అఖిల్ సార్ధక్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడా.. నెగిటివ్ పాత్రలో సర్ ప్రైజ్..

బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ సార్ధక్ అసలు ఫైనల్ వరకు వస్తాడని ఎవరు ఉహీంచలేదు. మొదట ఎంట్రీ ఇచ్చినప్పుడు అతనిపై పెద్దగా అంచనాలు అయితే లేవు. కానీ ఫైనల్ 2 వరకు వచ్చి తన అసలైన ప్రత్యర్ధితోనే పోటీ పడ్డాడు. అయితే అతనికి అవకాశాలు పెద్దగా రావడం లేదని రూమర్స్ వస్తుండగా ఫైనల్ గా ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా నెగిటివ్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Recommended Video

Bigg Boss Telugu 4 : Megastar Chiranjeevi Promise To Sohel | Chiru Bumper Offer To Divi
 అదే..అఖిల్ లక్కు

అదే..అఖిల్ లక్కు

యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న అఖిల్ ముందుగా బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ గా సత్తా చాటాలని అనుకున్నాడు. అసలు ఫైనల్ వరకు రావడం అదృష్టమనే చెప్పాలి. లక్కీగా టిక్కెట్ టూ ఫైనలే లాటరీ తగలడం మనోడి లైఫ్ ను ఒక్కసారిగా మార్చేసింది. చివరలో ఓ వర్గం జనాల నుంచి ఓట్లు కూడా గట్టిగానే వచ్చాయి.

 అలానే సేఫ్ అవుతూ..

అలానే సేఫ్ అవుతూ..

అఖిల్ హౌజ్ లోకి అడుగు పెట్టినప్పుడు అతనంటే ఎవరికి పెద్దగా తెలియదు. చాలా వరకు అతను మొదటి వారమే వెళ్లిపోతాడాని టాక్ వచ్చింది. ఇక ప్రతి వారం హౌజ్ మెంట్స్ మద్దతుతో సేఫ్ అవుతూ వచ్చిన అఖిల్ మెల్లగా ఆడియెన్స్ సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. మొదట్లో అతనిపై ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది.

అభిజిత్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్

అభిజిత్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్

అఖిల్ టాప్ 7 కంటెస్టెంట్స్ లలో ఉన్నప్పుడు కూడా వెళ్లిపోవచ్చని అంతా అనుకున్నారు. అఖిల్ కూడా ఇంటర్వ్యూలో అదే చెబుతున్నాడు. కానీ అదృష్టవశాత్తూ అతను ఫైనల్ వరకు వచ్చాడు. ఎక్కువగా అఖిల్ మొదట్లో అభిజిత్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మోనాల్ విషయంలో అఖిల్, అభి మధ్య ఎన్నిసార్లు విబేదాలు వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

విలన్ పాత్రలో అఖిల్

విలన్ పాత్రలో అఖిల్

ఇక ప్రస్తుతం బిగ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఓ వైపు సోహెల్ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. మరోవైపు అబిజిత్ కూడా మెల్లగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి వారు ఆఫర్స్ తో బిజీగా ఉండగా అఖిల్ కు పెద్దగా ఆఫర్స్ రావడం లేదని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ నిజానికి అతను ఒక ప్రాజెక్టు కోసం సెలెక్ట్ అయినట్లు ఇన్ సైడ్ టాక్. అది కూడా విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X