శివజ్యోతి కొత్త ఇల్లు చూస్తే షాక్ కావాల్సిందే.. నాకు రెండే కోరికలు అంటూ ఎమోషనల్
ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో బిత్తిరి సత్తితో యాంకర్ జ్యోతక్కగా పరిచయమైన శివజ్యోతి అలియాస్ బిగ్‌బాస్ తెలుగులో అడుగుపెట్టడంతో సెలబ్రిటీగా మారిపోయింది. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3 ద్వారా శివజ్యోతి విశేషమైన అభిమానులను సంపాదించుకొన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో తర్వాత ఆమె సొంతింటి కలను సాకారం చేసుకొన్నారు. తన ఇంటిని పరిచయం చేస్తూ స్టార్ టీవీ షూట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో సందడి చేస్తున్నది. ఆమె ఇంటిని మనం ఓసారి చూసొద్దాం పదండి..

జీవితంలో రెండే రెండు కోరికలు
యాంకర్ శివజ్యోతి తన ఇంటిని పరిచయం చేస్తూ.. నాకు జీవితంలో రెండే రెండు కోరికలు ఉండేవి. ఒకటి ప్రేమించిన గంగూలిని పెళ్లి చేసుకోవడం, రెండోది సొంత ఇళ్లు ఉండాలని. అలా జీవితంలో రెండు కోరికలు పూర్తయ్యాయి అని చెప్పింది. తన భర్తతో కలిసి ఇంటి తలుపులు తెరిచి ఇది హాలు అంటూ పరిచయం చేసింది.

ఇంట్లో నాకు ఇష్టమైన ప్రదేశం ఇదే
అలాగే ఇంటిలో గలగలా మాట్లాడేస్తూ.. డైనింగ్ హాలులోకి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో నాకు ఇష్టమైన ప్రదేశం ఇదే అంటూ పూజగదిని చూపించింది. ఇప్పటి వరకు ఏమైనా పాపాలు చేస్తే క్షమించు. ఇక ముందు నాకు టెన్షన్లు పెట్టకుండా చూసుకో. నీవు నాకే దిక్కు అంటూ దేవుడికి దండం పెట్టుకొన్నది.

వంట చేయడం వచ్చు కానీ..
ఆ తర్వాత పూజ గది నుంచి వంటగదిలోకి శివజ్యోతి ప్రవేశించింది. నాకు వంట చేయడం వచ్చు.. కానీ మనుషుల బతికేలా చూసుకొంటానని చిన్న సెటైర్ వేసింది. ఆ తర్వాత మేకప్ రూంలోకి వెళ్లారు. దేవుడి రూం తర్వాత నాకు బాగా ఇష్టమైనది ఇదే అంటూ చెప్పింది. అక్కడి నుంచి బెడ్‌రూంలోకి వెళ్లి పెళ్లి తర్వాత కొనుకొన్న డ్రెస్సింగ్ టేబుల్, ఫ్యాన్, బీరువాను చూపించింది.

అందంగా ఇంటిని అలంకరించుకొని
బెడ్‌రూం నుంచి నుంచి గార్డెన్ ఏరియాలోకి శివజ్యోతి వెళ్లింది. పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఆ ప్రదేశాన్ని అలరించుకోవడం కనిపించింది. ఇదే నా చిన్న ప్రపంచం అంటూ శివజ్యోతి ఎమోషనల్ అయింది. చాలా మంది మా ఇల్లును చూపించమని అడిగారు. సమయం వచ్చింది కాబట్టి ఇలా నా ఇంటిని పరిచయం చేశాను అని శివజ్యోతి పేర్కొన్నది.
Recommended Video

యాంకర్ నుంచి సెలబ్రిటీగా
ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో జ్యోతక్క హోదాలో శివజ్యోతి బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించింది. ఇంట్లో అందరితో కలివిడిగా ఉంటూ సంతోషమొచ్చినా.. దు:ఖమొచ్చినా కన్నీళ్లతోనే అందర్ని అలరించింది. స్టార్లతో, అప్పటికే సెలబ్రీటీలుగా చెలామణి అవుతున్న వారికి ధీటుగా రాణించింది. తన తెలంగాణ భాషతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. టాప్ 5 గురిలో నిలిచి టైటిల్ రేసులో టఫ్'గా నిలిచింది.


Click it and Unblock the Notifications











