Tejashwini Gowda : వింటేజ్ లుక్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ భార్య .. ఛార్మినార్ వీధుల్లో గ్లామర్ ట్రీట్

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరను కూడా కన్నడ అమ్మాయిలు దున్నేస్తున్న సంగతి తెలిసిందే. ఈటీవీ, మాటీవీ .. ఏ టీవీ చూసినా కన్నడ కస్తూరిలదే హవా. చివరికి ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ తెలుగు 8లోనూ కన్నడిగుల ఆధిపత్యం కనిపిస్తోంది. అలా తెలుగు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తేజస్వినీ గౌడ. తెలుగు టెలివిజన్ రంగంలో అడుగుపెట్టడంతో పాటు తెలుగింటికి కోడలిగా వచ్చారామె. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తేజస్వినీ తన తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది . ఈ వివరాల్లోకి వెళితే..

1995 నవంబర్ 22న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో పుట్టారు తేజస్వినీ గౌడ. స్థానిక రాజ రాజశ్వేరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. ఈ క్రమంలో తమిళ్, కన్నడ సీరియల్స్‌లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. 2018లో కోయిలమ్మ సీరియల్‌తో తెలుగు వారిని పలకరించిన తేజస్వినీ గౌడ.. ఆ ధారావాహికతో మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కేరాఫ్ అనసూయ సీరియల్‌లోనూ తేజస్వినీ నటించారు.

bigg boss contestant amardeep Chowdary wife Tejashwini Gowda photoshoot at charminar

బుల్లితెర నటుడు అమర్‌దీప్ చౌదరితో ప్రేమలో పడ్డ తేజస్వినీ .. 2022 ఆగస్ట్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు తెలుగు, కన్నడ బుల్లితెర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. వివాహం తర్వాత తేజస్వినీ గౌడ నటనకు బ్రేక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. భర్త, కుటుంబంతో గడిపేందుకు ఆమె ప్రాధాన్యతనిస్తున్నారు.

ఇక అమర్‌దీప్ చౌదరి విషయానికి వస్తే జానకీ కలగనలేదు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతపురానికి చెందిన ఆయన తండ్రి అమీర్ బాషా, తల్లి రూపా.. వీరిద్దరూ కూచిపూడి డ్యాన్సర్లు కావడం విశేషం. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన అమర్‌దీప్ చౌదరి.. లండన్‌లో మాస్టర్స్ చేశారు. 2016లో తిరిగి భారతదేశానికి వచ్చిన అమర్ కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశాడు. తర్వాత నటనపై ఆసక్తితో షార్ట్‌ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించాడు. 2017లో ఉయ్యాల జంపాలా అనే సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాల్లోనూ ఆయన నటించారు.

ఇకపోతే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తేజస్వినీ గౌడ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఏం జరిగినా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌కే ఐకానిక్ ప్లేస్‌ లాంటి ఛార్మినార్ వద్ద తేజస్వినీ ఫోటో షూట్ నిర్వహించారు. లంగా వోణీ ధరించి వాలు జాడతో వయ్యారాలు ఒలకబొస్తున్న తేజస్వినీ వింటేజ్ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X