Just In
- 3 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 3 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 5 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 5 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ తర్వాత ఆరియానా సన్యాసం: టాప్ సీక్రెట్స్ లీక్ చేసిన ఆమె సోదరి
చిన్న యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ అలియాస్ అర్చన. ఇక, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె మరింత పాపులర్ అయింది. అద్భుతమైన ఆటతీరు పాటు నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అందుకే ఇన్ని వారాల పాటు హౌస్‌లో కొనసాగుతోంది. ఇదిలాఉండగా, బిగ్ బాస్ తర్వాత ఆరియానా సన్యాసం తీసుకోబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె సోదరి కొన్ని టాప్ సీక్రెట్స్ రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

ఆరియానా.. డేరింగ్ యాంకర్
చిన్న వయసులోనే తన బాధ్యత పెరగడంతో ఆరియానాకు కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో పలు ఉద్యోగాల్లో జాయిన్ అయింది. చివరికి యూట్యూబ్ చానెల్‌లో యాంకర్‌గా స్థిరపడింది. ఈ క్రమంలోనే తనలోని టాలెంట్‌ను బయటకు తీస్తూ అంచలంచెలుగా ఎదిగింది. దీంతో పెద్ద పెద్ద సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ డేరింగ్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆర్జీవీ చేసిన ట్వీట్‌తో హైలైట్
కొద్ది రోజుల క్రితం ఓ మూవీ ప్రమోషన్ కోసం ఆరియానా పని చేస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆమెతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ‘నాకు అందంగా కనిపించిన వారిలో నువ్వు ఒక దానివి' అంటూ కితాబిచ్చాడు. ఆ తర్వాత ఈ వీడియో స్వయంగా ట్వీట్ చేయడంతో ఆరియానా హైలైట్ అయింది.

బిగ్ బాస్.. అతడితో సీక్రెట్‌గా
ఆర్జీవీ చేసిన ట్వీట్ తర్వాత ఆరియానా గ్లోరీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అప్పటి నుంచి గూగుల్‌లో ఈమెను వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఊహించని విధంగా ఆరియానాను సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌కు పంపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిందీ అమ్మాయి.

బోల్డ్ బ్యూటీ.. అతడితో ట్రాక్
ఉన్నది ఉన్నట్లు చెప్పడంతో పాటు తనను తాను డిఫెండ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఆరియానా. టాస్కుల్లో సైతం దుమ్ముదులిపే ప్రదర్శన చేస్తోంది. దీంతో ఆమెకు బోల్డ్ బ్యూటీ అనే వచ్చింది. ఆ తర్వాత జబర్ధస్త్ కమెడియన్ అవినాష్‌తో కలిసి లవ్ ట్రాక్ నడుపుతుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో ఈమె మరింతగా ఫేమస్ అయిపోయింది.

సన్యాసినిగా మారబోతుంది
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోని బెస్ట్ కంటెస్టెంట్లలో ఆరియానా గ్లోరీ ఒకరు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తుండడంతో ఆమెకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమెకు ఫైనల్‌కు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరియానా బిగ్ బాస్ తర్వాత సన్యాసం తీసుకోబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా దీనిపై ఆమె సోదరి నైనా స్పందించింది.

సీక్రెట్స్ లీక్ చేసిన సోదరి నైనా
బయట వైరల్ అవుతోన్న అంశంపై స్పందించిన నైనా ‘మా అక్కకి దైవ భక్తి అస్సలు లేదు. ఎదుటి వారికి సాయం చేయడమే గొప్ప అని ఫీల్ అవుతుంది. కానీ, అప్పుడప్పుడూ సన్యాసం తీసుకుంటా అని చెబుతుంటుంది. దీంతో మేమే షాక్ అవుతుంటాం. కొన్ని సార్లు ఆమె నన్ అవడానికి ప్రయత్నించిందని అంటున్నారు. ఆ విషయం మాత్రం మాకెవరికీ తెలీదు' అని రివీల్ చేసింది.