అభిజీత్ పేరిట నేషనల్ రికార్డ్: బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్‌కూ దక్కని ఘనత సొంతం

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న వారిలో యంగ్ హీరో అభిజీత్ ఒకడు. సినిమాల్లో నటించినా పెద్దగా ఫాలోయింగ్ అందుకోలేకపోయిన అతడు.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దీనికి కారణం హౌస్‌లో ఎంతో కూల్ అండ్ కామ్‌గా ఉండడమే. దీనికి తోడు మైండ్ గేమ్‌తో పలు టాస్కులు గెలవడమూ అతడిని హైలైట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌ పేరిట నేషనల్ రికార్డ్ నమోదైంది. బిగ్ బాస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడతను. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
ఒక్క టాస్కుతో అభిజీత్ గ్రాఫ్ పెరిగింది

ఒక్క టాస్కుతో అభిజీత్ గ్రాఫ్ పెరిగింది

సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. ఆరంభంలో జరిగిన రొబోట్ టాస్కులో అతడు మాస్టర్ ప్లాన్ వేసి తన జట్టును గెలిపించాడు. ఈ టాస్కుతో అతడి స్టామినా బయట పడడంతో పాటు సయ్యద్ సోహెల్ రియాన్, మెహబూబ్, అఖిల్ సార్థక్ టార్గెట్ చేయడం వల్ల సానుభూతి వచ్చింది. అప్పటి నుంచి అభిజీత్ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతూనే ఉంది.

రెండు ట్రాకులతో మరింత పాపులారిటీ

రెండు ట్రాకులతో మరింత పాపులారిటీ

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన సమయంలో అభిజీత్.. గుజరాతీ భామ మోనాల్ గజ్జర్‌తో క్లోజ్‌గా ఉంటూ కనిపించాడు. దీంతో ఈ ఇద్దరి మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు షో నిర్వహకులు. ఆ తర్వాత మోనాల్.. అఖిల్ సార్థక్‌తో సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. దీంతో అభిజీత్‌.. దేత్తడి హారికతో క్లోజ్ అయ్యాడు. ఈ రెండు ట్రాకుల వల్ల అతడు మరింత పాపులర్ అయిపోయాడు.

ఈ సారి విజేత అభిజీతే.... ట్రెండింగ్‌లో

ఈ సారి విజేత అభిజీతే.... ట్రెండింగ్‌లో


సాధారణంగా బిగ్ బాస్ షోలో విజేతను గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ప్రకటిస్తారు. కానీ, మూడు సీజన్లుగా బయట ట్రెండ్‌ను బట్టే విన్నర్ అవుతున్నాడు. రెండో సీజన్‌లో కౌశల్ మండా, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ అలాగే విజేతలుగా నిలిచారు. ఇక, ఇప్పుడు అభిజీత్ నామస్మరణతో తెలుగు రాష్ట్రాలు మారుమ్రోగుతున్నాయి. దీంతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు.

మళ్లీ ట్రెండ్ సెట్ చేస్తున్న అభి ఫ్యాన్స్

మళ్లీ ట్రెండ్ సెట్ చేస్తున్న అభి ఫ్యాన్స్

ఇప్పటికే #HappyDiwaliAbijeet అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు అభిజీత్ ఫ్యాన్స్. ఆ తర్వాత #WeAdmireAbijeet అనే ట్యాగ్‌తో పెద్ద రచ్చే చేశారు. ఈ ట్వీట్ 24 గంటల్లోనే 5 లక్షలకు పైగా ట్వీట్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వాళ్లంతా #KingOfHeartsAbijeet అనే ట్యాగ్‌ను క్రియేట్ చేసి ఫినాలేకు ముందు ట్రెండ్ చేస్తున్నారు.

అసలైన రికార్డును క్రియేట్ చేసేశారుగా

శనివారం మధ్యాహ్నం నుంచి #KingOfHeartsAbijeet అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు అభిజీత్ ఫ్యాన్స్. ఈ ట్యాగ్ వరుస ట్వీట్లతో దూసుకుపోతోంది. ఫలితంగా ఆదివారం ఉదయం 9 గంటలకు అంటే 15 గంటల్లో ఐదు లక్షల ట్వీట్లు నమోదు చేశారు ఫ్యాన్స్. దీంతో అభిజీత్ పేరిట మరో రికార్డును క్రియేట్ చేశారు. దీంతో ఇది దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

బిగ్ బాస్ చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా

బిగ్ బాస్ చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా

గతంలో #HappyDiwaliAbijeet అనే ట్యాగ్‌తో కొన్ని లక్షల ట్వీట్స్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ తర్వాత #WeAdmireAbijeet, #KingOfHeartsAbijeet అనే ట్యాగ్‌లతో ఐదు లక్షల ట్వీట్లు దాటేశారు. దీంతో పలుమార్లు ఐదు అంతకంటే ఎక్కువ లక్షల ట్వీట్లు అందుకున్న ఏకైక బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అభిజీత్ నేషనల్ రికార్డును నమోదు చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X