హారికను ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ.. అమ్మా రాజశేఖర్ రింగులో రంగు
బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్సీ ఎంపిక కోసం జరిగిన రింగులో రంగు గేమ్ ఆసక్తిగా సాగింది. బ్లైండ్ ఫోల్డ్ నేపథ్యంగా సాగిన గేమ్‌లో భాగంగా తమ టీషర్టుపై తక్కువగా రంగు పడుకుండా కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు నేలపైపడి తమ ప్రత్యర్థికి రంగు పూసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. రింగులో రంగు టాస్క్ ఎలా జరిగిందంటే...

దొరికిన చోటల్లా రంగుతో
అయితే గేమ్ సందర్భంగా అరియానా, హారిక, అమ్మా రాజశేఖర్ దాదాపు కలియబడినంత పనిచేశాడు. చేతికి దొరకగానే అందిన చోట అంతా పూసారు. ఓ దశలో హారికపైకి అమ్మా రాజశేఖర్ దూకి ఎక్కడ పడితే అక్కడ పూసేశాడు. ఆ సమయంలో షర్టుకు పూయాలే తప్ప.. శరీరంపై పడి దురుసుగా ప్రవర్తించవద్దు అంటూ హారిక ఫిర్యాదు చేశారు.

హారికను టార్గెట్ చేసిన మాస్టర్, అరియానా
ఇక అమ్మా రాజశేఖర్‌ను గెలిపించాలని అరియానా, అవినాష్, సోహైల్, మెహబూబ్ ప్లాన్ చేశారు. ఇక హారికకు అభిజిత్, లాస్య, అఖిల్ మద్దతుగా నిలిచారు. టాస్క్‌కు ముందే వ్యూహాలు రచించారు. రింగులోకి దూకిన తర్వాత హారికను అరియానా, అమ్మా రాజశేఖర్ టార్గెట్ చేశారు. హారికకు ఎక్కువ రంగు పూసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం పక్కా సఫలం చేశారు.

కౌగిలించుకొని అరియానా..
రంగులో రింగు టాస్క్‌లో తక్కువగా తన టీషర్టుపై కలర్ ఉంచుకోవడంతో కెప్టెన్‌గా అమ్మా రాజశేఖర్ ఎంపికయ్యాడు. తనకు ఇష్టమైన వ్యక్తి మాస్టర్ కెప్టెన్‌గా కావడంతో అరియానా ఎగిరి గంతేసి చంకలోకి ఎక్కి గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టేసింది. కెప్టెన్‌గా గెలిచిన ఆనందంలో మాస్టర్ కూడా ఎగిరి గంతులేస్తూ కనిపించడం గమనార్హం.

హుందాగా మాస్టర్‌కు కెప్టెన్సీ పట్టం
కెప్టెన్‌గా గెలిచిన మాస్టర్‌ను ఊరేగించినంత పని చేశారు. కుర్చిలో కూర్చోబెట్టారు. కాలుపై కాలు వేయమని చెప్పారు. గత వారం కెప్టెన్‌గా వ్యవహరించిన అరియానా తన వద్ద ఉన్న కెప్టెన్ బ్యాండ్‌ను మాస్టర్‌కు తొడిగింది. ఈలలు వేసి, చప్పట్లు కొట్టి ఇంటి సభ్యులు గోల గోల చేశారు. అమ్మా రాజశేఖర్ చాలా హ్యాపీగా కనిపించారు.


Click it and Unblock the Notifications











