వినీత్‌తో రిలేషన్ బయట పెట్టిన ఆరియానా: నాగ్ సార్‌తో మా అమ్మే చెప్పిందంటూ కామెంట్

ఆరియానా గ్లోరీ... తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఆమె కొంత కాలంగా హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనడమే. సాదాసీదాగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం ఆమె కోసం వినీత్ అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. అప్పుడు అతడికి ఐ లవ్ యూ అని కూడా చెప్పిందామె. ఈ నేపథ్యంలో తాజాగా వినీత్ గురించి షాకింగ్ సీక్రెట్స్ లీక్ చేసింది ఆరియానా. ఆ వివరాలు మీకోసం!

అతడితో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చింది

అతడితో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చింది

యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా సత్తా చాటి ఎంతగానో ఫేమస్ అయింది ఆరియానా గ్లోరీ. రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఆమె ఒక్కసారిగా సంచలనం అయింది. ఆ సమయంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అయితే, అందరు కంటెస్టెంట్లలా కాకుండా.. సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా.

ఆరియానా అంటేనే గేమర్ అనిపించేలా

ఆరియానా అంటేనే గేమర్ అనిపించేలా

తనను తాను బోల్డ్ లేడీ అని పరిచయం చేసుకుంటూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. అందుకు అనుగుణంగానే హౌస్‌లో దూకుడును ప్రదర్శించింది. ఈ క్రమంలోనే అన్ని టాస్కుల్లో వందకు వంద శాతం ఇచ్చి ఫైటర్ అనిపించుకుంది. అదే సమయంలో ముక్కుసూటిగా ఉంటూ పలు వివాదాల్లో చిక్కుకుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది.

ఆ కంటెస్టెంట్‌తో ట్రాక్ నడిపి పాపులర్

ఆ కంటెస్టెంట్‌తో ట్రాక్ నడిపి పాపులర్

సీక్రెట్‌ రూమ్‌లో చేసిన పనులతో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పెద్దగా కలవలేకపోయింది ఆరియానా గ్లోరీ. అలాంటి పరిస్థితుల్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్. లోపలికి వచ్చినప్పటి నుంచి అతడితో క్లోజ్‌గా ఉందామె. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ నడిచింది. ఇలా కూడా ఆరియానా గ్లోరీ బాగా ఫేమస్ అయిపోయిందనే చెప్పాలి.

టాప్‌-5 కంటెస్టెంట్.. నాలుగో స్థానంతో

టాప్‌-5 కంటెస్టెంట్.. నాలుగో స్థానంతో

మిగిలిన అందరు కంటెస్టెంట్లతో పోలిస్తే.. ఆరియానా గ్లోరీ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉండేంది. ఈ కారణంగానే పలుమార్లు నామినేషన్స్‌లోకి వెళ్లింది. అయితే, సరైన ఆటతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని టాప్-5లోకి చేరుకుంది. అయితే, గత వారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేత్తడి హారిక తర్వాత ఎలిమినేట్ అవడంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుందామె.

వినీత్‌తో రిలేషన్ బయట పెట్టేసిందిగా

వినీత్‌తో రిలేషన్ బయట పెట్టేసిందిగా


బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆరియానా తరపున మాత్రం ఫ్రెండ్ వినీత్ వచ్చాడు. దీంతో అతడితో ఆమె ప్రేమాయణం సాగిస్తుందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో అతడి గురించి మాట్లాడుతూ.. ‘వినీత్ నాకు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే. అమ్మ తర్వాత అమ్మలా. నాకో కేర్ టేకర్ లాంటోడు' అని తేల్చిసింది.

నాగ్ సార్‌తో మా అమ్మే చెప్పిందంటూ

నాగ్ సార్‌తో మా అమ్మే చెప్పిందంటూ

అంతేకాదు, అతడి గురించి మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ మెంటర్‌లా అతడు రావడానికి కారణం.. ఆ సమయంలో మా అమ్మకు ఆరోగ్యం బాలేదు. ఇదే విషయం ఫినాలే రోజు నాగ్ సార్‌తో మా అమ్మే చెప్పింది. అప్పుడు వినీత్ పాప కోసం నేను వెళ్తా అని రిక్వెస్ట్ చేశాడట. అందుకే అతడు వచ్చాడు. నా లైఫ్‌లో అతడి పాత్ర చాలా ఉంది. చిన్నప్పటి నుంచి అంత క్లోజ్' అని వివరించింది ఆరియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X