“గుండమ్మకథలో ఏఎన్ఆర్-ఎన్టీఆర్ లా!”.. గౌరవ్, నిఖిలను ఆడుకున్న శివాజీ
Bigg Boss Buzzz: బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 10వ వారం డబుల్ ఎలిమినేషన్ తర్వాత శివాజీ బజ్ ఇంటర్వ్యూ ఫుల్ కామెడీ షోగా మారింది. ఫైర్ స్ట్రోమ్‌లో భాగంగా వైల్డ్ కార్డ్ ద్వారా దువ్వాడ మాధురి, రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి, అయేషా లు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఆరుగురు కంటెస్టెంట్లలో ఆయేషా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల హౌస్ నుంచి బయటకు రాగా.. మిగితా వారందరూ చాలా తక్కువ సమయంలోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో 10 వారం ఎలిమినేట్ అయిన నిఖిల్, గౌరవ్ గుప్తా ఇద్దరూ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకు ఒకేసారి హాజరయ్యారు.
ఇంటర్వ్యూ మొదలైన వెంటనే శివాజీ తన స్టైల్ మార్చి ఫన్నీగా మొదలుపెట్టాడు. మామూలుగా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే తన పాత ఫార్మాట్‌ను బ్రేక్ చేసి, ఇద్దరికీ ఒకేసారి ఇంటర్వ్యూ చేశాడు. నిఖిల్, గౌరవ్ చేతులు వేసుకుని ఫ్రెండ్స్‌లాగా ఎంట్రీ ఇవ్వగానే శివాజీ, వీళ్లిద్దరిని చూసి "గుండమ్మ కథలో ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ లా ఉన్నారు" అంటూ వేసిన సెటైర్‌తో స్వాగతం పలికారు. మొదట కాస్త సీరియర్ గా ఇంటర్వ్యూ ప్రారంభించారు. కానీ,చివరికి ఆ ఫైర్ కాస్త .. ఫన్ గా మారింది.

శివాజీ ముందుగా నిఖిల్‌ను టార్గెట్ చేస్తూ "నువ్వు హౌస్‌లో హైడ్ అండ్ సీక్ చాలా బాగా ఆడావు నీకు తెలుసా?" అంటాడు. ఎందుకు అలా అంటున్నారు అని నిఖిల్ అడగగా, "స్టార్టింగ్‌లో వెళ్లావ్... ఇప్పుడే కనిపించావ్... మధ్యలో అంతా హైడ్ అయిపోయావ్" అంటూ ఇచ్చిన పంచ్ ఇంటర్వ్యూను కడుపుబ్బా నవ్వులతో నింపింది.
గౌరవ్ గుప్తా విషయానికి వస్తే.. "నువ్వు ఆర్టిస్ట్ కదా?అని ప్రశ్నిస్తాడు. 'అవును సార్' అని గౌరవ్ బదులివ్వగా.. 'మరి హౌస్‌లోపలికి వెళ్ళాక జర్నలిస్టులా ఎందుకు మారావ్?' అని నిలదీస్తాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక.. సైలెంట్ గా తనలో తానే నవ్వుకుంటాడు గౌరవ్. వెంటనే శివాజీ "క్లీనింగ్ చేయమంటే గొడవ, కుకింగ్ చేయమంటే గొడవ... ప్రతి దానికి గొడవ ఎందుకు?" అని ప్రశ్నించాడు. దానికి "నాకేం తెలియదు సార్" అని గౌరవ్ చెప్పడంతో, "అదే అంటున్నా కదా... నీకు ఏం తెలియదు" అని ఫన్నీ కామెంట్స్ చేశారు శివాజీ. దీంతో హౌస్ మొత్తం నవ్వుల పువ్వులు పూశాయి.
ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పిన డైలాగ్ మరో హైలెట్ . ఆడియన్స్ ను గెలవాలంటే, ముందుగా హౌస్ మెట్స్ ను గెలవాలి అని శివాజీ అనగానే.. నిఖిల్ వెంటనే రియాక్ట్ అవుతూ "నేను ఆడియన్స్‌ని గెలిచాను అందుకే ఐదు వారాలు నామినేషన్‌లోకి రాలేదు.అందుకే నన్ను నామినేట్ చేయడానికి వాళ్లకు పాయింట్స్ లేవు" అని నిఖిల్ కాన్ఫిడెంట్‌గా చెబుతాడు. దీంతో శివాజీ "పాయింట్స్ రావాలంటే ముందుగా కనిపించాలి" అంటూ కౌంటర్ ఇచ్చాడు.
'నువ్వు ఎందుకు హౌస్ లోకి వెళ్లావ్?' అని గౌరవ్ ను ప్రశ్నించగా.. 'నాకేం తెలియదు సార్' అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు గౌరవ్. దీంతో శివాజీ ఒక్కసారిగా శివాజీ శ్రీకాకుళం యాసలో "ఏంట్రా గురూ... సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావ్? ఓరి బాబు ఏంట్రా ఇది?" అంటూ మాట్లాడడం ఇంటర్వ్యూను పూర్తి కామెడీ వేవ్‌లోకి మార్చేసింది.
చివరగా "నువ్వు ఏం చేశావో అతనికి చెప్పు... అతడు ఏం చేశాడో నీకు చెప్తాడు... నేను కాసేపు పడుకుంటా" అంటూ శివాజీ ఫన్నీగా చెప్పడంతో బిగ్ బాస్ బజ్ ఇక పూర్తి కామెడీ షోగా మారిపోయింది. మొత్తం మీద బిగ్ బాస్ బజ్ ఈ వారం సీరియస్ ఇంటర్వ్యూ కాకుండా.. పూర్తిగా సరదా, సెటైర్లు, నవ్వులు, పంచులతో నిండిన ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్‌గా మారింది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











