Bigg Boss Telugu 7: గేమ్ స్ట్రాటజీ మార్చిన బిగ్ బాస్.. కన్‌ఫ్యూజన్‌లో పడేసేందుకే అలా..!
తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్ ఒకటి అని చెప్పవచ్చు. ఇక గత సీజన్స్ కంటే.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ తెలుగు 7 స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం అయిన ఈ షో.. ఇంకో నెలరోజుల్లో ముగియనుంది. ఇక 80పర్సెంట్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ప్రేక్షకులను కన్ఫూజన్లో పడేందుకు బిగ్ బాస్ గేమ్ స్ట్రాటజీని మార్చేశారు. ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అందరూ వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇదంతా ప్రేక్షకులను కన్ఫూజన్లో పడేసేందుకే బిగ్ బాస్ ఉల్టా పుల్టా గేమ్ ఆడుతున్నారు. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. ఆసక్తిగా సాగుతోంది. ఇక ఈ సీజన్ గత సీజన్స్ కంటే.. డిఫరెంటుగా సాగుతూ.. ప్రేక్షకులకు ఊహించని విధంగా ట్విస్టులు, షాకులు ఇస్తూ.. ఎంటర్ టైన్ చేస్తుంది. మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదవ వారంలో మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ ను మళ్లీ రీ ఎంట్రీ పేరుతో హౌస్ లోకి పంపించారు.

ఇలా ఊహకు అందకుండా బిగ్ బాస్ షాకులు ట్విస్టులు ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు, నయని పవని, పూజా మూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజ, బోలే షవాలి ఇలా.. మొత్తం పది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక రతికా రోజ్ ను మాత్రం రీ ఎంట్రీ ద్వారా మళ్లీ హౌస్ లోకి పంపించారు. ఇక ప్రస్తుతానికి హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
శివాజీ, యావర్, ప్రశాంత్, అర్జున్ అంబటి, రతికా రోజ్, ప్రియాంక జైన్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, అశ్విని శ్రీ.. మొత్తం పది మంది ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ వారం ఎలిమినేషన్ లేకపోడవంతో.. నెక్ట్స్ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. నాగార్జున ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హౌస్ మేట్స్ కు చెప్పనున్నారు.
అయితే నిజానికి నెక్ట్స్ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండదు.. బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారం.. కంటెస్టెంట్స్ లో భయం పెట్టేందుకు.. ఆడియెన్స్ లో ఆసక్తి కలిగించేందుకు అలా చెప్తాడు. అయితే నెక్ట్స్ వారం కూడా ఒకటే ఎలిమినేషన్ ఉండనుంది. ఇక బిగ్ బాస్ షోను మరో రెండు వారాలు పొడగించనున్నారట. అందులో భాగంగానే ఈ వారం ఎలిమినేషన్ ఎత్తివేశారని అంటున్నారు. ఇదంతా బిగ్ బాస్ స్ట్రాటజీ అని తెలుస్తోంది.

మరోవైపు హౌస్ లో పది మంది ఉన్నారు.. ఇక ఐదుగురు ఎలిమినేట్ అయి.. ఫినాలికి ఐదు మంది పంపించాలంటే.. బిగ్ బాస్ షో మరో 6 వారాలు నడవాలి. మరో నాలుగు వారాల్లో షో ముగియనుండగా.. ఇంకో రెండు వారాలు పొడిగించేందుకే బిగ్ బాస్ ఈ డ్రామాలు ఆడారని తెలుస్తోంది. అలా బిగ్ బాస్ తన స్ట్రాటజీని మార్చుకుని నెటిజన్స్ ను, ప్రేక్షకులను కన్ఫూజన్లో పడేస్తున్నాడు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











