Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అభిజీత్ దెబ్బకు బద్దలైపోతోన్న రికార్డులు: కంటిన్యూ అయితే విన్నర్ అవుతాడేమో!
అభిజీత్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించినా రాని గుర్తింపు ఈ మధ్య వచ్చింది. దీనికి కారణం ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోనే. ఈ సీజన్లో కంటెస్టెంట్‌గా సాదాసీదా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల నుంచి మన్ననలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే చాలా మందికి ఫేవరేట్ కంటెస్టెంట్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిజీత్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. దీంతో అతడే విన్నర్ అయినా అశ్చర్యం లేదన్న టాక్ వినిపిస్తోంది. అసలేం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...
సినిమా నుంచి పెళ్లి గోల వరకు ఇలా
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. ఈ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత ‘రామ్ లీలా', ‘మిర్చి లాంటి కుర్రాడు' వంటి సినిమాల్లో నటించాడు. ఇవేమీ అతడికి హిట్‌ను ఇవ్వలేకపోయాయి. దీంతో సినిమాలకు దూరమై ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇది మాత్రం హిట్ అయింది.
బిగ్ బాస్‌లోకి ఎంట్రీతో మారిన సీను
కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా అభిజీత్‌కు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే అతడు ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం నడుస్తోన్న నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా ఇప్పుడు అభిజీత్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది.
స్మార్ట్ గేమ్ స్పెషలిస్ట్... బలహీనత
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో క్లారిటీగా ఉండే వ్యక్తిగా అభిజీత్కే పేరొచ్చింది. అందుకే టాస్కులను ఫిజికల్‌గా కాకుండా.. మెంటల్‌గా ఆడి గెలవాలని భావిస్తుంటాడు. ఇలా ఆడిన ఒకటి రెండు టాస్కులను విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో అతడికి బాగా పేరొచ్చింది. అయితే, ఇదే బలహీనతగా కూడా మారింది. ఫిజికల్ టాస్కులు ఆడలేడని చాలా మంది నామినేట్ చేశారు.
లవర్ బాయ్ ఇమేజ్.. అభికగా ఫిక్స్
బిగ్ బాస్ హౌస్‌లోని మేల్ కంటెస్టెంట్లలో అభిజీత్‌కు లవర్ బాయ్ అనే పేరు వచ్చింది. దీనికి కారణం షో ఆరంభంలో అతడు మోనాల్ గజ్జర్‌తో పులిహోర కలపడమే. ఇక, ఆ తర్వాత దేత్తడి హారికతో చనువుగా ఉంటున్నాడు. దీంతో వీళ్ల జంట బాగా ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వీళ్లిద్దరి అభిమానులు ఈ జంటకు ‘అభిక' అనే షార్ట్ కట్ పేరును పెట్టేశారు.
అభిజీత్ దెబ్బకు రికార్డులు బద్దలు
అద్భుతమైన ఆటతీరుతో పాటు ఎప్పుడూ కూల్‌గా ఉండే అభిజీత్‌కు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో వాళ్లు అతడిని ఎన్నోసార్లు ఎలిమినేషన్ నుంచి కాపాడారు. అదే సమయంలో అభి పేరిట సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే హ్యాపీ దివాళీ అభిజీత్ అనే హ్యాష్ ట్యాగ్ లక్ష పైచిలుకు ట్వీట్లు సాధించి ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
కంటిన్యూ అయితే విన్నర్ అవుతాడేమో!
తాజాగా #WeAdmireAbijeet అనే ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు అభిజీత్ ఫ్యాన్స్. దీంతో ఈ ట్యాగ్ మీద ఇప్పటికే దాదాపు మూడు లక్షల ట్వీట్లు వచ్చాయి. అంతేకాదు, వేగంగా ఇన్ని ట్వీట్లు అందుకున్న ట్యాగ్‌గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో అభిజీత్ ఫ్యాన్స్ ఊపు చూస్తుంటే అతడినే ఈ సీజన్ విన్నర్‌ను చేసేస్తారని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.