ఆరియానాకు హ్యాండిచ్చిన బాయ్‌ఫ్రెండ్: ఆమెను కాదని మరొకరి పేరు చెప్పేశాడు.!

తెలుగులో ప్రసారం అవుతోన్న షోలలో మూడేళ్లుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోంది బిగ్ బాస్. దీనికి మన ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ ఇస్తున్న కారణంగానే వరుసగా మూడు సీజన్లను పూర్తి చేసి, నాలుగో దానిని సైతం మొదలెట్టారు. ఇక, ఈ సీజన్‌ కూడా గతంలో మాదిరిగానే మంచి టాక్‌తో నడుస్తోంది.

ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు రావడం మరింత ప్లస్ అయింది. అందరికీ వాళ్ల వాళ్ల తల్లిదండ్రలు ఎంట్రీ ఇవగా, ఆరియానా కోసం మాత్రం ఆమె బాయ్‌ఫ్రెండ్ వచ్చాడు. అతడు వచ్చాడని ఆనందిస్తున్న సమయంలోనే ఆమెకు హ్యాండిచ్చాడు. కంటెస్టెంట్లు అందరూ చూస్తుండగానే ఆమెను కాదని మరొకరి పేరు చెప్పాడు. అసలే జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే...

అద్భుతమైన టాలెంట్‌తో మంచి గుర్తింపు

అద్భుతమైన టాలెంట్‌తో మంచి గుర్తింపు

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేర్లలో ఆరియానా గ్లోరీ ఒకటి. యూట్యూబ్ ఛానెళ్ల హవా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈమె.. యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అందంతో పాటు వాక్చాతుర్యం ఉండడంతో చాలా తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది.

రాంగోపాల్ వర్మ కామెంట్‌తో హాట్ టాపిక్

రాంగోపాల్ వర్మ కామెంట్‌తో హాట్ టాపిక్

కొద్ది రోజుల క్రితం ఆరియానా గ్లోరీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఎన్నో విషయాలపై ఆయనను సూటిగా ప్రశ్నించింది. ఓ సందర్భంలో ‘మీకు ఈ మధ్య కాలంగా బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ప్రశ్నించింది. దీనికి ఆర్జీవీ ‘నువ్వే బాగా నచ్చావు' అంటూ కామెంట్ చేశాడు. అప్పటి నుంచి ఆరియానా ట్రెండ్ అయింది.

బిగ్ బాగ్‌లోకి ఎంట్రీ.. అల్లరి పిల్లగా పేరు

బిగ్ బాగ్‌లోకి ఎంట్రీ.. అల్లరి పిల్లగా పేరు

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్‌లోకి సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. అందులో ఆరియానా కూడా ఉంది. షో ఆరంభంలో కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉన్న ఆమె.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన మార్క్ చూపిస్తోంది. పట్టుదలగా టాస్కులు ఆడుతూ, ఉన్నది ఉన్నట్లు చెబుతోంది. ఈ క్రమంలోనే గొడవలకు సైతం దిగుతోంది.

అవినాష్‌తో లవ్ ట్రాక్‌తో మరింత ఫేమస్

అవినాష్‌తో లవ్ ట్రాక్‌తో మరింత ఫేమస్

ఈ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తున్నాడు. అలాంటి కంటెస్టెంట్‌తో ఆరియానా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున, స్పెషల్ హోస్ట్ అక్కినేని సమంత కూడా దీనిపై కామెంట్లు చేయడంతో మరింత హైలైట్ అయింది.

బిగ్ బాస్‌లోకి ఆరియానా బాయ్ ఫ్రెండ్

బిగ్ బాస్‌లోకి ఆరియానా బాయ్ ఫ్రెండ్

రెండు రోజులుగా బిగ్ బాస్‌ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అందరు కంటెస్టెంట్ల కోసం అమ్మలో, నాన్నలో, సోదరిలో రాగా.. ఆరియానా గ్లోరీ కోసం మాత్రం ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. దీంతో ఎమోషన్ అయిన ఆమె.. అతడి గొప్పదనం వివరించింది. అదే సమయంలో అతడికి ఐ లవ్ యూ అని కూడా చెప్పేసింది.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
ఆమెను కాదని మరొకరి పేరు చెప్పేశాడు.!

ఆమెను కాదని మరొకరి పేరు చెప్పేశాడు.!

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆరియానాతో పాటు అందరి ఆటతీరుపై వినీత్ కామెంట్ చేశాడు. ఇక, చివర్లో అభిజీత్‌‌ను ప్రత్యేకంగా పలకరించిన అతడు ‘నీకు పెద్ద ఫ్యాన్‌ను' అంటూ చెప్పాడు. దీంతో ఆరియానాతో పాటు మిగిలిన హౌస్‌మేట్లు అందరూ నోరెళ్లబెట్టేశారు. తన గర్ల్ ఫ్రెండ్‌ను కాదని మరొకరి పేరు చెప్పడంతో సోషల్ మీడియాలో అతడు ట్రెండ్ అవుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X