బాత్ టబ్ లో అఖిల్ సార్ధక్ ఫొటో షూట్.. యాటిట్యూడ్ చూపించాలట

గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ లో ఒకడైన అఖిల్ సార్ధక్ అసలు ఫైనల్ వరకు వస్తాడని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. మొదట హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతనిపై పెద్దగా అంచనాలు అయితే లేవు. కానీ ఫైనల్స్ వరకు టైటిల్ బరిలో నిలిచి తన అసలైన ప్రత్యర్ధితోనే పోటీ పడ్డాడు. ఇక అఖిల్ సార్ధక్ ఇటీవల సరికొత్త యాటిట్యూడ్ తో ఒక ఫొటో షూట్ చేయగా ఆ ఫొటోస్ పై అతని ఫాలోవర్స్ పాజిటీవ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

చివరలో భారీగా ఓట్లు

చివరలో భారీగా ఓట్లు

నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న అఖిల్ ముందుగా బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ గా సత్తా చాటాలని అనుకున్నాడు. అసలు ఫైనల్ వరకు రావడమే అతని బిగ్గెస్ట్ లక్ అని చెప్పాలి. లక్కీగా టిక్కెట్ టూ ఫైనలే లాటరీ తగలడం మనోడి లైఫ్ ను ఒక్కసారిగా మార్చేసింది. చివరలో ఓ వర్గం జనాల నుంచి కూడా ఓట్లు గట్టిగానే వచ్చాయి.

 ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది.

ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది.

నిజానికి అఖిల్ హౌజ్ లోకి అడుగు పెట్టినప్పుడు అతనంటే ఎవరికి పెద్దగా తెలియదు. చాలా వరకు అతను మొదటి వారమే వెళ్లిపోతాడాని న్యూస్ బాగానే వచ్చింది. ఇక ప్రతి వారం హౌజ్ మెంట్స్ మద్దతుతో సేఫ్ అవుతూ వచ్చిన అఖిల్ మెల్లగా ఆడియెన్స్ సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. మొదట్లో అతనిపై ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది.

 బాత్రూమ్ లో ఫొటోలు

బాత్రూమ్ లో ఫొటోలు

ఏదేమైనా అఖిల్ సోలోగా ఫైనల్ వరకు చేరుకొని ఒక క్రేజ్ అయితే అందుకున్నాడు. అయితే ప్రస్తుతం అతని ఫోకస్ అంతా కూడా సరైన అవకాశాలు ఎలా సాధించాలనే దానిపైనే ఉన్నాడు. కెరీర్ ను వీలైనంత త్వరగా సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఇటీవల డిఫరెంట్ గా ఉంటుందని అనుకున్నాడో ఏమో గాని బాత్రూమ్ టబ్ లో ఫొటో షూట్ నిర్వహించాడు.

యాటిట్యూడ్ కా బాప్

యాటిట్యూడ్ కా బాప్

జనాలు మీ మాట వినవచ్చు.. అలాగే మీ యాటిట్యూడ్ ని కూడా ఫీల్ కావచ్చని తనదైన శైలిలో ఓ కొటేషన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. యాటిట్యూడ్ కా బాప్ అంటూ ఫాలోవర్స్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు.

నెగిటివ్ పాత్రలో..

నెగిటివ్ పాత్రలో..

అఖిల్ కు సినిమాల్లో అవకాశాలు పెద్దగా రావడం లేదని రూమర్స్ వస్తుండగా ఫైనల్ గా ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా నెగిటివ్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఓ వైపు సోహెల్ మరోవైపు అబిజిత్ కూడా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. ఎవరికి వారు ఆఫర్స్ తో బిజీగా ఉండగా అఖిల్ కు పెద్దగా ఆఫర్స్ రావడం లేదని రూమర్స్ అయితే వస్తున్నాయి.

Recommended Video

Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates
ఆ సినిమాలోనే..

ఆ సినిమాలోనే..

నిజానికి అతను ఒక ప్రాజెక్టు కోసం సెలెక్ట్ అయినట్లు ఇన్ సైడ్ టాక్. అది కూడా నెగిటివ్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా సీటిమార్ అని టాక్ కూడా వస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా నటిస్తున్న ఆ సీటిమార్ సినిమాలోనే అఖిల్ ఒక వైలెంట్ పాత్రలో నటించనున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X