Bigg Boss Buzzz: తనూజపై భరణి షాకింగ్ కామెంట్స్.. నేను ఎంత దూరం పెట్టాడానికి ప్రయత్నించినా..
Bigg Boss Buzzz: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాల్సిందే. శివాజీ పంచులకు, సెటైర్లకు రోస్ట్ కావాల్సిందే. ఎలిమినేషన్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే బిగ్ బజ్ ప్రోమో రిలీజ్ అవుతుండటంతో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఎలిమినేట్ అయిన భరణి శంకర్ తో శివాజీ చేసిన సంభాషణలు, ముఖ్యంగా తనూజ, దివ్య గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ హైలెట్‌గా నిలిచాయి. ఇంతకీ ఏమన్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. దీంతో రోజురోజుకు ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. 14వ వారం సందర్భంగా హోస్ట్ నాగార్జున ప్రకటించిన డబుల్ ఎలిమినేషన్ ఈ సీజన్‌లోనే ఊహించని పరిణామం. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్‌తో హౌస్ నుంచి బయటకు వెళ్లగా, రెండో ఎలిమినేషన్ గా భరణి శంకర్ హౌస్‌ను వీడారు. భరణి శంకర్ ఎలిమినేషన్ ఊహించని నిర్ణయమేమి కాదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్, రీఎంట్రీ నేపథ్యం, టాప్ 5లో ఉంటారనే ప్రచారానికి బ్రేక్ పడింది. ఎలిమినేషన్ తరువాత శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ప్రోమోలో మంగపతి శివాజీ నేరుగా భరణిని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. 'బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ, మీకు రెండు సార్లు వచ్చింది. మరి ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయారు? అసలు ఎక్కడ కొట్టింది?" అని శివాజీ అడగగా.. భరణి మాత్రం చాలా ప్రశాంతంగా, "ఎక్కడ కొట్టింది అని కాదు గానీ... మిగతా ఐదుగురు నాకంటే బాగా ఆడారేమో" అంటూ తన ఆటతీరును వివరించారు.
అయితే అసలు చర్చ దివ్య, తనూజ విషయానికి వచ్చాక మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. 'సెకండ్ టైమ్ ఎంట్రీ తర్వాత దివ్యను దూరం పెట్టడానికి ట్రై చేశారా?' అని శివాజీ ప్రశ్నించగా.. భరణి 'గేమ్ పరంగా తనకు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి... నేను ఎంత దూరం పెట్టడానికి ట్రై చేసినా...'అంటూ నిజాన్ని ఒప్పుకున్నారు. దీనిపై శివాజీ, 'మనమెందుకు బాధపడాలి?' అని ప్రశ్నించగా.. 'గేమ్ అనేది మైండ్‌తో ఆడాలి. కానీ, ఇక్కడ నా మైండ్‌ను హార్ట్ డామినేట్ చేసింది'అని భరణి చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇక తరువాత సంజనా- భరణి గొడవ విషయాన్ని కూడా శివాజీ ప్రస్తావించారు. 'మెడిసిన్ తీసుకున్న రోజున 'ఇట్స్ ఓకే' అన్నావు. కానీ, అదే విషయాన్ని నామినేషన్‌లో తీసుకురావడం బాలేదనిపించలేదా?' అని ప్రశ్నించగా.. భరణి ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. 'ఫన్ చేస్తానని చెప్పింది నా మీద. నా మెడిసిన్ దాచడం ఫన్నా?' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు, అసలు హాట్ టాపిక్ అయిన తనూజ గేమ్ గురించి కూడా శివాజీ ప్రశ్నించారు. 'తనూజ తన గేమ్ తాను ఆడుకుంది. మీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది మీకు ఎప్పుడు అర్థమైంది?' అని అడగగా.. భరణి,'కొన్ని సందర్భాల్లో అర్థమైంది.. ఇవన్నీ మాట్లాడవచ్చో లేదో'అంటూ ఆపేశారు. అదే సమయంలో ప్రోమో కట్ అవ్వడంతో, అసలు పూర్తి ఎపిసోడ్‌లో భరణి ఏమి చెప్పబోతున్నాడనే క్యూరియాసిటీ మరింత పెరిగింది. ప్రోమో చివర్లో భరణి చేసిన 'తనూజ తన గేమ్ తాను ఆడుకుంది' అనే కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.


Click it and Unblock the Notifications











