Bigg Boss 7 Telugu: నామినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్.. బలైపోయిన ఆటగాళ్లు.. ఆ కంటెస్టెంట్ల మధ్య వివాదం

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలో పరిచయం అయింది బిగ్ బాస్. చాలా కాలం క్రితమే హిందీలోకి వచ్చిన ఈ రియాలిటీ షో.. ఏడేళ్ల ముందే తెలుగులో కూడా లాంచ్ అయిపోయింది. ఎన్నో అనుమానాలతో వచ్చినా.. మన దగ్గర ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుని సూపర్ సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఈ సీజన్‌లో ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ రచ్చ రచ్చగా సాగినట్లు తెలిసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ముందుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో నుంచి గడిచిన ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ రాయగురులు ఎలిమినేట్ అయ్యారు. అలాగే, గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడు హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు.

Bigg Boss Changes 6th Week Nominations Task After Potugallu Entry

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఐదుగురు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లతో కలిపి ఇప్పుడు షోలో పద్నాలుగు (గౌతమ్‌తో సహా) మంది ఉన్నారు. దీంతో సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ ఎలా సాగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాసెస్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్‌లోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లను 'పోటుగాళ్లు'గా చెప్పిన బిగ్ బాస్.. వీళ్లు ఐదుగురు కలిసి పాత 'ఆటగాళ్ల'ను మాత్రమే నామినేట్ చేయాలని సూచించాడు. ఫలితంగా నయని పావని.. టేస్టీ తేజను, భోలే.. సందీప్ మాస్టర్‌ను, పూజా.. టేస్టీ తేజను, అశ్విని శ్రీ.. అమర్‌దీప్‌, శోభాను నామినేట్ చేశారు. దీంతో వీళ్ల మధ్య గొడవలు జరిగాయి.

Bigg Boss Changes 6th Week Nominations Task After Potugallu Entry

టేస్టీ తేజను పావని, పూజా నామినేట్ చేసిన సమయంలో కాస్త గొడవ జరిగింది. ముఖ్యంగా అశ్విని శ్రీ 'మీరు సెల్ఫిష్‌గా ఆలోచిస్తారు' అని చెప్పి అమర్‌దీప్ చౌదరిని నామినేట్ చేయడంతో అతడు ఫైర్ అయ్యాడు. 'ఈ గేమ్ అంటేనే సెల్ఫిష్‌గా ఆలోచించాలండి. ఇక్కడకు వచ్చిందే నా కోసం నేను ఆలోచించుకోవడానికి' అంటూ ఆమెకు సమాధానం చెప్పాడు.

ఆ తర్వాత శోభా శెట్టి అయితే 'గ్రూపిజం గ్రూపిజం అంటారు. అసలు ఎక్కడుంది గ్రూపిజం? ఒక్క ఉదాహరణ చెప్పండి. దానివల్ల మీరు నష్టపోయారా? ఇంకెవరైనా నష్టపోయారా చెప్పండి. రేపు ఈ పరిస్థితి మీకు కూడా రావొచ్చు. ప్రతి ఒక్కరూ గ్రూపిజం అని నామినేట్ చేస్తుంటే మాక్కూడా బాధగానే ఉంటుంది' అంటూ అశ్విని శ్రీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం చూపించిన ప్రోమోలో పోటుగాళ్లు.. ఆటగాళ్లను నామినేట్ చేయడం కనిపించింది. మరి కొత్త వాళ్లను కూడా పాత వాళ్లు నామినేట్ చేసే అవకాశం ఇస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి మొదటి రోజే రెండు గ్రూపుల మధ్య బిగ్ బాస్ వివాదాన్ని సృష్టించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X