ఆరియానా బాయ్ ఫ్రెండ్ అతనేనా.? పొరపాటున పేరు లీక్ చేసిందా.. కావాలనే చెప్పిందా.?

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇక్కడి ప్రేక్షకుల మద్దతుతో మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని, నాలుగో సీజన్‌ను ఇటీవలే ప్రారంభించారు నిర్వహకులు. మొదట్లో చప్పగా సాగిన ఈ సీజన్... రానురానూ ఆసక్తికరంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దసరా స్పెషల్ ఎపిసోడ్‌ జరుగుతోన్న సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ తన బాయ్‌ ఫ్రెండ్ వివరాలు లీక్ చేసేసింది. ఇది ఆమె కావాలనే చేసిందా.? లేక పొరబడిందా.? అన్నది చర్చనీయాంశం అవుతోంది.

వాళ్లకే ప్రాధాన్యం.. అందులో ఆరియానా

వాళ్లకే ప్రాధాన్యం.. అందులో ఆరియానా

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ షోలోకి చాలా మంది కొత్త వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లందరూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమదైన శైలితో ఎంతో మంది ఫాలోవర్లను దక్కించుకున్న వాళ్లంతా ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యారు. వారిలో ఆరియానా గ్లోరీ ఒకరు.

ఎవరీ ఆరియానా.? ఎలా ఫేమ్ అయింది?

ఎవరీ ఆరియానా.? ఎలా ఫేమ్ అయింది?

హైదరాబాద్‌కు చెందిన అరియానా గ్లోరీ.. పలు టీవీ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే తన అందంతో పాటు వాక్చాతుర్యంతో ఎన్నో అవకాశాలు అందుకుంది. ఇలా వరుస ఆఫర్లతో బిజీ బిజీగా సాగుతున్న సమయంలోనే ఫేమస్ యూట్యూబ్ ఛానెల్‌లో పని చేసేందుకు సంతకం చేసింది. ఆ తర్వాత మరికొన్ని ఛానెళ్లలోకి ఎంట్రీ ఇచ్చి పాపులారిటీని సంపాదించుకుంది.

రాంగోపాల్ వర్మ చేసిన పనితో హైలైట్

రాంగోపాల్ వర్మ చేసిన పనితో హైలైట్

ఆమధ్య సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ‘మీకు ఈ మధ్య కాలంగా బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ప్రశ్నించిదామె. దానికి ఆర్జీవీ ‘చాలా మంది నచ్చారు. అందులో నువ్వు కూడా' అని బదులిచ్చాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీన్ని రాంగోపాల్ వర్మ స్వయంగా ట్వీట్ చేయడం విశేషం.

బిగ్ బాస్‌లో ప్రత్యేకంగా ఆరియానా గ్లోరీ

బిగ్ బాస్‌లో ప్రత్యేకంగా ఆరియానా గ్లోరీ

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఆడవాళ్లు అందరిలోనూ చిన్నగా కనిపించే ఆరియానా.. టాస్కుల్లో మాత్రం ప్రత్యర్థులకు పోటీని ఇస్తోంది. అంతేకాదు, ముక్కుసూటిగా తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఔరా అనిపిస్తోంది. బయటి వాటితో పాటు ఇంట్లో జరిగే అంశాల్లో మెచ్యూరిటీతో మాట్లాడుతూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. ఫలితంగా బలమైన కంటెస్టెంట్‌గా ఎదిగిందామె.

అవినాష్‌తో ట్రాక్.. ఇద్దరూ లవర్స్ అని

అవినాష్‌తో ట్రాక్.. ఇద్దరూ లవర్స్ అని

బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా తన ఆటతో ఎంతగా హైలైట్ అవుతుందో.. సహా కంటెస్టెంట్ ముక్కు అవినాష్‌తో కలిసి తిరుగుతూ అంతకంటే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ కారణంగానే ఈ లేడీ యాంకర్ అతడితో ప్రేమాయణం సాగిస్తుందన్న టాక్ బయట బాగా వినిపిస్తోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆరియానా చెప్పిన ఆర్వీ ఎవరు.?

ఆరియానా చెప్పిన ఆర్వీ ఎవరు.?

ఆదివారం జరిగిన దసరా స్పెషల్ ఎపిసోడ్‌‌లో ఆరియానా తన ఇంట్లో వాళ్ల వీడియో చూసిన అనంతరం మాట్లాడింది. ‘ఆర్వీ మనస్ఫూర్తిగా నిన్ను చాలా మిస్ అవుతున్నా. మూడేళ్లు నువ్వు నాతో ఉన్నావు. థ్యాంక్స్ ఆర్వీ నేనిక్కడ మాట్లాడలేకపోతున్నా. కానీ బయటకు వచ్చాక నీకే ఫస్ట్ కాల్ చేస్తా' అని చెప్పుకొచ్చింది. దీంతో ఆర్వీ ఎవరు అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారట.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
 ఆరియానా బాయ్ ఫ్రెండ్ అతనేనా.?

ఆరియానా బాయ్ ఫ్రెండ్ అతనేనా.?

హైపర్ ఆది అడిగిన ఓ ప్రశ్నకు తనకు బాయ్‌ ఫ్రెండ్ ఉన్నాడని ఆరియానా చెప్పింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. ‘వినీత్ నిన్ను భయంకరంగా మిస్ అవుతున్నా. నా లైఫ్‌లో బెస్ట్ అంటూ ఏదైనా ఉందా అంటే నువ్వు నాకు ఫ్రెండ్‌గా దొరకడమే. మొన్న నీకోసం ఏడ్చా. 12 ఏళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు. అప్పుడే నీ విలువ అర్థమైంది' అని చెప్పడంతో అతడే ఆరియానా లవర్ అన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X