Bigg Boss Buzzz: తనూజతో భరణి ఎలా ఉంటే నీకేంటి? శివాజీ ప్రశ్నలకు దివ్య కన్నీళ్లు..
Bigg Boss Buzzz with Divya Nikhita: రసవత్తరంగా సాగుతోన్న బిగ్ బాస్ సీజన్ 9 నుంచి దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ కొంతమంది ప్రేక్షకులకు షాక్ ఇచ్చినా.. మరికొందరికి మాత్రం హ్యాపీనే. ఎందుకంటే.. భరణి డామినేట్ చేస్తుందనే ఓ వాదన బలంగా ఉంది. అలాగే.. భరణి కోసం తనుజా, దివ్య మధ్య ఫైటింగ్ కూడా కాస్త చిరాగు తెప్పించిందనే చెప్పాలి. దీంతో ఆమెపై నెగిటివ్ ఇమేజ్ పడింది. ఓట్లు తక్కువ రాయడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో దివ్య పాల్గొంది. భావోద్వేగంతో తన మనసులోని మాటలు మొదటిసారి బయటపెట్టింది.
"తనూజతో భరణి ఎలా ఉంటే నీకేంటి?"
ఇంటర్వ్యూ మొదలవగానే శివాజీ సూటిగా దెబ్బకొట్టాడు. "భరణి-తనూజ కలిసి ఉంటే నీకేంటి? అది నీకు ఎందుకు ఇష్యూ?" ఈ ప్రశ్నతో దివ్య ఒక్కసారిగా కంగారు పడింది. తాను ఓ సమస్య సృష్టించే వ్యక్తి కాదని క్లియర్ గా చెప్పింది. "నేనెప్పుడూ వాళ్లిద్దరికీ ఆటంకం కలిగించలేదు. వాళ్లను విడగొట్టి నేను ఏమి సాధిస్తాను?పొసెసివ్‌గా కనిపించాను అంటే అది నాకు తెలియకుండా వచ్చిందేమో." అని చెప్పింది దివ్య. ఆ సమాధానంతో శివాజీ ఆగలేదు."నీ పొసెసివ్ నెస్ తెలిసిపోతుంది కదా" అంటూ శివాజీ సూటిగా ప్రశ్నించారు. "నీ పొసెసివ్ నెస్ అందరికీ తెలుస్తుంది' అన్నారు.

'తనూజపై నీ అభిప్రాయం ఏమిటి?' అని దివ్యను సాఫ్ట్‌గా ప్రశ్నించగా.. "వాళ్లిద్దరూ అంత వీక్ కాదు. నేను వచ్చానని విడిపోయే సంబంధం కాదది." అని బదులిచ్చింది. అయితే శివాజీ ఇంకా వదల్లేదు. 'భరణి ఏం రాస్తే మనకేంటీ? ఎవరితో తిరిగితేంటీ? అవసరమైతే.. ఎత్తుకుని తిప్పితాడు. అతను చిన్నపిల్లాడు కాదు కదా... నీకేంటి ప్రాబ్లమ్?'అని మరోసారి సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దివ్య వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. గొంతుకు అడ్డం పడేలా అయ్యింది. "ఒక మనిషి వచ్చి తన పెయిన్ చెప్పాడు అనుకోండి..." అని దివ్య ప్రారంభించగానే.. శివాజీ " భరణి చెప్పకపోయినా నీకు పెయిన్ తెలిసిపోతుంది. అదే కదా బాధ!" అంటూ ఘాటుగా స్పందించారు.
ఈ సమయంలో దివ్య తన భావాలు బయటపడకుండా నిలబడటానికి ప్రయత్నించినా, శివాజీ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాలేదు. " భరణి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి నిన్ను ఎంకరేజ్ చేయలేదు... గమనించావా?" అని ప్రశ్నించగా.. "అవును... అప్పుడా బాధ తట్టుకోలేకపోయాను' అని ఒప్పుకుంది.తర్వాత శివాజీ బాంబ్ పేల్చాడు. "నీ మమ్మీ మాధురి గారికి...భరణి నిన్ను దూరంగా ఉండమని చెప్పమన్నాడు." ఈ మాటతో దివ్య ముఖం ఒక్కసారిగా తెల్లబడింది భావాలు ఆగకుండా కళ్లలోకి వచ్చాయి. కన్నీటీతోనే దివ్య మాట్లాడుతూ.."నా అన్నయ్య మళ్లీ వచ్చారు... ఆయనతో ఉండాలి... చూసుకోవాలి... ఆయన గేమ్ బాగా ఆడాలి." అనే ఇంటెన్షన్ తో ఉన్నానని క్లారిటీ ఇచ్చింది.
తరువాత దివ్య కొన్ని క్షణాలు తడబడిన తర్వాత.. "బయటికి వెళ్లిన తర్వాత ఆయన నాతో ఎలా ఉంటారో నాకు తెలీదు... కానీ నేను మాత్రం ఆయన శ్రేయోభిలాషిగానే ఉంటాను... ఈ విషయంలో నా బ్రెయిన్ చెప్పేది... హార్ట్ వినలేదు." అంటూ భావోద్వేగానికి లోనైంది. శివాజీ కూడా అప్పుడే నిశ్శబ్దమయ్యాడు. ఈ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇది దివ్య తన భావోద్వేగాలను నిజంగా ఒప్పుకున్న మొదటి సందర్భం. శివాజీ ఒక హోస్ట్ గా కాకుండా.. ప్రేక్షకుడిగా కాదు... గేమ్-మెంటర్ లా మారారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది.


Click it and Unblock the Notifications











