

Bigg Boss Big Surprise For Contestants For Taking A Special Guest in Bigg Boss Telugu 7 Show

ఆ తర్వాత నాని ప్రిన్స్ యావర్ తో ఫుల్ కామెడీ చేశారు. ముఖ్యంగా నాగార్జున అతడి పేరు చెప్పగానే... ఏ దేశానికి ప్రిన్స్ ఉంటూ నాని అడిగాడు. వెంటనే అంబటి అర్జున్.. నేను అలా అన్నందుకే నన్ను నామినేట్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తెలుగులో ఓ పద్యం చెప్పి అతడితో చెప్పించమని నాగ్ చెప్పగా... నాని చాలా కష్టపడ్డాడు. కానీ ప్రిన్స్ యావర్ మాత్రం అస్సలు ఒక్క పదం కూడా పలకలేకోపయాడు. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X