Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. షోలో కొత్త రూల్.. ఆ కంటెస్టెంట్‌కు 2 వారాల ఇమ్యూనిటీ

ఊహకే అందని ట్విస్టులు.. సరికొత్త టాస్కులతో సాగుతూ ప్రేక్షకులకు ఆద్యంతం మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే అంచనాలు లేకుండానే వచ్చి ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అదే సమయంలో భారీగా రేటింగ్‌ను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో మొదటి కెప్టెన్సీ టాస్కును నిర్వహకులు స్టార్ట్ చేశారు. ఇందులో సూపర్ చేంజ్ చేశారు. ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి మరి!

ఏడో సీజన్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లలో అందరూ కన్ఫార్మ్ అయినట్లు కాదని చెప్పి ఆరంభంలోనే షాకిచ్చిన బిగ్ బాస్.. ఆ తర్వాత నాలుగు వారాల పాటు పవర్ అస్త్రలను గెలుచుకునేందుకు టాస్కులు ఇచ్చాడు. ఇందులో సందీప్, శివాజి, శోభా శెట్టి, ప్రశాంత్‌లు గెలిచి అస్త్రాలను సంపాదించారు. ఇందులో శివాజి అస్త్రాన్ని శనివారం ఎపిసోడ్‌లో వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

Bigg Boss Changes in Captaincy Task In 7th Season

ఐదు వారాల ఇమ్యూనిటీని ఇచ్చే విధంగా తీసుకు వచ్చిన పవర్ అస్త్ర టాస్కులను ఈ వారంతో ముగించేశారు. దీంతో సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ దగ్గర ఉన్న అస్త్రాలను గత ఎపిసోడ్‌లో బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు, ఇకపై అందరూ సాధారణ కంటెస్టెంట్ల కిందకే వస్తారని తేల్చేశాడు. దీంతో వీళ్లకు స్పెషల్ అధికారాలు కూడా ఉండవని పరోక్షంగా వెల్లడించాడు.

పవర్ అస్త్ర టాస్కులు పూర్తి అవడంతో 5వ వారం నుంచే బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కెప్టెన్సీ టాస్కును పరిచయం చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఇందులో పలు రకాల మార్పులను చేసినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. ముఖ్యంగా కెప్టెన్ అయిన కంటెస్టెంట్ తర్వాత వారంలో వచ్చే నామినేషన్స్ నుంచి మాత్రమే సేఫ్ అయ్యేవాడు. కానీ, ఇందులో కీలకమైన మార్పు చేశారు.

Bigg Boss Changes in Captaincy Task In 7th Season

ఉల్టా పుల్టాగా సాగుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కెప్టెన్ అయితే వాళ్లకు సూపర్ పవర్ వస్తుందని తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ తెలిపాడు. దీని ప్రకారం.. కెప్టెన్ అయిన వాళ్లు ఆ వారం నామినేషన్స్‌లో ఉంటే డైరెక్టుగా సేఫ్ అవడంతో పాటు తర్వాతి వారం జరిగే నామినేషన్స్‌లో మినహాయింపు పొందుతారు. అంటే ఈ సారి ఏకంగా కెప్టెన్‌కు రెండు వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది.

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కెప్టెన్ అయిన వాళ్లకు ఇమ్యూనిటీతో పాటు కొన్ని స్పెషల్ పవర్స్ కూడా లభించబోతున్నట్లు తెలిసింది. అంటే నేరుగా మరొకరిని నామినేట్ చేయడం లేదా నామినేషన్స్ నుంచి ఒకరిని తప్పించడం లేదా నామినేషన్స్ ఒకరికి బదులు మరొకరిని స్వాప్ చేయడం ఇలా పవర్ రాబోతుంది. అలాగే, కెప్టెన్‌కు ప్రత్యేకమైన గదిని కూడా కేటాయించబోతున్నారు.

Bigg Boss Changes in Captaincy Task In 7th Season

ఇదిలా ఉండగా.. ఏడో సీజన్ ఐదో వారంలో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న పది మందిని ఐదు జంటలుగా మారాలని సూచించాడు. వీళ్లకు పలు రకాల టాస్కులు ఇచ్చి.. కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెండర్లను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇందులో గెలిచిన వాళ్లు ఈ సీజన్‌కు మొదటి కెప్టెన్‌గా నిలవబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X