‘బిగ్‌బాస్‌ హౌస్‌లో మనిషిలా చూడలేదు... జీవితాంతం ఆ బాధ నా గుండెల్లోనే’

భారతదేశంలో స్టార్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ బిగ్‌బాస్ ఫ్యాన్సే. నగర, పట్టణ ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాల్లోకి బిగ్‌బాస్ చొచ్చుకెళ్లింది. బిగ్‌బాస్ ద్వారా పాపులరైన వారెందరో. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లొచ్చిన తర్వాత తమ జీవితాలు మారాయని, లైఫ్‌ని కొత్తగా చూస్తున్నానని చెప్పిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి వస్తారు స్టార్ సింగర్ గీతా మాధురి. బిగ్‌బాస్‌ షో తన జీవితంపై పెను ప్రభావం చూపిందని కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా అన్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

జీవితంలో నన్ను పైకి తీసుకొచ్చిన మూవ్‌మెంట్, మిమ్మల్ని మార్చిన మూవ్‌మెంట్ ఏదైనా ఉందా? అని యాంకర్ అడగ్గా.. దానికి గీతా మాధురి ఆన్సర్ ఇస్తూ.. బిగ్‌బాస్ తర్వాత నా జీవితం చాలా మారింది. ప్రజలు నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు, నన్ను గమనిస్తున్నారు. ప్రేక్షకుల ఇష్టం రెట్టింపు కావడం అనేది బిగ్‌బాస్ వల్లే వచ్చింది. అప్పటి వరకు నా పాటలు ఇష్టం, మనిషి కూడా ఇష్టపడితే .. వాళ్లని దగ్గరి నుంచి చూడగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నాకు అప్పుడు అనిపించిందని గీతా మాధురి పేర్కొన్నారు.

Bigg Boss Changed My Life Completely Geetha Madhuri Emotional Comments

ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టను... నేను దేనికోసం పరిగెత్తే రకం కాదు. చూసేవాళ్లు మాత్రం నేను పరిగెత్తేరకం అనుకుంటారు. బిగ్‌బాస్ లాంటి ఆఫర్ ఎంతమందికి వస్తుందని ఆలోచించా.. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో మనకి అవకాశం వచ్చింది. మనకి ఎదురు డబ్బులిచ్చి మనల్ని ఒక గేమ్‌లో పెట్టి మీకు ఇష్టం వచ్చినట్లు ఉండమనే ఒక్క గేమ్ లేదు. బిగ్‌బాస్ చెప్పింది నేను చేయను అనొచ్చు.. అలాంటి గేమ్ నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించింది. ఒకటే సీక్వెన్స్‌ని ఎలా హ్యాండ్ చేయొచ్చు అని ఆలోచించా. హౌస్‌లోకి వెళ్లాక నేను లోలోపల ఇంకో గేమ్ ఆడుకున్నా. వీళ్లు ఇలా అన్నమాట.. అందరూ ఉన్నప్పుడు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరోలా ఉంటారని అర్ధమైంది అని గీతా మాధురి చెప్పారు.

నాతో ఉంటే చిరాకుగానే ఉంటుంది.. కానీ నా గేమ్ నేను ఆడుకునేదానిని. నేను హౌస్‌లో అడుగుపెట్టాక మీకు నచ్చిన వాళ్లకు రోజ్ ఇవ్వమని ఒక టాస్క్ ఇచ్చారు. అందరికి రోజ్‌లు ఇచ్చుకున్నారు.. నా ఒక్కదానికే ఎవరూ రోజ్ ఇవ్వలేదు. దానిని నేను వాడుకుని ఉండొచ్చు.. కానీ నాకు టైం వస్తుంది కదా? బిగ్‌బాస్ గడుస్తున్న కొద్దీ.. కొంతమంది అర్ధం చేసుకుని నాతో క్లోజ్‌గా ఉన్నారు, కొంతమంది బయటి ఫేమ్ చూసి క్లోజ్‌గా ఉన్నారని గీతా మాధురి గుర్తుచేసుకున్నారు.

ఇవన్నీ చూస్తుంటే నీకు ఆరోజు కనిపించలేదు... నన్ను కనీసం మనిషలా కూడా చూడలేదు. ఈరోజు మాత్రం నీకు నేను కావాలా? అనిపించేది. నాతో ఫస్ట్ మాట్లాడని వాళ్లు తర్వాత నాతో వచ్చి మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసేదానిని. కానీ బయటికి మాత్రం ఏం మాట్లాడేదానిని కాదు. నన్ను హర్ట్ చేస్తే మైండ్‌లో పెట్టుకుంటా.. నెక్ట్స్ డే వాళ్లు మారారు అనిపిస్తే క్షమించే దానిని, కానీ లోపల ఎక్కడో ఒక శునకానందం ఉండేది. ఫేమ్ లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఫేమ్ వచ్చాక మనుషులు ఎలా ఉన్నారు? ఫేమ్ నుంచి నేనేం చేయాలి అనేది ఆలోచించానని గీతా మాధురి వెల్లడించారు

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతిది నాకు సిగ్నల్‌లా అనిపించేది. ఇంతమందిలో నన్నే ఎందుకు టాటూ వేయించుకోమన్నారు. ఏదో సిగ్నల్ ఇది నాకు.. నేనేదో బాగానే చేస్తున్నానని అనుకున్నా. నాకు ఇదంటే చాలా ఇష్టం అన్నవాళ్లకి వాటిని తీసేయడం, చింపేయడం చేశారు. నాకు కాకరకాయ జ్యూస్ ఇష్టం లేదని చెబితే వాళ్లతో కాకరకాయ జ్యూస్ తాగించడం చేసేవాళ్లు. కానీ మనం మాత్రం ఏది ఓపెన్ కాలేదు. నాకు టాటూ వేయించుకోమని చెప్పితే అది మోటివేషన్‌గా అనిపించడంతో వెంటనే టాటూ వేయించుకున్నానని గీతా మాధురి పేర్కొన్నారు.

Read more about: bigg boss geetha madhuri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X