Bigg Boss Buzz: అన్నాచెల్లెల్లా? ఆ రొమాన్స్ ఏంటి? నిఖిల్‌తో సోనియా బాగోతాన్ని బయటపెట్టిన అర్జున్

Bigg Boss Buzz: బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. గతంతో ఏ సీజన్ కు లేని టీఆర్పీతో దూసుకెళ్తోంది. భారీ రెస్పాన్స్ వస్తున్నా ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు వారాలు కంప్లీట్ అయ్యాయి. నాలుగోవారం ఆడపులి, బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా ఆకుల ఎలిమినేట్ అయిపోయాడు. వాస్తవానికి సోనియా టాప్ 5 కంటెస్టెంట్లలో ఉంటారని బాగ్ బాస్ లవర్స్. కానీ తన ఆట తీరులో ఏదో తేడా కనిపించడంతో ఆమెకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ అయ్యేలా చేశారు బిగ్ బాస్ లవర్స్. ఎలిమినేట్ అయిన తరువాత బిగ్ బాస్ బజ్‌లోకి పాల్గొన్నారు సోనియా ఆకుల.ఈ ఇంటర్య్వూలో సోనియాకు దిమ్మతిరిగే ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పడేశారు హోస్ట్ అర్జున్. బిగ్ బాస్ బజ్ లేటెస్ట్ ప్రోమో విడుదలయ్యింది. మీరు కూడా ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభంగానే.. హోస్ట్ అర్జున్ తనదైన స్టైల్లో .. 'ఫస్ట్ వీక్ నుండి మాట్లాడుకుందాం' అనగానే.. సోనియా 'నేను కూడా ఆన్సర్ నా స్టైల్ లో ఇస్తా' అంటూ సమాధానమిచ్చింది. ఇక్కడి నుంచి అసలు ఇంటర్య్యూ ప్రారంభమైంది. 'బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ బాండింగ్ ఎవరితో' అని అర్జున్ ప్రశ్నించగా.. 'అభయ్, పృద్వి, నిఖిల్ అంటూ చక్కచక్క సమాధానం ఇచ్చింది సోనియా. ఆ తరువాత 'నిఖిల్ మీద నీకున్నా ఫీలింగ్ ఏంటీ? ' అని స్ట్రైట్ గా అడిగేశాడు. 'అన్నలాగా.. అని విషయాలు షేర్ చేసుకుంటాడు' అంటూ అన్సర్ ఇచ్చింది.

Bigg Boss Buzzz Sonia Akula Exclusive Exit Interview with Ambati Arjun

ఆ సమాధానం నచ్చని అర్జున్' హౌస్ లో మానిప్లేట్ చేసినట్లు.. నన్ను కూడా మాన్ ప్లేట్ చేయకు అక్క, సోనియా నువ్వు ఫీల్ అవునంటే నీకో మాట చెప్తా' అంటూ మరో మరో ప్రశ్న అడిగాడు. 'పృథ్వి ఆల్రెడీ వీక్ కాండిడేట్ అని తెలిసినా వాడిని వెపన్ లాగా యూజ్ చేసుకొని గేమ్ ఆడారు' బిగ్ బాస్ లవర్స్ కామెంట్ దీనిపై నీ ఒపినియన్ ఏంటీ అన్ని దిమ్మతిరిగిపోయే ప్రశ్న వేశాడు. ' వానికి గైడెన్స్ ఇచ్చా.. కాబట్టే ఎన్ని రోజులు హౌస్ లో ఉన్నాడంటూ' తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది సోనియా. వెంటనే రియాక్ట్ అయినా అర్జున్ మాట్లాడుతూ.. 'ముందుండి ఆటపట్టిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ, వెనుకుండి ఆట నడిపించేది నువ్వే అని ఆడియోస్ అందరికి తెలుసులే అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు

అంతటితో ఆగకుండా.. 'చేయాల్సిందంతా చేసేసి సైలెంట్ గా ఉంటారు కపట నాటక సూత్రధారి' అంటూ మరో షాకింగ్ కామెంట్ చేశాడు అర్జున్. హౌస్ లో వీక్లీస్ట్ కంటెస్టెంట్ ఎవరని ప్రశ్నించగా.. నైనిక అనే సమాధానం వచ్చింది. కానీ, అర్జున్ మాత్రం.. నిఖిల్ అంటూ మరో జలక్ ఇచ్చాడు. 'లేదు .. నిఖిల్ కచ్చితంగా టాప్ 3 లో ఉంటాడు' అంటూ సమాధానం ఇచ్చింది. వెంటనే రియాక్ట్ అయిన అర్జున్ 'మరి మీరు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు కదా.. మరి టాప్ 3 లో ఉంటాడా' అని అంటూ సెటైర్ వేశాడు అర్జున్. దీంతో ఏం సమాధానం చెప్పాలేక' ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చాను కాబట్టే ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నాడు' అంటూ తనని తాను సమర్ధించుకుంది సోనియా.

ఆ తరువాత హౌస్ లో ఆడపిల్లని ఎవరు పేరు ఇచ్చారని అర్జున్ అడగా కామన్ గా తనని అందరూ ఆడపులి అని పిలుస్తారని అన్నది. వెంటనే అర్జున్ రియాక్ట్ అవుతూ 'ఆడ పులి అంటే.. ముందుకొచ్చి ధైర్యంగా ఆడతారు. కానీ, పిల్లిలాగా వెనక ఉండి మ్యానిప్లేట్ చేయరు' అంటూ మరో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు అర్జున్. 'మీ వల్ల హౌస్ లో ఇద్దరు బాధితులుగా మారారు' అని అర్జున్ అనగా.. వెంటనే రియాక్ట్ అయినా సోనియా..'వారిద్దరూ ముందుగా బయటకు రావాలి గానీ, నేనెందుకు ముందుగానే ఎలిమినేట్ అయ్యాను' అని ఎదురు ప్రశ్నించింది సోనియా. దీంతో అర్జున్ వెంటనే రియాక్ట్ అవుతూ.. 'వారు బాధితులు.. నువ్వు బాధపెట్టిన దానివి. అందుకే బయట ఉన్నావు' అంటూ దిమ్మతిరిగి పోయేలా సమాధానమిచ్చాడు. సోనియా కూడా అస్సలు తగ్గకుండా 'చూద్దాం వాళ్లు హౌస్ లో ఎన్ని రోజులు ఉంటారో ఎన్ని రోజులు గేమ్ ఎలా ఆడతారు చూద్దాం' అంటూ సమాధానం ఇచ్చింది..

అనంతరం లిమిట్ లెస్ హగ్గులు పై ప్రశ్నిస్తూ.. ఈ విషయాలను మీ పేరెంట్స్ చూడరా అంటూ ఓ షాకింగ్ వీడియోను చూపించి సోనియా మైండ్ బ్లాక్ చేశాడు. ఆ తర్వాత సోనియా తనను తాను సమర్ధించుకుంటూ 'అవన్నీ స్పెషల్ మూమెంట్స్' అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత నిఖిల్ గురించి మరోసారి ప్రశ్నిస్తూ..' ఏ ఉద్దేశంతో సిగరెట్ మానేస్తే ఏది కావాలంటే అది ఇస్తా అంటూ ఆఫర్ ఎందుకు చేసావ్' అంటూ మైండ్ బ్లాక్ అయ్యే క్వశ్చన్ వేశాడు అర్జున్. మరి దానికి ఎలాంటి సమాధానం ఇస్తుందో ఎపిసోడ్లో చూడాలి. మొత్తానికి అర్జున్ తనదైన స్టైల్లో సోనియాను కడిగి పారేశాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X