నిన్ను హగ్ చేసుకోవాలంటే అలాంటి ఫీలింగ్.. నీతో అలా చేస్తే.. అంటూ మోనాల్‌తో అఖిల్ రొమాన్స్
బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ తర్వాత మోనాల్, అఖిల్ మధ్య మళ్లీ ఎమోషనల్‌గా చర్చ జరిగింది. టాస్క్‌లో సరిగి ఆడకపోవడంపై అఖిల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను చెప్పే విషయాలు నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఏదైనా జరిగిన తర్వాత వచ్చి దానికి గురించి సంజాయిషి అడుగుతావు అంటూ మోనాల్‌పై మండిపడ్డారు. మోనాల్‌ను తప్పుపడుతూ..
Recommended Video

డ్రస్ గురించి రాద్దాంతం
టాస్క్ మొదలు కావడానికి ముందే ఈ డ్రస్ వద్దని చెప్పాను. ఇస్త్రీ చేసేటప్పుడే టాస్క్‌కు ఇది సరికాదన్నాను. కానీ ఈ డ్రస్‌పై మరోటి కూడా వేసుకొని ఉంటానన్నానవు. ఇలాంటి డ్రస్ వేసుకొని ఎలా ఆడగలవు అంటూ అఖిల్ అన్నాడు. నేను చెప్పిన మాటలు తలకు ఎక్కించుకోవడం లేదని కోపగించుకొన్నాడు.

మోనాల్ తీరుపై అఖిల్ ఆగ్రహం
మోనాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను చెప్పే విషయాలు నీకు అర్థం కాకపోతే.. మళ్లీ హిందీలో లేదా ఇంగ్లీషులో చెబుతా. అంతేగానీ మళ్లీ పదే పదే అదే విషయాలు చెప్పాలంటే నా వల్ల కాదు. టాస్క్‌లోకి వెళ్లే ముందు నా వద్దకు వచ్చి కూర్చోమన్నాను. కానీ నీవు అది చేయలే అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు.

దూరం అందుకే పెరిగింది
తన ప్రవర్తన గురించి మోనాల్ చెబుతూ.. అఖిల్ నువ్వు ఇలా క్లాస్ పీకడంతో.. నీకు నాకు మధ్య దూరం పెరిగింది. ఇక నుంచి నీ విషయంలో నేను జోక్యం చేసుకోను. నీ మధ్యలోకి రాకూడదని అనుకొంటున్నాను అని మోనాల్ చెప్పింది. అయితే నీ మైండ్‌లో మరోటి ఏదో ఉంది. అది నాకు అర్థం కావడం లేదు అంటూ మళ్లీ అఖిల్ క్లాస్ పీకాడు..

నీ చుట్టూ ఉన్న వాళ్లే.. నిన్ను
నీవు నాతో చెప్పే విషయాలు చాలా కోపం చెబుతావు. వాటిని ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. నీ చుట్టు ఉన్న వాళ్లు నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. అలాంటి విషయాల జోలికి వెళ్లకు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో మోనాల్ కంటతడి పెట్టుకొంటూ కనిపించింది. అయితే ఇంటిలో చాలా గొడవలు, విషయాలు జరుగుతున్నాయి. అందుకే నేను కామ్‌గా ఉంటున్నాను అని కౌగిలించుకొన్నాడు.

హగ్ చేసుకోవడానికి ఇంత సమయమా?
అవును.. నీ నుంచి నాకు ఇదే కావాలి అంటూ మోనాల్ చెప్పింది. నేను ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. హగ్ చేసుకోవడానికి నీవు సమయం ఎందుకు తీసుకొంటున్నావు అని మోనాల్ ప్రశ్నించింది. అయితే నాకు కౌగిలించుకోవడం సిగ్గుగా అనిపిస్తుంది. ప్రతీసారి నిన్ను అలా చేస్తే ఏమనుకొంటావనే ఫీల్ అవుతాను అఖిల్ అంటే.. నాకు నీ నుంచి ఇదే కావాలి.. నేను నీ కోసం ఇలానే ఉంటాను అని మోనాల్ చెప్పింది.


Click it and Unblock the Notifications











