Bigg Boss 6 Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయికి లక్షల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డు
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయం అయినా.. గతంలో ఏ షోకూ దక్కని స్పందనను సొంతం చేసుకుని నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో ప్రసారం అవుతూ ప్రేక్షకులను మజాను పంచుతోన్న ఇది.. భారీ రేటింగ్‌ను రాబడుతోంది. ఫలితంగా ఇది రికార్డు స్థాయి టీఆర్పీని దక్కించుకుంటోంది. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లను కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇక, త్వరలోనే బిగ్ బాస్ ఆరో సీజన్ కూడా మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి నిర్వహకులు భారీ ఆఫర్ ఇచ్చినట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఆరో సీజన్‌పై అందరిలో ఆసక్తి
తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. అదిరిపోయే స్పందనను అందుకుంటోన్న బిగ్ బాస్ ఆరో సీజన్ త్వరలోనే రాబోతుంది. ఇప్పటికే దీనిపై నిర్వహకులు అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో షోను అభిమానించే వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక, దీని గురించి వచ్చే వార్తలతో చాలా రోజుల ముందు నుంచే ఇది ట్రెండ్ అవుతోంది.

అప్పటి నుంచే మొదలు పెట్టి
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని ఇప్పటికే బుల్లితెర వర్గాల నుంచి క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్వహకులు గ్రౌండ్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారు. దీనిని హోస్ట్ చేయబోతున్న నాగార్జునతో ప్రోమోను కూడా షూట్ చేయబోతున్నారు. ఇక, ఇందులో ఓ కామన్ మ్యాన్‌కు కూడా అవకాశం కల్పించబోతున్నారు.

2వ దశలోనే.. సెట్ వర్క్ కూడా
బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ కంటెస్టెంట్ల ఎంపికే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరో సీజన్ కోసం ఈ ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించారు. అంతేకాదు, ఇప్పటికే ఒక రౌండ్‌ను పూర్తి చేసి కొందరినీ షార్ట్ లిస్ట్ చేశారని కూడా తెలిసింది. అలాగే, సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారట. సరికొత్త మార్పులతో దీన్ని ముస్తాబు చేస్తున్నారు.

సెలెబ్రిటీల పేర్లు.. క్లారిటీ లేదు
బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి చాలా రోజుల నుంచి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చాలా మంది ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కానీ, అందులో ఎవరు కన్ఫార్మ్ అయ్యారన్న విషయం మాత్రం తెలియడం లేదు. దీంతో ఈ మధ్య కాలంలో కొందరు సెలెబ్రిటీల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి.

బిగ్ బాస్‌లో హర్ష సాయి ఎంట్రీ
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి బిగ్ సెలెబ్రిటీలను నిర్వహకులు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని నిర్వహకులు సంప్రదించినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడీ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అవుతోంది.

హర్ష సాయికి బిగ్ బాస్ ఆఫర్
యూట్యూబ్‌లో సామాన్యులకు హెల్ప్ చేసే వీడియోలతో ఫేమస్ అయిన హర్ష సాయికి బిగ్ బాస్ నిర్వహకులు భారీ ఆఫర్ ఇచ్చారట. తాజా సమాచారం ప్రకారం.. అతడికి ఒక్కో ఎపిసోడ్‌కు రెండు లక్షలు ఇచ్చేందుకు యూనిట్ ముందుకు వచ్చిందట. ఇది బిగ్ బాస్ షో చరిత్రలోనే భారీ డీల్ అని తెలిసింది. అయితే, దీనికి మాత్రం అతడు నిరాకరించాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

హర్ష సాయి ఏమని చెప్పాడంటే
బిగ్ బాస్ గురించి వస్తున్న వార్తలపై హర్ష సాయి క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో 'నేను బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నాకు ఒక ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండడం ఇష్టం ఉండదు. నాకు స్వేచ్ఛ కావాలి. అందుకే నా వీడియోలు కూడా నాకిష్టమైన సమయంలోనే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను' అంటూ పుకార్లను ఆపేశాడు.


Click it and Unblock the Notifications











