రోజుకు రేటెంత?... నగ్నంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్.. మీ వల్లనే రేప్ కల్చర్.. నెటిజన్ల ఫైర్
సినీతారలు ప్రచారం, పబ్లిసిటీ కోసం ఎప్పుడూ ముందుంటారు. అవకాశం వస్తే బరితెగించేందుకు సిద్ధమవుతారు. అందులో ముందుండే వాళ్లలో సన్యాసి (నన్)గా మారిన సోఫియా హయత్ ఒకరు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ వివాదాస్పదంగా మారింది. ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా మారడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మహిళ ప్రతిష్టను కించపరిచే విధంగా ఉందంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆమె నాటు ఫోటో షూట్ గురించి..

ప్రేమ, దివ్యత్వం అంటూ
బిగ్‌బాస్ కంటెస్ట్‌గా, నటిగా, అనేక వివాదాలకు కేంద్ర బిందువైన సోఫియా హయత్ హాట్ హాట్ ఫోటోషూట్ నిర్వహించింది. ఆ ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దాంతో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. సిగ్గు వెనుక దేవుడు ఉన్నాడు. దివ్యత్వంతో కూడిన ఓ తల్లి మీకు అన్నీ అర్పిస్తే.. ఆమెను సిగ్గు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తారా అని తనకు తాను సోఫియా హయత్ సమర్ధించుకొనే ప్రయత్నం చేసింది.

దేవుడికి లేని సిగ్గు మనకెందుకు
దేవుడికి లేని సిగ్గు మనకేందుకు? మంచి ఏదో చెడో దేవుడో క్లారిటీ ఇచ్చాడు. దేవుడి అభిమతం తెలుసుకొన్న వారు సిగ్గు అనే పదాన్ని ఉపయోగించారు. దానిని మహిళలకు ఆపాదించరు. మహిళలను వ్యభిచారి అని కామెంట్ చేయరు. ఇలాంటి ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన తర్వాత ఒకరోజుకు రేటంతా అని చాలా మంది ఈమెయిల్‌లో అడుగుతున్నారు. అలా అసభ్యకరమైన కామెంట్లు చేసేవారు ఈ సమాజానికి అవసరమా అని సోఫియా హయత్ ప్రశ్నించారు.

ఆడమ్ అండ్ ఈవ్ గురించి తెలియదా?
మహిళలకు మహిళలే శత్రువులు. సాటి మహిళనే మరో మహిళను వ్యభిచారి అంటూ కామెంట్ చేస్తారు. ఆడమ్ అండ్ ఈవ్ కథల వెనుక ఉన్న పరమార్థం చాలా మందికి తెలియదు. మీ ఆలోచనల్లో దివ్యత్వం ఉండాలి. ఎదుటి వాళ్లను కామంతో చూడకూడదు. ప్రతీ వ్యక్తిని ప్రేమతో ఆదరించాలి. నా నగ్నదేహాన్ని ఎలా చూస్తారనేది మీ ఆలోచనలకు, మీలో ఉన్న కోరికలకు అద్దం పడుతుంది అంటూ ఒకరకమైన వేదాంతం చెప్పేందుకు ప్రయత్నించారు.

మీ కారణంగానే రేప్ కల్చర్
దేశంలో లైంగిక దాడులు పెరగడానికి మీ లాంటి వాళ్లే కారణం. మీ అంగాంగ ప్రదర్శన వల్లనే రేప్ కల్చర్ పెరిగిపోతున్నది. నగ్నత్వాన్ని ప్రమోట్ చేసే మీలాంటి మహిళలపై ప్రభుత్వాలు చర్య తీసుకొంటే దేశంలో రేప్ కల్చర్ ఉండనే ఉండదు అని సోఫియా హయత్‌ను ఉద్దేశించి కొందరు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

మహిళలకు స్వేచ్ఛ కావాలి అంటూ
అయితే కొందరు నెటిజన్లు సోఫియాకు మద్దతుగా నిలుస్తున్నారు. మీలాంటి సుంకుచిత భావాలు ఉన్నవాళ్ల కారణంగానే మహిళలకు స్వేచ్ఛ కరువు అవుతున్నది. మహిళలను తమకు నచ్చిన విధంగా ఉండేలా బతకనిద్దాం అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











