బిగ్ బాస్2: భావోద్వేగానికి గురైన గణేష్ తల్లి.. ప్రతి వారం నామినేషన్, ఎక్కడకి వెళ్లినా!
ఎలాంటి వ్యక్తినైనా బిగ్ బాస్ షో పెద్ద సెలేబ్రిటిగా మార్చేస్తుంది. బిగ్ బాస్ లో ఉండే ప్రత్యేకతే అది. ప్రస్తుతం అన్ని భాషల్లో బుల్లి తెరపై బిగ్ బాస్ షో రాజ్యం ఏలుతోంది. ఇదిలా ఉండగా తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లోకి సామాన్యుడిగా ఎంటర్ అయిన గణేష్ హౌస్ లో బాగా రాణిస్తూ కొనసాగుతున్నాడు. ఆరంభంలో అందరితో కలవడానికి ఇబ్బంది పడిన గణేష్ ఇప్పుడు కలివిడిగా మెలుగుతున్నాడు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా గణేష్ తల్లి దండ్రులు మాట్లాడారు.

సామాన్యుడిగా
గణేష్ సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. లక్షలాది మందిలో బిగ్ బాస్ యాజమాన్యం గణేష్ ని ఎంపిక చేసుకుంది. అందుకు వారికీ కృతజ్ఞతలు అని గణేష్ తల్లి దండ్రులు తెలిపారు. తమది సాధారణ కుటుంబం కనుకనే మొదట్లో గణేష్ సెలెబ్రిటీలతో కలవడానికి ఇబ్బంది పడ్డాడని గణేష్ తల్లి తెలిపింది.

ప్రతి వారం నామినేషన్
గణేష్ ప్రతివారం నామినేషన్ లో ఉంటున్నాడు. మొదట్లో కొంత ఆందోళన కలిగేది. బిగ్ బాస్ వలన వచ్చిన మంచి అవాకాశాన్ని గణేష్ సరిగా ఉపయోగించుకోవడం లేదేమోనని భాదపడ్డాం. కానీ ఇప్పుడు నామినేషన్ లో ఉన్నప్పకిటికీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడని అన్నారు.

నాని వలనే
నాని వలనే గణేష్ పెర్ఫామెన్స్ బాగా చేస్తుందని గణేష్ తల్లి తెలిపింది. ప్రతి వారం నాని గణేష్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆడియన్స్ వాడికి అండగా నిలుస్తున్నాడు. ఇంకా మరిన్ని రోజులు గణేష్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటాడని భావిస్తున్నాం.

కూరగాయలు కొనడానికి
కూరగాయలు కొనడానికి వెళితే మా బాబు చేస్తున్న బిగ్ బాస్ చూస్తున్నారా అని వారిని సరదాగా అడుగుతా. వారు వెంటనే గణేష్ మీ అబ్బాయా.. మీ కొడుకా.. మీరు గణేష్ అమ్మగారా అని ఆశ్చర్యపోయి అడుగుతున్నారు. ఇదంతా బిగ్ బాస్ వలనే అని అన్నారు.

ఇంకా ప్రోత్సహించాలి
ఆడియన్స్ గణేష్ ని ఇంకా ప్రోత్సహించి ఓట్లు వేయాలని గణేష్ తల్లి కోరారు. గణేష్ చాలా మంచివాడని, ఇతరులకు సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అని గణేష్ తల్లి ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











