Bigg Boss Buzz: ‘లోపల ఉన్నవాళ్లు జ్ఞానులు కాదు. నేను అజ్ఞాని కాదు’.. బిగ్ బాస్ బజ్ లో అభయ్ ఫైర్..
Bigg Boss Buzz: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. గతంతో ఏ సీజన్ సాధించలేని టీఆర్పీతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు విజయవంతంగా మూడోవారాలు కంప్లీట్ చేసుకుంది. ఈ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. వాస్తవానికి అభయ్ నవీన్ టాప్ 5 కంటెస్టెంట్లలో ఒగరుగా ఉంటారని బీబీ లవర్స్ భావించారు. కానీ బిగ్ బాస్ పై నోరుపారేసుకోవడం వల్లే తనను ఎలిమినేట్ చేశారని చాలామంది బిగ్ బాస్ ఫ్యాన్ అనుకుంటున్నారు. అలాగే.. చీఫ్ గా ఎన్నికైన తరువాత అభయ్‌లో ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయనే కామెంట్స్ కూడా వచ్చాయి.
ఎలిమినేట్ అయిన తరువాత కంటెస్టెంట్ల గురించి మాట్లాడానికి బిగ్ బాస్ బజ్‌లోకి వెళ్లాడు అభయ్. ఇతర కంటెస్టెంట్స్‌పై తనకు ఉన్న అసలు అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభంగానే.. బెలూన్స్ రో కనిపిస్తుంది. ఆ బెలూన్స్ పై కంటెస్టెంట్ల ఫోటో పెస్ట్ చేసి ఉన్నాయి. ఒక్కొక్క బెలూన్ ను పగలకొట్టి.. వారిపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పాలని బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ చాలెంజ్ ను స్వీకరించిన అభయ్.. ముందుగా సోనియా ఫోటోతో ఉన్న బెలూన్‌ను పగలగొట్టాడు. ' ఆమె అన్నీ నాకే తెలుసునని ఫీల్ అవుతుంది' అంటూ తనపై ఓపినియన్ చెప్పేశాడు అభయ్ నవీన్. దీంతో హోస్ట్ అర్జున్ రియాక్ట్ అయి.. 'తనలోని లాయర్ అప్పుడప్పుడు బయటికి వస్తుంటుందా? ' అని ప్రశ్నిస్తాడు. 'అప్పుడప్పుడు కాదు చాలా సార్లు'అని అభయ్ ఓ క్లారిటీ ఇచ్చాడు.
ఆ తరువాత కిర్రాక్ సీత బెలూన్ పగలకొట్టి.. 'తను చాలా ఎమోషనల్, ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే.. మిగిత అన్ని విషయాల్లో గుడ్.. కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్' అని చెప్పేశాడు. ఆ తరువాత యాంకర్ విష్ణుప్రియా గురించి మాట్లాడుతూ.. 'తాను స్ట్రాంగా.. వీకా తనే తనకే తెలియదు' అంటూ సైటైరికల్ తన ఓపినియన్ చెప్పేశాడు అభయ్. నెక్ట్ యష్మీ గురించి చెప్తూ.. 'గేమ్ జోన్‌లో ఆడదామనే ఆలోచనలో ఉంటుంది కానీ ఆడదు' అంటూ కుండబద్దలు కొట్టాడు.
ఆ తరువాత పృథ్వి బెలూన్ పగలకొట్టి.. 'కొన్ని విషయాల్లో అసలూ ఒక్క క్షణం కూడా ఆలోచించడు'అని చెప్పాడు. నిఖిల్ గురించి చెప్పతూ.. నేను వాడ్ని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నాను' అంటూ తన కోరికను వెల్లడించాడు అభయ్. ఆ తరువాత నాగమణికంఠ బెలూన్ ను పగలకొట్టి.. 'మేల్ చంద్రముఖి.. ఎప్పుడు ఏ రకంగా మారుతాడో తెలియదు. అలాంటి క్యారెక్టర్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ తరువాత అసలు షో ప్రారంభించారు బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్. 'కాన్పిడెన్స్ థ్రిల్స్.. ఓవర్ కాన్పిడెంట్ కిల్స్' అంటూ.. తన ఆట తీరు గురించి అడగటం ప్రారంభించారు. 'కొన్నిసార్లు అది నెగిటివ్ అవుతుంది, కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది' అంటూ సమాధానమిచ్చాడు అభయ్. తాను ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడలేదంటూ ఇన్ డైరెక్ట్ గా సమాధానమిచ్చారు.
ఆ తరువాత ఎగ్స్ టాస్క్‌లో గురించి అభయ్ మాట్లాడుతూ.. 'మణికంఠ పైకి పృథ్వి వచ్చిన విధానం చూస్తే భయమేసింది'అనేశాడు. ఇప్పడేమో జ్ఞానిలా మాట్లాడుతున్నావ్.. కానీ లాస్ట్ 3 డేస్ బిగ్ బాస్ గురించి ఎందుకు పులిష్ గా మాట్లాడావ్ అంటూ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ సాలిడ్ క్వశ్చన్ అడగాడు. ఇక బిగ్ బాస్ గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించి అభయ్ మాట్లాడుతూ.. 'లోపల ఉన్నవాళ్లు జ్ఞానులు కాదు. నేను అజ్ఞాని కాదు' అంటూ సమాధానమిచ్చారు. వెంటనే రియాక్ట్ అయిన అర్జున్ 'ఆడకుండా ఉండడం నీ స్ట్రాటజీనా? బిగ్ బాస్‌ను తిట్టడం నీ స్ట్రాటజీనా?'అంటూ అభయ్ ను నిలదీశాడు.
'నాది ఆ మెంటల్టీ అదేఉంటే వేరేలాగా ఉండేది' అంటూ సమాధానమిచ్చారు అభయ్. ' నువ్ నేను తప్పు చేశానని ఒప్పుకుంటే.. ఈ రోజు ఆడియన్స్ లో హీరో అయి ఉండే వాడివి' అంటూ కౌంటర్ వేశాడు అర్జున్. ఆ తరువాత సోనియా గురించి అభయ్ ను అడుగుతూ.. నీకు సోనియా పదేళ్ల నుంచి తెలుసు తాను ఫేకా.. రియల్ గేమ్ ఆడుతుందా అంటూ దిమ్మతిరిగే క్వశ్చన్ వేశాడు అర్జున్. కర్ణుడి చావుకు శతకోటి కారణాలు అన్నట్లు అభయ్ ఎలిమినేట్ కావడానికి కూడా చాలా కారణాలున్నాయి. ఏదిఏమైనా బిగ్ బాస్ చరిత్రలో అభయ్ మాత్రం నిలిపోతారు. బజ్ ఇంటర్య్వూ ప్రోమో మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఆ ఎపిసోడ్ ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











