Bigg Boss Buzz: అతడు దేనికైనా సిద్దమే.. కానీ, కీ ఆమె చేతులోనే.. కళామతల్లి పై హరితేజ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Buzz: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. గతంతో ఏ సీజన్ సాధించలేని విధంగా ట్వీస్టులు, మలుపులు ఉండటంతో మంచి టీఆర్పీతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు విజయవంతంగా పది వారాలు కంప్లీట్ చేసుకుంది. పదోవారం ఎవరూ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దీంతో గంగవ్వ, హరిప్రియ ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన తరువాత వారు బిగ్ బాస్ బజ్‌ ఇంటర్వ్యూలో పాల్గొని కంటెస్టెంట్స్‌పై తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు హరిప్రియ, గంగవ్వ. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. తాజా బిగ్ బాస్ బజ్‌ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ బజ్ ఇంటర్య్వూలో హరితేజపై అంబటి అర్జున్ తన పదునైన ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. హరితేజను ఇరకాటంలో పడేసే ప్రశ్నలు వెయ్యగా.. తెలివిగా.. సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్తూ హోస్ట్ అర్జున్ కే కౌంటర్లు వేసింది హరితేజ. గతంలో సీజన్ 1 లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన హరితేజ.. సీజన్ 8 లో త్వరగా బయటికి రావడానికి కారణాలేంటి?' అని అర్జున్ ప్రశ్నించాడు. 'సీజన్ 1 లో ఉన్న హరితేజతో పోల్చి పోల్చి.. అలా ఈ సీజన్లో లేదని తనని ఎలిమినేట్ చేసి ఉంటారు ' అని ఆమె అభిప్రాయపడ్డారు.

Bigg Boss Buzzz Exit Interview with hari teja Gangavva by Ambati Arjun Hariteja shocking comments on Vishnupriya Pridvi relationship

బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాన్ని చెబుతూ.. ' ఓ చిన్న మేటర్ లో చెడి.. అది చివరి వరకు చెడుకుంటూనే వచ్చింది' అని ఫీల్ అయింది హరితేజ. ఆ తర్వాత హౌస్ లోని ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ముందుగా ముక్కు అవినాష్ గురించి చెబుతూ..'నవ్వు అనే మంత్రంతో బిగ్ బాస్ లో కొనసాగుతున్నాడు. ఆ మంత్రం పక్కన పెడితే అతనిలో ఎన్నో లోపాలు ఉన్నాయి' అని పలు విషయాలను బయటపెట్టింది. ఆ తర్వాత విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ.. 'కళామతల్లి ముద్దుబిడ్డ. లోపల పృద్వి అనే మాయలో పడిపోయింది'అంటూ పృద్వి విష్ణు ప్రియల రిలేషన్ ను బయట పెట్టింది.

ఆ తర్వాత పృద్వి గురించి మాట్లాడుతూ..'మాటంటే మాట.. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు. కానీ, ఆ తర్వాత మొత్తం విష్ణు చూసుకుంటుంది' అంటూ ఓ సీక్రెట్ బయటపెట్టింది. ఆ తర్వాత గౌతమ్ ఫోటో చూపిస్తూ.. 'యశ్మీ మాయ నుండి బయటకు వచ్చాడు' అంటూ షాకింగ్ కామెంట్ చేసింది హరితేజ. ఆ తర్వాత నబిల్ ఫోటో చూపిస్తూ... 'వారమంతా స్వీట్ గా ఉన్నాడు. నామినేషన్స్ సమయంలో రెచ్చిపోతాడు. అతను చెప్పేది ఏది కరెక్టో అర్థం కాదు. ఈ అబ్బాయి ఇన్ని విషయాలు లోపల పెట్టుకున్నాడా ? అనిపిస్తుందన్నారు.

Bigg Boss Buzzz Exit Interview with hari teja Gangavva by Ambati Arjun Hariteja shocking comments on Vishnupriya Pridvi relationship

'ఈ అబ్బాయి చాలా ఇంటలిజెంట్, కానీ తన ఇంటలిజెన్సీ తనని ట్రబుల్స్ లో పడవేస్తుంది' అంటూ టేస్టీ తేజ విషయాలను బయట పెట్టింది హరితేజ. ఆ తర్వాత సోషల్ మీడియాలో హరితేజ పై వచ్చిన ట్రోల్స్, కామెంట్స్ ను చూపిస్తూ అర్జున్ అంబటి పలు ప్రశ్నలు వేస్తాడు. వాటన్నిటికీ హరితేజ సమాధానం ఇస్తూ..' ఏది పడితే అది మాట్లాడం తమ హక్కుగా భావించినప్పుడు.. అలాంటి వారిని కన్విన్స్ చేయలేం' అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. అయినా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి.. ఎన్నో సినిమాలలో నటించిన హరితేజ ఒక్క నెల రోజుల్లో చెడ్డది ఎలా అయిపోతుందని..హోస్ట్ అర్జున్ ని ప్రశ్నించింది. అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఫైనల్ గా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది.

మరోవైపు గంగవ్వ ఇంటర్వ్యూ చేశాడు. తికమక పడే ప్రశ్నలను వెయ్యగా.. తనదైన శైలిలో గంగవ్వ సమాధానాలు ఇచ్చింది. రావడం రావడంతోనే.. 'నమస్కారం అయ్యా.. మీరు చెప్పాలే.. మేం వినాలి పెద్దలం ' అంటూ పోస్ట్ అర్జున్ పై సెటైర్ వేస్తుంది గంగవ్వ. లోపల జరిగిన విషయాలను మీరే చెప్పాలంటూ.. పలు ప్రశ్నలు వేస్తాడు. విష్ణు ప్రియ, ప్రుద్వీలకు గురించి చెప్పుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X